ప్రశ్న: సద్గురూ, మీరెక్కడికి వెళ్ళినా ఒక ప్రత్యేక తరహాలో ఎందుకు కూర్చుంటారు? ఎడమకాలి చెప్పుతీసివేసి, మడచి, కుడికాలు నేలమీదే ఉంచి కూర్చుంటారు. అది మీ పద్ధతా? ఎవరైనా కూర్చోడానికి అదే మంచి పద్ధతా?

సద్గురు: మీరింకా ఇండియన్ స్టైల్ టాయిలెట్ వాడుతున్నారా? 

ప్రశ్న: అవును. 

సద్గురు: మీరు ఫలానా పద్ధతిలో కూర్చుంటారా? ఎందుకని? ఎందుకంటే శరీరం ఆ విధంగా తయారు చేయబడింది కాబట్టి. ఏదో విదేశీ విశ్వవిద్యాలయం పరిశోధన చేసి ఇదే విసర్జించడానికి ఉత్తమ విధానం అని చెప్పింది. మీరు తినేవి కడుపులోకి వెళ్ళి అంతా బయటకు రావాలంటే అదే మంచి పద్ధతి. బయటకు రావలసింది బయటకు రాకపోతే అది మీ బుర్రలోకి చేయరుతుంది. 

సరైన పద్ధతిలోకి తీసుకురావడం

యోగ శాస్త్రాలలోకొన్ని శరీర భంగిమలు కొన్ని పనులకు ఉత్తమం. మీకు హఠయోగా యోగ సాధనలోని శారీరక భంగిమలు కూడా శరీరాన్ని  ఒకరకమైన ఆకారంలోకి వంచి Geometric Perfection తీసుకువస్తుంది. మీ జ్యామితి - సృష్టి యొక్క విశాల జ్యామితితో అనుసంధానమౌతుంది, మీరెప్పుడూ గతి తప్పరు.

మీరెంత బాలెన్స్ గా ఉన్నారు, మీరెంత స్పష్టంగా చూడ గలుగుతున్నారు అనేది మీరెంత బాగా సింక్ అయ్యారు అన్నదాన్నిబట్టి ఉంటుంది. మీరు మనుషులతోనైనా, చెట్లతోనైనా, ప్రాణులతోనైనా లేక మీ చుట్టూ ఉన్న స్థలంతోనైనా ఎంత సింకై ఉంటారో మీ జీవితం స్మూత్ గా, మీరు చేసేవి ఏమాత్రం ఫ్రిక్షన్ లేకుండా ఉంటుంది.

నేనెప్పుడూ ఇలానే కూర్చోను, మాట్లాడుతున్నపపుడే అలా కూర్చుంటాను. సిద్ధాసనం అని ఒకటుంది, దాని గురించి చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఒకటేమిటంటే ఎడమ పాదంలో ఒక పాయింట్ ఉంది దానిని సైన్స్ ‘అఛెల్లీస్ హీల్’ అంటారు, ఆ మనిషి గురించి విన్నారా?

మీరు ఆ ‘అఛెల్లీస్’ ను మూలాధారంలో పెడితే, ఈ రెండూ కలిస్తే మీలో చాలా విషయాలు స్పష్టమౌతాయి. మీ ఆలోచనలు, మీ భావావేశాలు పడిపోతాయి, మీ చుట్టూ జరుగుతున్నదాని మీద మీకు స్పష్టత ఉంటుంది. 

మీరు ఆ ‘అఛెల్లీస్’ ను మూలాధారంలో పెడితే, ఈ రెండూ కలిస్తే మీలో చాలా విషయాలు స్పష్టమౌతాయి.

మీకు తెలుసా ‘అఛెల్లీస్’ కాలి మడమకి ఒక బాణం తగలడం వల్ల మరణించాడు అని. ఎవరైనా పాదంలో బాణం తగిలేతే మరణించడం విన్నారా? ‘అఛెల్లీస్’ దానిమూలంగానే చనిపోయాడు. అలాగే  అంతకన్నా చాలా ముందే ఆ విధంగానే భారతదేశంలో ఇలా చనిపోయింది, కృష్ణుడు. ఈ కథ మీకేమి చెబుతోందంటే వారు  నైపుణ్యంగా చంపబడ్డారు. ఏదో గొంతు కోయడం వల్లనో, తల పగల కొట్టడం వల్లనో కాదు. కేవలం పాదంలో ‘అఛెల్లీస్’ పాయింట్ ఛేదించడం వల్ల వారు చనిపోయారు. శరీరంలో ఒక శక్తి ప్రసార విధానం ఉంది. మీరు ఆ ‘అఛెల్లీస్’ పాయింట్ ను మూలాధారంతో కలపడం వల్ల మీరు ఏ పక్షం తీసుకోకుండా బాలెన్స్ డు గా ఉంటారు.

ఏ పక్షం తీసుకోకుండా ఉండడం

మనకందరికీ అభిప్రాయాలు, ఉద్దేశ్యాలూ, సిద్ధాంతాలూ ఉంటాయి. మీ అనుభవాలు, మీరు మీ మనస్సులో తీసుకున్న జీవితం అనుభవాలు, ముద్రలు  మీరు చూస్తున్న వాటినన్నిటినీ ప్రభావితం చేస్తాయి. మీరు ఒకదానిని ఇష్ట పడతారు, వేరొకదానిని ద్వేషిస్తారు. ఒకరిని ఇష్ట పడతారు, వేరొకరిని ద్వేషిస్తారు, దీనికంతకూ కారణం మీరు ఎప్పుడూ మీదైన ఒక ప్రత్యేక ఉద్దేశం గుండా అన్నీ చూస్తారు. కాని మీకు నిజంగా జీవితం గురించి తెలుసుకోవాలంటే, ముఖ్యమైన దేమిటంటే మీరు ఏ పక్షమూ తీసుకోకూడదు. మీరు అన్నింటినీ జీవితంలో ప్రతిక్షణం నూతనంగా చూడాలి.  

నాతోనే ఉంటూ, ప్రతి రోజూ నాతోనే పని చేస్తూ గత ముప్ఫై ఏళ్ళుగా నాతోనే ఉన్నవారు ఉన్నారు, కాని వారిగురించి నాకు ఒక్క అభిప్రాయం కూడా లేదు.

ప్రజలకు ఇది అర్థం చేసుకోవడం అంత సులువుకాదు. నాతోనే ఉంటూ, ప్రతి రోజూ నాతోనే పని చేస్తూ గత ముప్ఫై ఏళ్ళుగా నాతోనే ఉన్నవారు ఉన్నారు, కాని వారిగురించి నాకు ఒక్క అభిప్రాయం కూడా లేదు. నేనేదైనా పని చేయాలనుకున్నప్పుడు మాత్రమే వారి సామర్ధ్యాలు, ఇతర విషయాల గురించి ఆలోచిస్తాను. కాని వారి మీద ఎటువంటి అభిప్రాయమూ ఏర్పరుచుకోలేదు. ఈ పాటికి మీరు అభిప్రాయాలు చేసుకుని ఉండవచ్చు, కాని నాకు లేవు, ఎందువల్లనంటే ఆధ్యాత్మిక ప్రక్రియకు అదే ఆధారం, ఏమిటంటే ప్రతిజీవినీ ఒక అవకాశంగానే మేము చూస్తాము. 

అవకాశానికీ, వాస్తవానికీ మధ్య కొంత దూరం ఉన్నది. కొందరికి ఆ దూరాన్ని నడవటానికి ధైర్యం ఉంటుంది, కొందరికి ఉండదు. కాని ప్రతి జీవికీ అవకాశం మాత్రం ఉంది. ఆ అవకాశం సజీవంగా ఉండాలంటే, మీరు ఎవ్వరి మీదా అభిప్రాయాలను ఏర్పరచుకోకూడదు.

మంచి, చెడు, అంటూ మీరు అభిప్రాయాలు ఏర్పరచుకోకూడదు. వారు ప్రస్తుతం ఉన్న విధంగా చూడండి అంతే. మీరు ఈ క్షణంలో ఎలా ఉన్నారు అదే నాకు అవసరం. మీరు నిన్న ఎలా ఉండేవారు అనేది నేను పట్టించుకోను. రేపెలా ఉంటారో అంటే, చూద్దాం. రేపు అనేది మనం సృష్టించుకునేది, ఇప్పుడు నిర్ణయింపబడేది కాదు. 

సరైన జ్యామితీలో ఉండగలగడం

శరీరంలో ఒక రకమైన జ్యామితి ఉంది. ప్రస్తుతం ప్రాశ్చాత్య సంస్కృతులు ఏం చెబుతున్నాయంటే, యోగా ఒక శరీరిక వ్యాయామం అని అంటున్నాయి. దాని బదులు మీరు  బాక్సింగ్, టెన్నిస్ మీ శరీర సౌష్టవాన్ని పెంచుతాయి. మీరు ఫిట్ గా ఉండాలంటే పరిగెత్తండి, కొండలెక్కండి, టెన్నిస్ ఆడండి, మరేదైనా చేయండి. యోగా ఫిట్ నెస్ కోసం కాదు. ఫిట్ నెస్ అనేది యోగాలో ఒక భాగంగా రావచ్చు. యోగాలో అసలు విషయం ఏమిటంటే జీవితానికి సరైన జ్యామితీ తీసుకురావడం. ఎందుకనంటే భౌతిక జగత్తు అంతా జ్యామితీతోనే ఉంది.

ఒక బిల్డింగ్ అలా చాలాకాలం నిలబడుతుందా, లేక మీ నెత్తిన పడుతుందా అనేది దాని జ్యామితీ మీదే ఆధారపడి ఉంది. శరీర విషయంలో కూడా అంతే, ఖగోళ వ్యవస్థ ఎంతో, విశ్వం అంతే, అన్నీ అంతే.

భూమి అలా సూర్యడి చుట్టూ తిరగడానికి కారణం అదేదోఓ పెద్ద ఇనుప గొలుసుతో కట్టబడటం వల్ల కాదు, కాని జ్యామితీ మూలంగా. కాస్త తేడా వస్తే ఇక అంతే, ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీరు మీ ఆధారభూత మైన జ్యామితీ నుండి తప్పితే, ఇక అంతే. 

మీరు ఫిట్ గా ఉండాలంటే పరిగెత్తండి, కొండలెక్కండి, టెన్నిస్ ఆడండి, మరేదైనా చేయండి. యోగా ఫిట్ నెస్ కోసం కాదు. ఫిట్ నెస్ అనేది యోగాలో ఒక భాగంగా రావచ్చు. యోగాలో అసలు విషయం ఏమిటంటే జీవితానికి సరైన జ్యామితీ తీసుకురావడం. ఎందుకనంటే భౌతిక జగత్తు అంతా జ్యామితీతోనే ఉంది.

మీలో సరైన జ్యామితీ తీసుకురావడానికి మీరు చిన్న వయసులోనే సరైనవిధంగా చేయవలసింది చేయడం ముఖ్యం. అప్పుడే మీరు జీవితంలో యోగ్యులౌతారు. తమ జీవితంలో అంతా బాగానే జరగాలి అనుకునేవారు జీవితానికి అనర్హులు ఎందువల్లనంటే మీకు కఠిన పరిస్థితుల్లో ఎలా నెగ్గుకు రావాలో తెలియదు. అందువల్ల మీరు అన్ని అవకాశాలనూ జారవిడచుకుంటారు. మీరు గొప్ప అవకాశలను జారవిడచుకుంటారు ఎందువల్లనంటే మీరు ఆ కాస్త కష్టపరిస్థితులని తప్పించుకోజూస్తున్నారు. మీరు జ్యామెట్రికల్ గా ఒక విధమైన అనుకూలతలో ఉంటే, మీరు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కుంటారు, అది ఏదైనా సరే. 

సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి. UnplugWithSadhguru.org.

Youth and Truth Banner Image