రేపు..

సద్గురు రేపు గురించి రాసిన ఓ కవిత మీ కోసం.
Tomorrow
 

రేపు

ఎన్నడూ రాని రోజు

కానీ జీవితపు ప్రతీ ఆటనూ పాడుచేసే రోజు

 

నిందలన్నటికీ ఆలవాలమైన రోజు

భయసంకోచాలకు కారణమైన రోజు

జీవన జ్వాలా వికాసపు గొంతునులిమే రోజు

బ్రతుకునొక భ్రాంతిగా మార్చే రోజు

అపరిమితాన్ని పరిమితంలో బంధించే రొజు

 

ఎప్పటికీ రాని రోజు

కానీ ప్రపంచాన్నే శాసిస్తున్న రోజు!

 

ప్రేమాశీస్సులతో,
సద్గురు

 

 

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1