ఇంటినే ఆలయంగా మార్చుకోండి!!
సాధనకు అనుకూలంగా ఉండేలా మీ ఇంటిని ఓ మందిరంలా మలచుకోవడం ఎలాగో తెలుసుకోవాలని ఉందా..? అందుకు ఏమీ చెయ్యాలో మనకు సద్గురు తెలియజేస్తున్నారు. అవి ఎంతో సరళమైన పనులు. అలా చేసుకుంటే మీ అంతర్ముఖ సాధనకు మీ ఇల్లు కూడా ఓ సంభావ్యతగా మారుతుంది.
సాధకుడు: సద్గురు, మా ఎదుగుదలకు అనుకూలంగా ఉండేలా మా ఇంటిలో వాతావరణాన్ని ఏర్పర్చుకోవాలంటే మేము ఏమి చేయవచ్చు?
సద్గురు: మీరు మరికొంత మంది కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నట్లయితే, సాధన కోసం ఒక స్థలాన్ని ఏర్పరచుకోవడం మంచిది, దాన్ని ఒక నిర్దిష్ట మార్గంలో ఉంచి, ఏ ఇతర ప్రయోజనం కోసం ఉపయోగించకండి. మీకు ఒక యంత్రం లేదా సన్నిధి ఉంటే, అది మంచిది. లేకపోతే, కనీసం ఒక పటాన్ని పెట్టి, ఒక లింగ జ్యోతి లేదా ఒక చమురు దీపం వెలిగించి, అక్కడ ప్రతిరోజూ ఓ పుష్పం ఉంచండి. మీరు ప్రత్యేకించి, శ్రద్ధగా ఓ స్థలాన్ని ఏర్పరచుకోగలిగితే, అది చాలా సహకారంగా ఉంటుంది - మీ స్వంత ఇంట్లోనే ఒక చిన్న ఆలయం ఉంటుంది. ఒక ఆలయం అన్నది పైకో లేదా కిందికో చూడటం కోసం కాదు. ఇది అంతర్ముఖులయ్యేందుకు ఓ సంభావ్యత. మీరు చేసే సాధన ఆ స్థలాన్ని మార్చగలదు. సాధన ద్వారా మీలో ఏదో ఒక అంశం ప్రకాశించాలి. మీరు ప్రకాశిస్తే, మీరే ఓ ఆలయం. ఆ చిన్న స్థలంలో మీరు పెట్టే పెట్టుబడులు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప ఫలితాలను చెల్లిస్తాయి. ఒక ఆలయాన్ని సృజించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. మీకు ఒక యంత్రం లేదా కేవలం ఒక చిత్ర పటం ఉన్నా, దాని దగ్గర ఎల్లప్పుడూ ఓ చమురు దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోండి.
యంత్రం లేదా చిత్ర పటం కింద, మీరు ఓ ముడి పట్టు వస్త్రం ఉంచవచ్చు. ఆ వస్త్రానికి రంగు వేయడం లాంటివి చేయకోడదు. ఇలా ఉన్న వస్త్రంలో ఓ జీవం ఉంటుంది. మీరు ఒక ముడి పట్టు వస్త్రాన్ని ఉపయోగించడం, మీరు ఒక సింథటిక్ వస్త్రం లేదా వేరొక దానిని ఉపయోగించడం కన్నా మెరుగైనది.
శూన్య ధ్యానానికి ఒక సూచన ఏమిటంటే మీరు ఎక్కడ కావాలంటే అక్కడి కూర్చుని చేయవచ్చునని - ఉదాహరణకు విమానాశ్రయంలో కూడా చేయవచ్చు. ఇలా చెప్పడానికి ఒక కారణం - శూన్య ధ్యానానికి ఒక నిర్దిష్ట స్వభావం ఉండడం. మరో కారణం ఏమిటంటే, ప్రజలు ధ్యానం చేయటం ప్రారంభించినప్పుడు, వారు ఒక నిర్దిష్ట వాతావరణాన్ని ఏర్పరచుకోలేక పోవడం వల్ల దానిని చెయ్యడం మానేయకోడదని మేము కోరుకుంటాము. శూన్య విషయానికి వస్తే, "ఇది ఎక్కడైనా చేయవచ్చు, కానీ ఏమైనప్పటికీ దీన్ని చెయ్యాలి." అలాగే, ఒక ముడి పట్టు వస్త్రం లేదని, మీరు ధ్యానం చేయడం మానేయకోడదు. కానీ మీరు ఒక నిర్దిష్ట వాతావరణాన్ని సృష్టించినట్లయితే, శక్తి మరింత సమర్థవంతంగా ఉంటుంది. స్థలాన్ని ఒక నిర్దిష్ట మార్గంలో ఉంచుకుంటే జరగవలసినవి చాలా సులభంగా జరుగుతాయి.