ప్రశ్న: సద్గురు, నేను క్రొత్త ప్రాంతానికి మారినప్పుడల్లా క్రొత్త వ్యక్తులతో కలసి పోవడం కష్టంగా ఉంటుంది. గతం గురించి అప్పుడు నేను కలసి ఉన్న వ్యక్తుల గురించి ఆలోచిస్తూ ఉంటాను. నేను ఎమి చెయ్యాలి?

సద్గురు: కొంతమంది భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నారు, గతం గురించి కొంతమంది ఆలోచిస్తున్నారు, ఎవరూ ఇక్కడ లేరన్న మాట! మీరు వయసైన వారితో మాట్లాడితే - వారు, "ఓహ్, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే, నేను కాలేజీలో ఉన్నప్పుడు ...” ఇలాంటివి మీరు విన్నారా? కాని వారు స్కూల్లో, కాలేజీలో ఉన్నప్పుడు, వారు కూడా మీలాగానే సణుగుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు వారు తమ జీవితాలను ఇంత దిగాలుగా తయారు చేసుకున్నాక, తిరిగి చూసుకుంటే - వెంటనే వారికి స్కూల్ జీవితం ఎంతో అద్భుతంగా ఉండేదనిపిస్తుంది. మీరు ఎప్పుడూ గతంలోనే జీవితం బావుండేదనుకుంటే, ఇప్పుడు సరిగ్గా లేరని అర్ధం. “నిన్న” అనేది ఎప్పుడూ  ఉత్తమమైన రోజు కాకూడదు. మీ జీవితంలో ఈ రోజే ఉత్తమమైన రోజుగా ఉండాలి. ఎందుకంటే, మీకు మరో రోజు అనుభవం ఉంది కదా..! కాబట్టి, మీరు మీ జీవితంలో ఉత్తమమైన రోజుగా ఈ రోజునే చేసుకోవాలి? మీ జీవితం ఎలా ఉండాలంటే, ఈ రోజే ఉత్తమమైన రోజుగా ఉండాలి.

సజీవంగా ఉన్నవాటికంటే కూడా చనిపోయిన విషయాలు మంచివి అనుకుంటే, మనం జీవితంలో ఎక్కువ భాగం జీవించడమే లేదు.
నేటి కంటే నిన్న మెరుగైనదిగా ఉంటే, మనం జీవించడం లేదని అర్ధం. మనం మరణంతో వ్యవహరిస్తున్నాము. ఇప్పుడు(నేడు) సజీవంగా ఉన్నదానికంటే చనిపోయినది(నిన్న) ఉత్తమం అనుకోవడం మంచి విషయమేమీ కాదు. నిన్న అన్నది చనిపోయినది. సజీవంగా ఉన్నవాటికంటే కూడా చనిపోయిన విషయాలు మంచివి అనుకుంటే, మనం జీవితంలో ఎక్కువ భాగం జీవించడమే లేదు. వీరి గురించి వారి గురించి చింతించకండి. మీ జీవితంలో ఇదే ఉత్తమమైన రోజుగా చేసుకోండి. ఒకవేళ మీరు ఈ రోజు చనిపోతే ఏం చేస్తారు?  "లేదు, లేదు, సద్గురు, నేను చనిపోను." అనకండి. అలాంటి హామీ లేదు. మనం రేపు ఇక్కడ ఉంటామని ఏదైనా హామీ ఉందా? మనం ఉండాలనుకుంటున్నాము, కానీ అలాంటి హామీ ఏమీ లేదు. కాబట్టి మీ జీవితంలో ఉత్తమమైన రోజుగా ఇవ్వాళ అన్నది మీకు చాలా ముఖ్యమైనది.. కాదా? మీరు ఇలా జీవిస్తే, ఒక ఇరవై ఐదు సంవత్సరాలలో ఏం చూస్తారంటే, ప్రజలు మిమల్ని ఒక గొప్ప వ్యక్తిగా భావించడం గమనిస్తారు. అందరూ మీరు చుట్టూ ఉండాలని కోరుకుంటారు. ఇరవై-ఐదు సంవత్సరాలు అనుభవంతో, మీ ఉత్తమమైన రోజు చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది, ప్రతిఒక్కరూ దానిలో భాగం కావాలని కోరుకుంటారు. అది అలా ఉండాలి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు