సద్గురు: భారతదేశంలోని ఒక అతి పెద్ద సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరూ, వార్తాపత్రికలో ఒక సంచిక చదివో లేదా రెండు నిమిషాలు వార్తలు చూసో తాము పెద్ద పర్యావరణవేత్తలమని భావిస్తూ ఉంటారు. ప్రస్తుతం, అమెరికా ఇంకా యూరప్ వారు నదీ జలాల కాలుష్యం గురించి మాట్లాడుతుండడంతో, అంతటా అదొక ఆసక్తికర అంశం అయిపొయింది. ఇక్కడ కూడా అందరూ అదే వల్లించాలనుకుంటున్నారు. అదొక ఫాషన్ ఐపోయింది. ఈ దేశంలోని ఇంగ్లీష్ మాట్లాడేవారితో ఇదొక పెద్ద సమస్య. విలేఖరులయినా లేదా పర్యావరణ శాస్త్రవేత్తలు అనబడేవారైనా, వారికి ఓ చిన్న విషయం కూడా చెప్పలేము, ఎందుకంటే వారి బుర్రల్లో యూరప్ ఇంకా అమెరికా డాన్స్ వేస్తూ ఉంటాయి.

ప్రాధమికంగా, “నదులు నీటి వనరులు” అనే ఒక తప్పుడు అవగాహన మనలో ఉంది. లేదు. ఈ దేశంలో ఏ నదీ, చెరువూ లేదా సరస్సూ కూడా నీటి వనరు కాదు. మనకి ఒకే ఒక్క నీటి వనరు ఉంది, అది వర్షాకాలపు వాన. నదులు, చెరువులు, సరస్సులు ఇంకా బావులు ఇవన్నీ వాన నీటి గమ్యస్థానాలే గానీ, ఇవి నీటికి మూలాలు కావు.

నిజానికి అసలైన సమస్య కాలుష్యం కాదు. నదుల్లోకి మురుగు నీరు వెళ్లడం ఆగిపోతే, చాలా నదులు అసలు ప్రవహించవని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు యమునా నదిని తీసుకోండి. అందులో తొంభై శాతం నీరు మురుగు నీరే. మురుగు నీరంతా ఆపితే యమునా నది అసలు ప్రవహించదు.

వాస్తవానికి ఉష్ణమండల దేశంలోని పరిస్థితులు, సమశీతోష్ణ దేశాలలోని పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. మనం ఉన్న అక్షాంశం ఇంకా మన భూమి రకాన్ని బట్టి, ఇక్కడ పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. ప్రాధమికంగా, “నదులు నీటి వనరులు” అనే ఒక తప్పుడు అవగాహన మనలో ఉంది. లేదు. ఈ దేశంలో ఏ నదీ, చెరువూ లేదా సరస్సూ కూడా నీటి వనరు కాదు. మనకి ఒకే ఒక్క నీటి వనరు ఉంది, అది వర్షాకాలపు వాన. నదులు, చెరువులు, సరస్సులు ఇంకా బావులు ఇవన్నీ వాన నీటి గమ్యస్థానాలే గానీ, ఇవి నీటికి మూలాలు కావు.

వర్షాకాలపు వానలు, మన భూమిపై ప్రతి సంవత్సరం సుమారు 3.6 నుండి 4 ట్రిలియన్ టన్నుల నీటిని కురిపిస్తాయి. ఇది ఒక దట్టమైన వర్షారణ్యంగా లేదా ఉష్ణమండల అడవి ప్రాంతంగా ఉన్నప్పుడు, ఆ నీటిలో అధిక భాగం భూమిలో భూగర్భజలాలుగా పట్టి ఉంచబడి, నెమ్మదిగా బయటకు విడువబడేవి, దాంతో నదులు ప్రవహించేవి. గత వందేళ్లలో, ఈ ఉపఖండంలో వర్షాకాలంలో కురుస్తున్న నీటి పరిమాణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ చోటుచేసుకోలేదు. కానీ నదులన్నీ సగటున నలభై శాతానికి పైగా క్షీణించిపోయాయి. కృష్ణా నది అరవై శాతానికి పైగా క్షీణించిపోయింది. నర్మదా నది యాభై ఐదు శాతానికి పైగా క్షీణించింది. గంగా నది నలభై శాతానికి పైగా క్షీణించింది.

ఐరోపా నదులలోకి వచ్చే నీటిలో చాలా వరకూ మంచుగడ్డల(Glacier) నుండి వస్తుంది, అయితే భారతీయ నదులలోకి నీరు అడవులలో నిండి వస్తుంది. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. భారతదేశంలోని నదీ జలాల్లో కేవలం నాలుగు శాతం మాత్రమే మంచుగడ్డల(Glacier) నుండి వస్తుంది, అది కూడా పైన ఉత్తరాన మాత్రమే. ఈ మంచుగడ్డల(Glacier) నుండి నీరు పొందే నదులలో, దాదాపు అన్నీ పాకిస్థాన్‌లోకి ప్రవహిస్తాయి. గంగా నదిలో కొద్దిపాటి నీరు మాత్రమే మంచుగడ్డల(Glacier) నుండి వస్తుంది, మిగిలిన నదులన్నిటికీ నీరు అడవులలో నిండే వస్తుంది.

భారతదేశ భూభాగంలో గంగా పరీవాహక ప్రాంతం ఇరవై ఆరు శాతం ఉంటుంది, అలాగే భారతదేశ వ్యవసాయ భూములలో ఇది దాదాపు మూడో వంతు ఉంటుంది. భారతీయ రైల్వేలను నిర్మించడానికి, మనం ఆ ప్రాంతం అంతటిలోని వృక్షసంపదను తొలగించేసాము. డెబ్బై ఏళ్ళలో మనం గంగా పరీవాహక ప్రాంతంలోని డెబ్బై ఎనిమిది శాతం చెట్లను తొలగించేశాము. అయినప్పటికీ ఆ నది ప్రవహిస్తుందని మీరు ఆశిస్తున్నారా? మీరు ఇంకా కాలుష్యం గురించి మాట్లాడుతున్నారా? మనం గట్టిగా నిశ్చయించుకుంటే రెండు మూడు సంవత్సరాలలో కాలుష్యాన్ని పూర్తిగా తొలగించవచ్చు. అది పెద్ద విషయం కాదు. దృఢ నిశ్చయంతో ఉంటే, అలాగే కొంత డబ్బు పెట్టుబడి పెడితే నీరు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవచ్చు. కానీ ఒక నది క్షీణిస్తే, దానిని తిరిగి పూర్వవైభవానికి తీసుకురావడానికి దశాబ్దాలపాటు కృషి చేయాల్సి ఉంటుంది. దాన్ని అంత తేలిగ్గా పునరుద్ధరించలేం. ఈ రోజు మనం ఎదో ఫాన్సీ ఆలోచన చేసాము కదా అని, రేపటికి రేపే నది ప్రవహించడం మొదలు పెట్టదు.

కానీ ఈ విషయాన్ని తెలపడానికి ఏ విధంగా ప్రయత్నించినా, ప్రతి ఒక్కరూ కాలుష్యం గురించే మాట్లాడాలనుకుంటున్నారు, ఎందుకంటే నగర ప్రజలు కాలుష్యంతో బాధపడుతున్నారు. అలాగే పెట్టుబడి, అధికారం ఇంకా ప్రశ్నించే అధికారం కూడా నగర ప్రజల చేతుల్లోనే ఉన్నాయి. అయితే, ఇప్పుడు నగరాల్లో తాగునీరు దొరకడం లేదు కాబట్టి నీటి కొరత గురించి కూడా మాట్లాడటం మొదలుపెట్టారు. గతంలో నీతి ఆయోగ్ విడుదల చేసిన కాంపోజిట్ వాటర్ మేనేజ్‌మెంట్ ఇండెక్స్ (CWMI) నివేదిక ప్రకారం, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లతో సహా అనేక ప్రధాన నగరాల్లో 2020 నాటికి భూగర్భజలాలు లేకుండా పోయే ప్రమాదం ఉందని, ఇది దాదాపు 10 కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుందని అంచనా వేయబడింది.

భారతదేశ జనాభాకి ఉన్నన్ని నీటి కష్టాలు ఈ గ్రహం మీద ఏ జనాభాకీ లేవు. ఇది ప్రపంచ జనాభాలో పదిహేడు శాతం జనాభా. కానీ ప్రపంచ నీటి వనరులలో కేవలం 3.5 శాతం మాత్రమే ఇక్కడ ఉంది. ఏ సమయంలోనైనా, ఏ జనాభా తన భూగర్భ జల వనరులలో పదిహేను నుండి ఇరవై ఐదు శాతానికి మించి ఉపయోగించకూడదు. కానీ నేడు మనం తాగుతున్న ఇంకా ఉపయోగిస్తున్న నీటిలో ఎనభై శాతానికి పైగా భూగర్భ జల వనరులే.

అయినప్పటికీ, చాలా నగరాలు వర్షభయంతో ఉన్నాయి, ఇప్పటికీ వారు, “రెయిన్ రెయిన్, గో ఎవే” అంటూ పాత పాటను పాడుతున్నారు, ఎందుకంటే ఆ తరవాత వరదలు వస్తాయని వారికి తెలుసు. నగరంలో వరదలను ఎలా నిర్వహించాలో వారికి తెలియదు, నగరాలు వరదలను నిర్వహించడం కోసం నిర్మించరు. వర్షాలు కురిసి, తగినంత వృక్షసంపద ఉంటే వరదలు రావు. మనం 10,000 చెట్లను నాటితే దాదాపు 360 లక్షల లీటర్ల నీటిని భూమిలో పట్టి ఉంచొచ్చు. కాబట్టి, ఇప్పుడు, “కావేరి పిలుపు” లో భాగంగా, మేము కావీరి పరివాహక ప్రాంతంలో 242 కోట్ల చెట్లను నాటాలని చూస్తున్నాము. అంతిమంగా, నదులు ప్రవహించాలంటే రకరకాల వృక్షసంపద అవసరం. మనం చనిపోయేలోగా, మనం దీన్ని సాకారం చేయాలి.

caca-blog-banner_6