మందార పువ్వుతో టీ
ArticleJun 28, 2016
ఈ ఉజ్వలమైన, తాజా పానీయం మీ శరీరానికి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. తయారు చేయడం తేలిక, రోజంతా మిమ్మల్ని ఉత్తేజంగా ఉంచుతుంది.
కావలసిన పదార్థాలు :
ఒక కప్పు ఎండబెట్టిన మందార పువ్వులు (రసాయనాలు, పురుగుమందులు వాడకుండా పెంచిన, తినదగిన పువ్వులు)
1 (1।। అంగళపు) దాల్చిన చెక్క ముక్క
1/2।। అల్లంముక్క - బాగా కడిగిన, తాజాముక్క, పొట్టు తీయకుండా గుండ్రని బిళ్లలుగా కోయాలి.
రుచికి తగినంత తేనె/ తాటి బెల్లం
తయారుచేసే పద్ధతి:
- 4 కప్పుల నీటిని మరిగించండి. మందారపూలు, దాల్చిన చెక్క, అల్లంముక్కలు వేయండి. 5 నిమిషాలు మరిగించండి.
- పాత్రను దించి మూతపెట్టండి. 15-20 నిమిషాలు అలా ఉంచండి. (పూలను ఎక్కువసేపు నీళ్లలో ఉంచితే చేదురావచ్చు. మరింత పరిమళం, రుచికోసం మరికొన్ని ఎండు పూలు వేయవచ్చు)
- దాల్చిన చెక్క, అల్లం ముక్కలను గట్టిగా ఒత్తి పానీయాన్ని వడకట్టండి. వాటి పరిమళం చక్కగా దిగుతుంది.
- రుచికి తగ్గట్టు తేనె లేదా తాటిబెల్లం చేర్చండి. చల్లగాగాని, వేడిగా గాని తాగండి. దాన్ని రిఫ్రిజరేటర్‌లో పెట్టే ముందు పూర్తిగా చల్లబడనివ్వండి.
చిట్కాలు:
- దాల్చిన చెక్క ముక్క బదులుగా 2 టీ స్పూన్ల దాల్చిన పొడి కూడా వాడచ్చు, అట్లా వాడినప్పుడు బట్టతో వడకట్టండి.
- ఈ టీ ని సాధారణంగా రిఫ్రిజరేటర్లో చల్లబరిచి, కొన్ని పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కతో అలంకరించి సర్వ్ చేస్తుంటారు.