ప్రశ్న: ఈశాన్య ప్రాంత ప్రజలు మిగతా దేశంతో పోలిస్తే పరాయి వారము అని ఎందుకనుకుంటున్నారు? 

సద్గురు: ఈ విషయాన్ని చరిత్ర ఆధారంగా అర్థం చేసుకునే ప్రయత్నం కొంత చేయాలి. స్వాతంత్రం వచ్చాక ప్రణాళికల గురించి, ఈశాన్య ప్రాంత అభివృద్ధి ప్రణాళిక గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఈశాన్య ప్రాంత ప్రాకృతిక సౌందర్యాన్ని, గిరిజనుల సంస్కృతిని, చెడగొట్ట వద్దని జవహర్లాల్ నెహ్రూకి సలహా అందించారు.

 

ఈశాన్య ప్రాంత ప్రజలు తమ పర్యావరణంతో హాయిగా బ్రతుకుతున్నారని వారిని అనవసరంగా కలతకు లోనుచేయవద్దని ఆలోచించి మొదట్లో అలా నిర్ణయం తీసుకోబడింది. అక్కడకు కార్లు, రైళ్ళు, విమానాలు తీసుకొచ్చి మిగతా ప్రపంచంలాగా చేయకూడదు అనుకున్నారు. చేయవలసిన అవసరం లేదనుకున్నారు, వారు బాగానే ఉన్నారు అనే భావన ఉంది. కానీ ఈనాడు అలానే ఉండాలని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని, దానిని అమలు పరుస్తున్న ఒకే ఒక్క దేశం భూటాన్ అనుకుంటాను. 

The students of Northeastern Hill University, Shillong, Meghalaya, ready to welcome Sadhguru for the Youth and Truth event

 

మొదట తీసుకున్న నిర్ణయం గిరిజన సంస్కృతిని, ప్రాకృతిక సౌందర్యాన్ని భంగపరచకుండా ఉండటం. కానీ 20 ఏళ్ల తర్వాత అక్కడివారు తాము కూడా ఏదో కావాలని ఆశ పడుతుండటం వల్ల, ప్రభుత్వం తన ప్రణాళికను మార్చుకుంది. కానీ భారతదేశంలో ఇలా ప్రణాళిక మార్చడానికి ఎంతో సమయం పడుతుంది. అందువలనే అక్కడ అభివృద్ధి అంతా ప్రణాళికారహితంగా జరుగుతున్నది.

ఈరోజు సమాచారమంతా అందుబాటులో ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ న్యూయార్క్, లండన్ వంటి మహానగరాలను అక్కడికి వెళ్లకుండానే టెలివిజన్లలో, ఇంటర్నెట్లో చూడగలుగుతున్నారు. దానితో అందరూ పాశ్చాత్య జీవన విధానానికి లొంగిపోయారు. అందువల్లనే ఇక ప్రభుత్వం రైలు, రోడ్లు, విమానాలు గత 15, 20 సంవత్సరాల నుంచి నడుపుతున్నది. ఒకసారి అలా జరిగితే దేశమంతా ఈశాన్య ప్రాంతలో తిరుగుతుంటుంది.

పరిస్థితులు మారుతున్నాయి. ఇంకో ఐదేళ్లలో ఈశాన్య ప్రాంతం అలా పరాయి వారం అని భావించే అవకాశం ఉండదనుకుంటాను.

ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు నేను ‘లడక్’, ‘సియాచిన్’ ప్రాంతాలకు వెళ్లాను. అక్కడ ఎక్కడ చూసినా వేలకొద్దీ మోటార్ సైకిళ్ళను చూసి నేను నమ్మలేకపోయాను. ఇక అక్కడ సహజమైన లడక్ అంతరించిపోయింది. రోడ్ల నిండా విహార యాత్రికులే, కొండల మీద ట్రాఫిక్ జామ్ లు జరుగుతున్నాయి. ఇంతకు పూర్వం ముందు అటువంటివి వినను కూడా వినలేదు.

 

పరిస్థితులు మారుతున్నాయి. ఇంకో ఐదేళ్లలో ఈశాన్య ప్రాంతం అలా పరాయి వారం అని భావించే అవకాశం ఉండదను కుంటాను. ఆ ప్రాంతమంతా ప్రజలతో నిండిపోతుంది. అన్ని చోట్ల ప్రజలే కనపడతారు. వారు వన్యప్రాణులు చూట్టానికి వచ్చినవారు కాదు, కేవలం పర్యాటకులు. ప్రజలు  కావాలనుకున్నారు కాబట్టి అలానే జరుగుతుంది. మనం ఇది అభివృద్ధి అనుకోవచ్చు, కానీ అది దేశానికి ఒక రకమైన నష్టం.

ప్రేమాశిస్సులతో,
సద్గురు