పాలకూర, ఫ్రూట్ సలాడ్
ఈశా వంటగదిలో తయ్యరయ్యే ఈ పాలకూర, ఫ్రూట్ సలాడ్ తయ్యరీ విధానం మీకోసం అందిస్తున్నాము.
ArticleJul 31, 2016
ఈశా వంటగదిలో తయ్యరయ్యే ఈ పాలకూర, ఫ్రూట్ సలాడ్ తయ్యరీ విధానం మీకోసం అందిస్తున్నాము. రుచికరమైన ఈ సలాడ్ ని మీ ఇంట్లోనే తయ్యారుచేసుకొని ఆనందించండి! సలాడ్ కోసం కావలసిన పధార్ధాలు: పాలకూర ఆకులు - కడిగి, చిన్న ముక్కలుగా తరిగినవి: 3 కప్పులు 1 చిన్న దోసకాయ - కడిగి,చిన్న చతురస్రాలుగా తరగాలి 1 చిన్న ఆపిల్ - కడిగి,చిన్న చతురస్రాలుగా తరగాలి వేయించిన వేరుశనగ - బద్దలుగా చేసినవి: ¼ కప్పు జీడిపప్పు - బద్దలుగా చేసినవి: ¼ కప్పు తాజా కొత్తిమీర - తరిగినది 2-3 కొమ్మలు 1 చిన్న కమలా పండు - ఒలిచి, చిన్న ముక్కలుగా తరగాలి ఎండుద్రాక్ష - ¼ కప్పు
డ్రెస్సింగ్ కోసం
కమలా పండు - 1
నిమ్మకాయ - 1
తేనె 2 టేబుల్ స్పూన్లు
ఆలివ్ ఆయిల్: ½ కప్పు
రుచికి కావలసినంత నూరిన నల్ల మిరియాలు, ఉప్పు
తయారుచేసే విధానం: కమలా ముక్కలు ఇంకా ఎండుద్రాక్ష తప్ప, మిగిలిన అన్ని సలాడ్ పదార్థాలు పెద్ద బౌల్లో ఉంచండి. డ్రెస్సింగ్ కోసం: ఒక చిన్న గిన్నెలో, కమలా, నిమ్మ రసం లో తేనె, ఉప్పు, మిరియాల పొడి - అన్నిటినీ బాగా కలపండి. ఒక సన్నని ధారలా ఆలివ్ నూనెను ఈ మిశ్రమంలో బాగా కలిసేంతవరకు కలపండి. పెద్ద బౌల్ లో ఉన్న సలాడ్ పదార్థాలతో ఈ డ్రెస్సింగ్ ను కలపాలి. చివరగా, ఎండుద్రాక్ష ఇంకా కమలా ముక్కలు పైన అందంగా అమర్చండి. బాగా కలిపి అందరికి వడ్డించండి..అంతే..!