వ్యక్తి అభ్యున్నతికి ఉపయోగపడే 5 సూత్రాలు.

 

  • అందరూ బాగుండాలని మనం అనుకుంటే, ప్రపంచంలో మనం చేసే ప్రతిపని గురించీ, అది చేసే విధానం గురించీ పునరాలోచించుకోవాలి.

1

  • విప్లవాలు కొన్నిసార్లు శ్రేయస్సుకు దారితీయవచ్చు. కాని సామాన్యంగా అవి ఒక నియంతను మరికొందరి నియంతలతో భర్తీచేస్తాయి.

2

  • ప్రతి రొజూ కాకపోయినా కనీసం నెలకోసారైనా, మీరు మరింత మెరుగైన వ్యక్తిగా పరివర్తన చెందుతున్నారా? లేదా? అని బేరీజు వేసుకోండి!

3

  • మీరెంత చైతన్యవంతంగా, ఉత్సాహంగా, పారవశ్యంగా ఉంటారన్నది కేవలం మీ తీక్షణత మీద ఆధారపడి ఉంటుంది.

4

  • ఆర్ధిక శ్రేయస్సుకై మనుషుల శ్రేయస్సుతో మనం రాజీ పడుతున్నాము. మన జీవితాలకు వివేకం మార్గనిర్దేశనం చేయవలసిన సమయం ఆసన్నమైనది.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను తెలుగులో పొందవచ్చు, ఇక్కడ సబ్ స్క్రైబ్ చేసుకోండి: Subscribe to Daily Mystic Quote.