సద్గురు: ప్రభుత్వ యంత్రాంగం అనేది చాలా మంది అనుకుంటున్నట్టుగా, దేశ జీవన గతికి ఒక ప్రతిబంధకం కాదు. మన దేశం నిలబడుతున్నది దాని రాజకీయ నాయకులపైనో లేదా ఎన్నికల వ్యవస్థపైనో కాదు, మన దేశం నిలబడుతున్నది దాని పాలనా యంత్రాంగంపై. మన దేశం ఒక నిర్దిష్ట శిక్షణతో, క్రియాత్మకమైన ఇంకా చక్కగా వ్యవస్థీకృతమైన పరిపాలనా వ్యవస్థను కలిగి ఉన్నందువల్లే, క్రియాత్మకంగా ఉండగలుగుతుంది.

రాజకీయ నాయకులకు వచ్చే ఐదేళ్ళ పదవీకాలం కంటే, ఈ దేశాన్ని పరిపాలించడం అనేది ఎంతో పెద్ద బాధ్యత. కాబట్టి దేశం దాని భారంతోనే అది కిర్రుకిర్రులాడకుండా ఉండాలంటే, ప్రభుత్వాధికారులు ఒక ఒత్తిడి రహితమైన, ఇంకా అనారోగ్య రహితమైన విధమైన జీవనాన్ని గడపగలిగేలా వారికి సాధికారత ఇవ్వడం అనేది చాలా ముఖ్యం.

ఈ రోజున అది కిర్రుమంటున్నదీ అంటే, అందుకు కారణం దాని ప్రాథమిక నిర్మాణం దాని పరిమితులకు అతీతంగా నెట్టబడుతుండడం వల్లే. మన ప్రభుత్వాధికారులను సమంజసం కాని పనులు చేయమని అడుగుతున్నారు. కొన్ని కొన్ని సార్లు చట్టాన్ని అమలుపరచమనికాక, దాన్ని అతిక్రమించమని అడగడం జరుగుతుంది. ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలలో ఎంతో ప్రయాసలకోర్చేలా చేస్తోంది.

కార్పొరేట్ నిర్వహణ చాలావరకు ఏక దిశాత్మకంగా ఉన్నప్పటికీ, పరిపాలనా నిర్వహణ అనేది, వ్యక్తులు మరియు వనరుల గురించి సంక్లిష్టమైన ఇంకా బహుమితీయమైన ఒప్పందాలతో కూడుకుని ఉంటుంది. ఒకరు తమ అంతర్గత పరిస్థితులను తమ అధీనంలోకి తీసుకుని, బాహ్య పరిస్థితుల వల్ల అవి కుదుపుకు గురికాకుండా ఉండేలా చూసుకుంటే తప్ప, ఈ పని స్వభావం వారిపై ఎంతో దుష్ప్రభావాన్ని చూపిస్తుంది.

ఈ పాలనా యంత్రాంగాన్ని కేవలం పైపైన చూడడం కాక, దీన్ని దేశాన్ని కలిపి ఉంచే ఒక స్నాయుబంధనంగా (స్నాయువును ఎముకతో కలిపెడు త్రాడువంటి నరము) చూసేలా చేయాలనేదే నా ప్రయత్నం. ఈ స్నాయుబంధనం బలోపేతం అయ్యేది, ప్రతి ఒక్క ప్రభుత్వాధికారిలో కూడా, ఒక నిర్దిష్ట స్థాయి అంతర్గత సమతుల్యతని ఇంకా బలాన్నీ తీసుకువచ్చినప్పుడు మాత్రమే.

ప్రభుత్వాధికారులు: శ్రేయస్సుకు ఉపకరణాలు

వలసరాజ్యాల కాలంలో, ప్రభుత్వాధికారులను తరచుగా దౌర్జన్యం చేయడానికి ఉపయోగపడే ఉపకరణాలుగా చూసే వాళ్ళు. ఎక్కువగా వారిని పన్ను వసూలు చేసేవారనీ, బలవంతపు చట్టాలను అమలుచేసే వారనీ పిలిచేవారు. దురదృష్టవశాత్తు, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో, జిల్లా నిర్వాహకులను కలెక్టర్లని పిలుస్తారు. పరోక్షంగా చెడుని సూచించే ఈ వాడుకని నిర్మూలించాలి.

ప్రతీ ప్రభుత్వాధికారికీ కూడా తన పదవీ కాలంలో కొన్ని లక్షల మంది జీవితాలను తాకే అవకాశం ఉంటుంది. ప్రజల జీవితాలను మార్చగలిగే ఈ సామర్థ్యం, ఒక గొప్ప భాగ్యం.

ప్రజలు ప్రభుత్వాధికారులను తమకు శ్రేయస్సును చేకూర్చే వారిగా చూడాలి. ఇది సాధ్యమయ్యేది, కేవలం ముందు ప్రభుత్వాధికారులు తమలో తాము ఒక సహజమైన శ్రేయస్సు స్థితికి చేరుకోగలిగినప్పుడే. ప్రతీ ప్రభుత్వాధికారికీ కూడా తన పదవీ కాలంలో కొన్ని లక్షల మంది జీవితాలను తాకే అవకాశం ఉంటుంది. ప్రజల జీవితాలను మార్చగలిగే ఈ సామర్థ్యం, ఒక గొప్ప భాగ్యం. జనాభాలో అధిక భాగం మంది జీవితాలు ఆశాజనకంగా లేని, మనదేశం లాంటి దేశంలో, ఇది మరింత గొప్ప భాగ్యంగా పరిణమిస్తుంది.

కానీ ఆ భాగ్యం ఒక భారంగా మారకుండా చూడడం అనేది చాలా ముఖ్యం. ఈ కారణంగానే ప్రతి ప్రభుత్వాధికారీ కూడా తనలో తాను, ఒక సహజమైన ఆహ్లాద స్థితికి చేరుకోవడం అనేది తప్పనిసరి అవుతుంది. మనలో మనం ఒక ఆహ్లాదమైన స్థితిలో ఉంటే తప్ప, వేరొకరి జీవితంపై ప్రభావం చూపే పనిని మనం చేపట్టకూడదు.

సాధారణంగా వినబడే సాకు ఏమిటంటే, “లేదు, లేదు, మాకు ధ్యానం చేయడానికి సమయం లేదు.” కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు చేస్తున్నది ముఖ్యమైన పని అయితే, అప్పుడు మీరు ఎవరు అన్నదాన్ని మెరుగు పరుచుకోవడం చాలా ముఖ్యం.

ఆహ్లాదంగా ఉండేలా మిమ్మల్ని మీరు ఇంజినీర్ చేసుకోండి

ఈ ప్రయత్నంలో భాగంగా, మేము (ఈశా) కొన్ని వందల మంది ప్రభుత్వ అధికారులకు, అవసరమైన విధంగా తమని తాము ఇంజినీర్ చేసుకోగలిగే విధంగా, ఇన్నర్ ఇంజినీరింగ్ అనే ఒక శాస్త్రీయ ప్రక్రియ ద్వారా సాధికారతను చేకుర్చాము. ఒకవేళ మానవుని అంతర్గత యంత్రాంగం - ఎందులో అయితే ఈ సృష్టి మూలమే నివాసమై ఉంటుందో - దాన్ని గనుక సజీవంగానూ, ఇంకా చక్కగా కందెన వేయబడినదిగానూ ఉంచితే, ఒకరు ప్రతి పరిస్థితినీ దాటగలుగుతారు, అది ఎంతటి విపరీతమైనదైనా సరే. దీనర్థం ఏమిటంటే, మీరు జీవితంతో మీకు ఇష్టమొచ్చినట్టు ఆడుకోవచ్చు, కానీ అది మీ పైన ఒక్క చారను కూడా మిగల్చదు.

దేశం, దాని భారంతోనే అది కిర్రుకిర్రులాడకుండా ఉండాలంటే, ప్రభుత్వాధికారులు ఒక ఒత్తిడి రహితమైన, ఇంకా అనారోగ్య రహితమైన విధమైన జీవనాన్ని గడపగలిగేలా వారికి సాధికారత ఇవ్వడం అనేది చాలా ముఖ్యం.

ప్రతి మానవ అనుభూతికీ ఒక రసాయనిక ఆధారం ఉంటుంది. నేను, “ఇన్నర్ ఇంజినీరింగ్” అన్నప్పుడు, మీలో మీరు ఒక సరియైన రసాయనికతని తయారు చేసుకోగలిగేలా చేసే ఒక టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాను. తద్వారా మీరు మీలో, ఎరుకతో - నిరంతరం ఒక పారవశ్య స్థితిని సృష్టించుకోవచ్చు. ప్రస్తుతం అది యాదృచ్ఛికంగా జరుగుతుంది, దాన్ని బయటనున్న ఏదో ప్రేరేపిస్తుంది. కానీ, సుర్యాస్తమయాన్ని చూస్తూనో, లేదా మీకు ప్రియమైన వారిని చూస్తూనో మీరు దాన్ని మీకు తెలీకుండానే సృష్టించగలుగుతున్నప్పుడు, మీరు దాన్ని ఎరుకతో సృష్టించగలిగే అవకాశం కూడా ఉంది.

ఈ రోజున, కేవలం శ్రేయస్సుని చేకూర్చే కొన్ని శక్తివంతమైన ప్రక్రియలను అవలంబించడం ద్వారా, తమ జీవిత అనుభవం ఆనందకరంగానూ ఇంకా పారవశ్య భరితంగానూ మారిన వారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. అనాదిగా, మన సంస్కృతిలోని ప్రాథమిక సారం ఎప్పుడూ కూడా ఈ పరివర్తనని తెచ్చే సాంకేతిక పరిజ్ఞానాలలో పాతుకునే ఉంది.

ఒకసారి ఈ ప్రపంచంలో, మీ అనుభూతిని నిర్దేశించే వ్యక్తి మీరే అయినప్పుడు, ఇక మీరు పూర్తి పరిత్యాగ భావంతో జీవించవచ్చు. మీరు ఎవరి నుండో, లేదా దేని నుండో ఆనందాన్ని పిండాల్సిన అవసరం లేదు, మీకుగా మీరే బాగుంటారు. ఒకసారి బాధను గురించిన భయం మీలోనుంచి తీసివేయబడితే, మీరు జీవితంలో పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ముందుకెళతారు, సగం సగం అడుగులతో కాదు. అప్పుడు జీవితం ఒక ఆట అవుతుంది. మీరు జీవితాన్ని ఎలా అవసరమైతే అలా ఆడతారు.

Editor’s Note: Bha-ra-ta: The Rhythm of a Nation” includes more of Sadhguru’s insights on Bharat, its past, present and future, and the profundity of its culture. The ebook is available on a “Pay As You Wish” basis. (Click “Claim for Free” or enter “0” in the price field if you want it gratis).