మనం ఉద్యోగాన్ని కొనసాగించాలా లేక ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించాలా? అనే సమయ నిర్వహణకు సంబంధించిన ప్రశ్నకు సద్గురు సమాధానం ఇస్తున్నారు. మీ వృత్తి ఏదైనా సరే, మీ గురించి మీకు ఎంత ఎక్కువ తెలిస్తే, మీరు అంత విజయవంతం కాగలరు అనే విషయాన్ని సద్గురు మనకు గుర్తుచేస్తున్నారు.

ప్రశ్న: మన ఆత్మ విశ్వాసం ఇంకా స్వయోగ్యత కోసం, మన కెరీర్ లేదా వృత్తిలో నిర్ధిష్టమైన లక్ష్యాలను సాధించాలనుకుంటే, అది నిజంగా మనల్ని బిజీగా ఉంచుతుంది. ఇక ఆత్మజ్ఞానం కోసం మనకి సమయం ఎక్కడ దొరుకుతుంది?

సద్గురు: ముందు మీకూ లేదా మరెవరికైనా, ఆత్మజ్ఞానం గురించి ఉండి ఉండే ఆలోచనలను సరి చేద్దాం. మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? మీరు కెమెరా ఉపయోగిస్తున్నారా? మీ జీవితంలో మీరు ఏ పరికరాన్ని ఉపయోగిస్తున్నా, ఆ పరికరం గురించి మీకు ఎంత ఎక్కువ తెలిస్తే, దాన్ని మీరు అంత బాగా నిర్వహించగలరనే విషయం నిజమేనా? ఒక కెమెరాని ఎలా ఆపరేట్ చేయాలో తెలియని వ్యక్తికి, మీరు దాన్ని ఇస్తే, అతను కనీసం దాన్ని ఆన్ కూడా చేయలేడు. అదే కెమెరాను మీరు అదేమిటో తెలిసినవారికి ఇస్తే, అతను ఎంతటి అద్భుతాన్ని చిత్రీకరిస్తాడంతే, ప్రజలు చీకటిలో కూర్చుని గంటల తరబడి దాన్ని చూడటానికి ఇష్టపడతారు.

మీరు గనుక నాతో కలిసి డ్రైవ్ చేస్తే, మీరు ఒక కారుతో చేయగలిగే అన్ని విషయాలనూ నేను మీకు చూపిస్తాను. మీరు దేని గురించైనా ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, దానితో మీరు ఏమి చేయగలరు అనేది అంతగా మెరుగుపడుతుంది. మనం నిర్వహించే ప్రతిదాని విషయంలో ఇది నిజమైనప్పుడు, అది ‘మీ’ విషయంలో కూడా నిజమే అవుతుందా లేదా? మీరు దాని గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే, మీరు దాన్ని అంత బాగా నిర్వహించగలుగుతారు. ఆత్మ జ్ఞానాన్ని పొందడం అనేదాన్ని, అదేదో హిమాలయ గుహలో జరిగే విషయంగా భావించవద్దు. ఇది అక్కడ కూడా జరిగింది, కానీ మీరు దానిని మీ దృక్కోణం నుండి అర్థం చేసుకోవాలని నేను అంటున్నాను.

ఆత్మజ్ఞానం పొందడం అంటే కేవలం మీ గురించి తెలుసుకోవడమే. ఇది మీ వృత్తికి వ్యతిరేకమైనది ఎలా అవుతుంది? అది మీ జీవితంలో మీరు చేయాలనుకునే దేనికైనా వ్యతిరేకమైనదిగా ఎలా అవుతుంది? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ గురించి మీకు ఏమీ తెలియనప్పుడు, మీరు ఒక సమర్థవంతమైన జీవితాన్ని ఎలా గడపగలుగుతారు? జీవిత ప్రక్రియ గురించి ఏమీ తెలియకుండానే, ధీమాగా ఉండడం ఎలానో ప్రజలు ఒకరికి ఒకరు నేర్పడానికి ప్రయత్నిస్తున్నారు. స్పష్టత లేని ధీమా ఒక విపత్తు.

ఆత్మ జ్ఞానం పొందడం అంటే కేవలం మీ గురించి తెలుసుకోవడమే. ఇది మీ వృత్తికి వ్యతిరేకమైనది ఎలా అవుతుంది? అది మీ జీవితంలో మీరు చేయాలనుకునే దేనికైనా వ్యతిరేకమైనదిగా ఎలా అవుతుంది

దురదృష్టవశాత్తు, మనం ధీమాగా ఉండడం అనేది స్పష్టతకు ఒక ప్రత్యామ్నాయం అని అనుకుంటాము. ఉదాహరణకి మేము మీ కళ్ళకు గంతలు కట్టి, చుట్టూ నడవమని అడిగాము అనుకుందాం. మీరు తెలివిగలవారైతే, మీరు ఇక్కడ, అక్కడ, తడుముతూ, నెమ్మదిగా చుట్టూ నడుస్తూ, గోడలను తాకుతూ, మీ కాళ్ళతో, చేతులతో పరిశీలిస్తూ మీ మార్గాన్ని కనుగొంటారు. కానీ మీరు చాలా ధీమాగా చూడకుండా నడిస్తే, రాళ్ళు మీ పట్ల దయ చూపవు. స్పష్టత లేకుండా మీరు ధీమాగా ఉంటే, జీవితం మీ పట్ల దయ చూపదు. ప్రపంచంలో మీ పనిని చేయడానికి, మీరు చేస్తున్న దానిలో విజయవంతం కావడానికి, మీ జీవితంలో ఏదైనా బాగా చేయటానికి, మీకు స్పష్టత అవసరం, ధీమా కాదు.



మీ గురించి మీరు ఎంత ఎక్కువ తెలుసుకుంటే, మీతో మీరు అంత మెరుగైన విషయాలు చేయగలుగుతారు. ఇతర సాధనాల విషయానికి వస్తే, మీరు వాటి గురించి బయటి నుండి మాత్రమే తెలుసుకోగలుగుతారు. మీ గురించి, మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. మీరు దాన్ని అంతర్ముఖంగా చూడవచ్చు. దాని గురించి మీకు పూర్తిగా తెలిస్తే, అది ఒక మ్యాజిక్ అవుతుంది. మీరు ఏమి చేసినా, అది ఒక మ్యాజిక్ అవుతుంది. మీరు కూర్చుని ఉన్నా, మీరు పనులు చేయవచ్చు, మీరు కళ్ళు మూసుకుని ఉన్నా, మీరు పనులు చేయవచ్చు, మీరు నిద్రపోతూ ఉన్నా కూడా, మీరు పనులు చేయవచ్చు. ఒక సారి మీకు ఈ వ్యవస్థ గురించి పూర్తిగా తెలిసాక, మీరు మేల్కొని లేదా నిద్రలో ఉన్నా, మీరు ఈ వ్యవస్థతో ఇంద్రజాలం లాంటి అద్భుతమైన పనులను చేయగలరు.

Editor’s Note: In modern societies, enhancing the quality of our life has become one of our main objectives. In this pursuit, we tend to emphasize enhancing external situations: our job, business, family and the abounding accumulation of material things; in spite of all the efforts, our personal and professional lives are too often painfully lacking happiness and fulfilment.

In the ebook “Inner Management”, Sadhguru shifts our focus to the inside, pointing out a way to establish a true sense of inner peace and wellbeing. Download now.