ప్ర: సద్గురు, మీరు ఆదియోగి విగ్రహం  అంత పెద్దదిగా  ఎందుకు నిర్మించారు,  దర్శించిన వారంతా ఆ  విగ్రహాన్ని చూసి ఆశ్చర్య పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో, అందరూ గుర్తించటానికి అంత పెద్ద సైజులోనే చేయాలని మీరు అనుకుంటున్నారా?

సద్గురు: పెద్దది,  చిన్నది  అనేది,  మనుషులు  అనుకోవడం  లోనే  ఉంటుంది. ‘మా యోగా సెంటర్లో వారందరూ సద్గురూ ఇంకాస్త పెద్దదిగా నిర్మిస్తే బాగుండేది, వెనక ఉన్న కొండలతో పోలిస్తే చాలా చిన్నదిగా అనిపిస్తోంది’ అంటున్నారు. అంటే అంతా ప్రజలు అనుకోవడంలోనే ఉన్నది, నిజానికి విజువల్ ఇంపాక్టు అనేది ఒకటుంది. ‘మనకున్న 5 జ్ఞానేంద్రియాలలో నేను ఇప్పుడు 4 తీసి వేస్తాను’ అన్నాను అనుకోండి, అప్పుడు మీరు ఏది ఉంచుకుంటాము అంటారు. ముక్కునా, నాలుకనా ఏది ఉంచుకుంటారు?

ఆదియోగి సైజ్ గురించి కాదు. జ్యామెట్రీకి సంబంధించిననది. జ్యామెట్రీ చిన్న సైజ్ లో ఖచ్ఛితంగా తీసుకు రావడం కష్టం. మనం జ్యామెట్రీని ఖచ్ఛితంగా తీసుకు రావాలంటే అంత సైజు తీసుకురావడం  ముఖ్యం అయింది.

ప్ర: ప్రతిదీ  ముఖ్య మైనదే.

సద్గురు: అన్నీ ముఖ్యమైనవే, కానీ మీరు నాలుగు కోల్పోతుంటే? మీరు ఏది కావాలో నిర్ణయించుకోవడం తెలుసుకోవాలి, ఎందుకు అంటే జీవితం అలానే ఉన్నది. మీరు అన్నింటినీ ఉంచుకుంటాను అంటే నేను ఒప్పుకోను. అందుకనే మీరు ఏ నాల్గింటిని కోల్పోవడానికి సిద్ధపడుతున్నారు. దేనిని ఉంచుకుంటారు?

ప్ర: ఆ అయిదూ ఏవో చెబుతారా?

సద్గురు: నేను మీ కళ్ళనో, చెవులనో, నాలుకనో, ముక్కునో, స్పర్శనో తీసివేయాలంటే, మీరు దేనిని ఉంచుకుంటారు, చెప్పండి.

ప్రేక్షకులు: కళ్ళు!

Sadhguru: అవును, కళ్ళే. ఎందుకంటే అయిదింటిలో, మీకు ఇప్పుడు చూపే ముఖ్యమైనది. మీరు ఒక కుక్క అయ్యి ఉంటే, అప్పుడు మీరు ముక్కు అనేవారు. ఎందుకంటే ఒక కుక్క బ్రతుకు ముక్కు మీదనే ఆధారపడి ఉంది. కానీ మనిషికి చూపు ముఖ్యమైనది. ఆదియోగి సైజ్ గురించి కాదు. జ్యామెట్రీకి సంబంధించిననది. జ్యామెట్రీ చిన్న సైజ్ లో ఖచ్ఛితంగా తీసుకు రావడం కష్టం. మనం జ్యామెట్రీని ఖచ్ఛితంగా తీసుకు రావాలంటే అంత సైజు తీసుకురావడం ముఖ్యం అయింది.

ఆదియోగికి ఆ జామెట్రీ అందులో లగ్నమవటానికే. మీరు మీ ఇంటికి వెళ్లి మీ నాన్నగారు కూర్చున్న పద్ధతిని బట్టి, ఆయన కోపంగా ఉన్నారో, సంతోషంగా ఉన్నారో లేక విసుగ్గా ఉన్నారో మీకు తెలుస్తుంది. అదే విధంగా మేము ఆదియోగి నుంచి మూడు విషయాలు ప్రసరించాలి అనుకున్నాము, అవి ఉల్లాసము, నిశ్చలత్వం, మైమరపు. నేను ఆదియోగి ముఖం రూపురేఖలు నిర్ణయించడానికి రెండున్నర ఏళ్ళు పనిచేశాను. ఎన్నో ముఖం నమూనాలు చేశాము. అప్పుడు ఆ విగ్రహం సైజు 80 అడుగులు గా వచ్చింది. అప్పుడు మేము ఆ నెంబర్ కు కూడా ఒక ప్రాముఖ్యత ఉండాలనుకున్నాము. అందువల్ల అది 112 అడుగులు అయ్యింది.

మేము ఆదియోగి నుంచి మూడు విషయాలు ప్రసరించాలి అనుకున్నాము, అవి ఉల్లాసము, నిశ్చలత్వం, మైమరపు.

మానవుడు పరమోన్నత స్థితికి చేరడానికి ఆది యోగి అనేక విధానాలను ప్రతిపాదించినపుడు, ఆయన 112 విధానాలు ఇచ్చారు. అందువల్ల మేము 112 అడుగుల విగ్రహం తయారు చేసాము. 80 లేక 90 అడుగుల లోపు సైజుతో మేము ఆ జామెంట్రీ పొందలేక పోయే వారము. అందువల్ల ఇక సమస్య ఏముంది, ఆయనకు నచ్చిన నంబరునే చేద్దాము అనుకున్నాము. అందుకే మేము 112 అడుగుల విగ్రహం తయారు చేసాము.

Editor's Note: సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి.. UnplugWithSadhguru.org.

Youth and Truth Banner Image