రేపు

ఎన్నడూ రాని రోజు

కానీ జీవితపు ప్రతీ ఆటనూ పాడుచేసే రోజు

 

నిందలన్నటికీ ఆలవాలమైన రోజు

భయసంకోచాలకు కారణమైన రోజు

జీవన జ్వాలా వికాసపు గొంతునులిమే రోజు

బ్రతుకునొక భ్రాంతిగా మార్చే రోజు

అపరిమితాన్ని పరిమితంలో బంధించే రొజు

 

ఎప్పటికీ రాని రోజు

కానీ ప్రపంచాన్నే శాసిస్తున్న రోజు!

 

ప్రేమాశీస్సులతో,
సద్గురు