మంత్రాలు ఎలా పని చేస్తాయి?
మంత్రానికి మరియు సంస్కృత భాషకి మధ్య సంబంధం ఏమిటి?
మంత్ర జపం వల్ల కలిగే ప్రయోజనాలు
వైరాగ్య మంత్రాలు
నాద బ్రహ్మ మంత్రం - ప్రపంచాన్ని శబ్దంగా అనుభూతి చెందడం
ఆఁఊఁమ్ మంత్రోచ్ఛారణ వల్ల కలిగే ప్రయోజనాలు

సద్గురు: మంత్రం అంటే ఒక శబ్దం, ఒక నిర్దిష్టమైన ఉచ్చారణ లేదా అక్షరం. నేడు ఆధునిక విజ్ఞానం మొత్తం ఉనికిని శక్తి యొక్క ప్రకంపన, వివిధ స్థాయిల ప్రకంపనలుగా చూస్తుంది. ప్రకంపన ఉన్నచోట శబ్దం ఉంటుంది. కాబట్టి మొత్తం ఉనికి ఒక రకమైన ధ్వని లేదా శబ్దాల సంక్లిష్ట సమ్మేళనం - మొత్తం ఉనికి అనేక మంత్రాల సమ్మేళనం. వీటిలో కొన్ని మంత్రాలు లేదా కొన్ని శబ్దాలు గుర్తించబడ్డాయి. అవి తాళంచెవి లాంటివి. మీరు వాటిని ఒక నిర్దిష్ట విధానంలో ఉపయోగిస్తే, మీలో భిన్నమైన జీవిత కోణాన్ని, అనుభవాన్ని తెరవడానికి అవి కీలకం అవుతాయి.

మంత్రాలు ఎలా పనిచేస్తాయి?

What is the science behind mantras?

మంత్రం మీరు పలికేది కాదు. మీరే మంత్రంలా మారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు అని. ఎందుకంటే మీరు తాళంచెవి(key)లా మారకపోతే ఉనికి మీకు తెరుచుకోదు. మంత్రంగా అవ్వడం అంటే మీరు తాళంచెవి అవుతున్నారు. మీరు తాళం చెవి అయితేనే మీరు తాళాన్ని తెరవగలరు. అలా కాకపోతే వేరొకరు మీకోసం తెరవాలి, మీరు అతని మాట వినాలి.

మంత్రాలు చాలా మంచి తొలి అడుగు కావచ్చు. కేవలం ఒక మంత్రం మనిషికి అద్భుతమైనవి చేయగలదు. అవి ఏదైనా సృష్టించడంలో ప్రభావవంతమైన శక్తిగా ఉంటాయి. కానీ ధ్వని గురించిన పూర్తి అవగాహన ఉన్న మూలం నుండి వచ్చినట్లయితే మాత్రమే అది సాధ్యం అవుతుంది. "అంతా శబ్దం" అన్నప్పుడు మనం మొత్తం సృష్టి గురించి మాట్లాడుతున్నాం. ఒక మంత్రం ఆ రకమైన మూలం నుండి, ఆ స్థాయి అవగాహనతోనూ అలాగే వాటి ప్రసరణ స్వచ్ఛంగానూ ఉన్నప్పుడు, మంత్రాలు ప్రభావవంతమైన శక్తిగా పనిచేస్తాయి.

మంత్రముల వెనుక ఉన్న విజ్ఞానం

వివిధ రకాల మంత్రాలు ఉన్నాయి. ప్రతి మంత్రం శరీరంలోని ఒకానొక భాగంలో ఒక ప్రత్యేకమైన శక్తిని చైతన్యవంతం చేస్తుంది. దానికి అవసరమైన అవగాహన లేకుండా, కేవలం ధ్వనిని పదే పదే చేయడం వల్ల మనసుకు నిస్సత్తువ వస్తుంది. ఏదైనా ధ్వనిని పదే పదే చెప్పడం మీ మనస్సును నిస్తేజం చేస్తుంది. కానీ అదే సరైన అవగాహనతో, అది ఏమిటో ఖచ్చితమైన అవగాహనతో చేసినప్పుడు, ఒక మంత్రం చాలా శక్తివంతమైన సాధనం కావచ్చు. శాస్త్ర పరంగా ఇది చాలా శక్తివంతమైన కోణం. కానీ అది అవసరమైన ఆధారం లేకుండా, అవసరమైన పరిస్థితులను సృష్టించకుండా అందించినట్లయితే, ఇది చాలా నష్టాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే ఇది అనుభవపూర్వకమైన శాస్త్రం. గాయత్రీ మంత్రం లాంటి మంత్రము కూడా సరిగ్గా పలకకపోవడం వల్ల నష్టం కలిగించుకున్న వ్యక్తుల గురించి మాకు తెలుసు.

మంత్రం, సంస్కృత భాష - సంబంధం ఏమిటి?

మంత్రాలు ఎల్లప్పుడూ సంస్కృత మూలం నుండి వస్తాయి మరియు సంస్కృత భాష ప్రాథమిక అంశాలు శబ్ద ప్రధానమైనవి. కానీ వేర్వేరు వ్యక్తులు, వాటిని తమదైన రీతిలో చెబుతారు. బెంగాలీలు ఒక మంత్రం చెబితే, వారు తమదైన రీతిలో చెబుతారు. తమిళ ప్రజలు చెబితే, వారు మరొక విధంగా చెప్తారు. అమెరికన్లు చెబితే వారు దానిని పూర్తి భిన్నమైన రీతిలో చెబుతారు. ఇలా వివిధ భాషలు మాట్లాడే వివిధ వ్యక్తులు వారు ఏ భాషకు అలవాటు పడ్డారో అసలైన శిక్షణ ఇవ్వకపోతే వివిధ మంత్రాలను వక్రీకరిస్తారు. అలాంటి శిక్షణ చాలా సమగ్రమైనది, ఈ రోజుల్లో ప్రజలకు అలాంటి సహనం లేదా అంకితభావం లేదు. ఎందుకంటే దీనికి ఎంతో సమయం అవసరం, దానిలో పూర్తిగా లీనమవ్వటం అవసరం.

నాద యోగ - ధ్వని మరియు రూపం మధ్య గల సంబంధం

సంస్కృత భాష ఒక పరికరం లాంటిది, అది కేవలం సంభాషణ మాధ్యమం కాదు. ఇతర భాషలు చాలా వరకు ఏదో ఒక దాని గురించి తెలుపడం కోసం రూపొందించబడ్డాయి. ప్రారంభంలో కేవలం కొన్ని పదాలతో ప్రారంభించారు, ఆ తరువాత వాటిని పెక్కు సంక్లిష్ట రూపాల్లోకి పెంచారు. కానీ సంస్కృతం కనుగొనబడిన భాష. ఎందుకంటే ఏదైనా ధ్వనిని ఓసిల్లోస్కోప్‌లోకి పంపిస్తే ప్రతి శబ్దానికి ఒక రూపం జతచేయబడిందని ఈ రోజు మనకి తెలుసు. అదేవిధంగా ప్రతి రూపానికి ఒక ధ్వని జతచేయబడుతుంది. ఉనికిలో ప్రతి రూపం ఒక నిర్దిష్ట మార్గంలో ప్రతిధ్వనిస్తుంది, ఒక నిర్దిష్ట ధ్వనిని సృష్టిస్తుంది.

మీరు శబ్దాన్ని పలికినప్పుడు ఒక రూపం సృష్టించబడుతుంది. ఒక నిర్దిష్ట మార్గంలో శబ్దాలను ఉపయోగించడానికి మొత్తం శాస్త్రమే ఉంది. తద్వారా ఇది సరైన రూపాన్ని సృష్టిస్తుంది. మనము కొన్ని విధానాలలో శబ్దాలను ఉచ్ఛరించడం ద్వారా శక్తివంతమైన రూపాలను సృష్టించవచ్చు. దీనిని నాద యోగ, ధ్వని యోగం అంటారు. మీకు ధ్వనిపై పట్టు ఉంటే దానికి జతచేయబడిన రూపంపై కూడా మీకు పట్టు ఉంటుంది.

సంస్కృతం బోధించినప్పుడు దానిని వల్లెవేస్తూ నేర్చుకోవాలి. దానిలో శబ్దం ముఖ్యం గానీ దాని అర్థం కాదు.

ఇది నాకు చిన్నతనంలో జరిగింది: మాట్లాడుతున్న వ్యక్తిని నేను చూస్తూ ఉండేవాడిని. మొదట్లో, నేను వారి మాటలు విన్నాను. తరువాత కేవలం శబ్దాలు. కొంత సమయం తరువాత, నేను వారి చుట్టూ కొన్ని ఆకృతులు చూశాను. అవి నన్ను వాటిల్లో లీనమయ్యేలా చేసేవి, అవి ఆశ్చర్యకరంగా ఉండేవి, నన్ను రంజింపజేసేవి. ఎంతలా అంటే నేను ఎప్పటికీ అలా వారి వైపు చూస్తూ కూర్చోగలను, ఒక్క మాట కూడా అర్థం కాకుండా! ఎందుకంటే నేను వారి మాటలు అస్సలు వినడం లేదు.

సంస్కృతం అనేది రూపం, ధ్వనులకు మధ్య సంబంధం ఉన్న భాష. ఉదాహరణకు ఆంగ్లంలో మీరు "సూర్యుడు" అంటే sun/సన్ మరియు "కొడుకు" అంటే కూడా son/సన్ అని అర్థం. ఉచ్చారణలో అది ఒకటే, స్పెల్లింగ్‌లో మాత్రమే అది భిన్నంగా ఉంటుంది. సంస్కృతంలో మీరు వ్రాసేది ప్రమాణం కాదు. ధ్వని లేదా శబ్దం ప్రమాణం. ఒక నిర్దిష్ట రూపానికి ఏ ధ్వని జతచేయబడిందో మీరు గ్రహించినప్పుడు, మీరు ఈ ధ్వనిని ఆ రూపానికి పేరుగా ఇస్తారు. ఇప్పుడు ధ్వని మరియు రూపం కలిసాయి. మీరు ధ్వనిని పలికితే సంబంధిత రూపాన్ని చెప్తున్నారు - కేవలం మానసికంగా మాత్రమే కాకుండా, అస్తిత్వపరంగా మీరు ఆ రూపంతో జత కడతారు. సంస్కృతం ఉనికి యొక్క మూలం లాంటిది. రూపంలో ఉన్నదానిని మేము ధ్వనిగా మార్చాము. చాలా వక్రీకరణలు జరిగాయి. అవసరమైన జ్ఞానం, అవగాహన మరియు ఎరుక చాలావరకు లేకపోవడం వల్ల దాన్ని సరైన రూపంలో ఎలా కాపాడుకోవాలో నేటికి కూడా ఒక సవాలుగా మారింది.

అర్థం కంటే ధ్వని చాలా ముఖ్యం

సంస్కృతాన్ని బోధించినప్పుడు, దానిని విచక్షణతో నేర్చుకోవలసిన కారణం అదే. దానిని నేర్చుకునేవారు భాషను నిరంతరం వల్లిస్తారు. మీకు దాని అర్థం తెలుసా లేదా అనేది ముఖ్యం కాదు. ధ్వని ముఖ్యం, అర్థం కాదు. మీ మనసులో అర్థాలు ఏర్పడ్డాయి. ఇక్కడ ధ్వని మరియు రూపం జత కడతాయి. మీరు కనెక్ట్ అవుతున్నారా లేదా? - అదే ప్రశ్న. అందుకే సంస్కృతం, తమిళం మినహా దాదాపు అన్ని భారతీయ, యూరోపియన్ భాషలకు తల్లిగా మారింది. తమిళం నుండి రాలేదు. ఇది స్వతంత్రంగా అభివృద్ధి చెందింది. అన్ని ఇతర భారతీయ భాషలు, దాదాపు అన్ని యూరోపియన్ భాషలకు సంస్కృతంలో మూలాలు కలవు.

మంత్రజపం వల్ల ప్రయోజనాలు

సంగీతం అనేది మాధుర్యాన్ని సృష్టించేందుకు చేసిన శబ్దాల అమరిక. సంగీతం ఒక చక్కని అమరిక, కానీ అది ఎంతైనా ప్రవహించే నీరు లాంటిది. సౌందర్యపరంగా మంత్రం అంత అందమైనది కాదు, కానీ అది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. మీరు దీనిని వినాలని నేను కోరుకుంటున్నాను: సౌండ్స్ ఆఫ్ ఇశా ‘వైరాగ్య’ అనే CDని విడుదల చేసింది, ఇందులో ఐదు మంత్రాలు ఉన్నాయి: అవి నిర్వాణ షట్కం,గురు పాదుకా స్తోత్రం, బ్రహ్మానంద స్వరూప,ఆమ్ నమః శివాయ, మరియు శంభో.ఇది ఒక నిర్దిష్టమైన ఉద్దేశ్యంతో విడుదల చేయబడింది. CDని కొన్ని సార్లు వినండి, ప్రతి మంత్రాన్ని వినండి - ఒక్కొక్కటి పది నిమిషాల పాటు నడుస్తుంది. ఏ మంత్రం మిమ్మల్ని నిజంగా ఆకర్షిస్తుందో గుర్తించండి. ఇది ఒక మంత్రాన్ని ఎంచుకోవడం గురించి కాదు. “ఓహ్, నాకు ఈ మంత్రం బాగుంది. మీరు ఏమి ఎంచుకున్నారు? సరే, నేను కూడా దాన్ని ఎంచుకుంటాను." ఇది అలా చేసేది కాదు. కేవలం వింటూ ఉండండి. వాటిలో ఒకటి మిమ్మల్ని నిజంగా ఆకట్టుకుంది అని మీకు అనిపించినప్పుడు, మీరు దానితోనే ఉండిపొండి. దీన్నే ఎల్లప్పుడూ కొనసాగించండి - మీ కారులో, మీ ఇంటిలో, మీ ఐప్యాడ్, ఫోన్, ప్రతిచోటా. వీటిలో ప్రతి మంత్రానికి ఒక గంట వెర్షన్‌లు కూడా ఉన్నాయి. వాటిని కొంతకాలం కొనసాగించండి.

కొంత సమయం తర్వాత అది మీలో ఒక భాగంగా మారుతుంది, మీ కోసం ఒక నిర్దిష్ట వాతావరణాన్ని తయారు చేస్తుంది. మంత్రం అనేది చైతన్యం కాదు కానీ మంత్రం సరైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఈ శారీరక, మానసిక అమరికలో మరియు వాతావరణంలో కూడా ధ్వని సరైన వాతావరణాన్ని తయారు చేస్తుంది. దీనిని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు.

 

వైరాగ్య మంత్రాలు

ఆల్బమ్ mp3 డౌన్‌లోడ్‌ లతో పాటు ఉచిత మొబైల్ యాప్‌గా అందుబాటులో ఉంది.

నాద బ్రహ్మ మంత్రం - ప్రపంచాన్ని ధ్వనిగా అనుభవించడం

 

"నాద" అంటే "ధ్వని". "బ్రహ్మ" అంటే "దైవం", అంతటా ఉన్నది అని అర్థం. ప్రాథమికంగా, ఉనికిలో మూడు శబ్దాలు ఉన్నాయి. ఈ మూడు శబ్దాల నుండి ఏదైనా శబ్దాన్ని సృష్టించవచ్చు. కలర్ టెలివిజన్ గురించి మీకు తెలిస్తే, కేవలం మూడు కలర్ వెబ్‌లు మాత్రమే ఉంటాయి. ఈ మూడు రంగుల వెబ్‌లను బట్టి, ఎన్ని రంగులను అయినా సృష్టించవచ్చు. అదేవిధంగా, ఈ మూడు శబ్దాలను బట్టి ఎన్ని శబ్దాలను అయినా సృష్టించవచ్చు. మీరు దీన్ని ఒక చిన్న సాధారణ ప్రయోగంతో చూడవచ్చు: నాలుకను ఉపయోగించకుండా, మీరు కేవలం మూడు శబ్దాలు మాత్రమే పలకగలరు: "ఆఁ", "ఊఁ" మరియు "మ్". మీరు మీ నాలుకను కత్తిరించి వేసినా, ఈ మూడు శబ్దాలను పలకవచ్చు. ఏదైనా ఇతర ధ్వని కోసం, మీకు నాలుక ఉపయోగం అవసరం. మీరు ఇతర శబ్దాలను ఉత్పత్తి చేయడానికి ఈ మూడు శబ్దాలను అనేక విధాలుగా కలపడానికి మాత్రమే నాలుకను ఉపయోగిస్తున్నారు. మీ నోటితో మీరు సృష్టించగల లక్షల శబ్దాలు ఉన్నాయి, కానీ మూగగా ఉన్న వ్యక్తి "ఆఁ", "ఊఁ" మరియు "మ్" అని మాత్రమే అనగలడు. తన నాలుకను ఉపయోగించలేనందున అతను మరేమీ చెప్పలేడు.

ఆఁ ఉఁ మ్ - ప్రాథమిక శబ్దం

మీరు ఈ మూడు శబ్దాలను కలిపి ఉచ్ఛరించినట్లయితే, ఏమి అవుతుంది? ఆఁ ఉఁ మ్ (AUM) - AUM ఏవో మతాల ట్రేడ్ మార్క్ కాదు. ఇది ఉనికిలోని ప్రాథమిక ధ్వని. మూడు AUM లను ఉచ్ఛరించడం ద్వారా శివుడు సరికొత్త ఉనికిని సృష్టించగలడని చెప్పబడింది. ఇది వాస్తవం కాదు, కానీ ఇది నిజం. వాస్తవం మరియు నిజం మధ్య తేడా ఏమిటి? మీరు ఒక మహిళ అని అనుకుందాం. మీ తండ్రి మీకు ఎలాంటి సహకారం అందించలేదనా దీని అర్థం? మీ తండ్రి మీలో లేరనా దీని అర్థం? లేదు కాబట్టి వాస్తవం ఏమిటంటే, మీరు పురుషుడు లేదా స్త్రీ. నిజంగా మీరు ఆ ఇద్దరూ. శివుడు ఎక్కడో కూర్చుని AUM లు పలుకుతున్నాడని కాదు. అది కాదు విషయం. చెప్పబడుతోంది ఏమిటంటే, అంతా కేవలం ఓ ప్రకంపన మాత్రమే అని.

ఆ పాటకు మిమ్మల్ని మీరు సమర్పించుకుంటే, దానికి ఒక రకమైన శక్తి ఉంది. మీరు నిజంగా దానిలో లీనమైతే, వ్యక్తిని కరిగించే శక్తి దీనికి ఉంది.

 

దీన్ని అనేక కోణాలలో చూడవచ్చు. చాలా కాలం క్రితం, నేను ప్రతి సంవత్సరం ఒకటి, రెండు నెలలు ఒంటరిగా హిమాలయాలలో ప్రయాణించేవాడిని, నేను కేదార్‌నాథ్‌కు వెళ్లాను. కేదార్ చాలా శక్తివంతమైన, అద్భుతమైన ప్రదేశం. కేదార్ కు ఆపైన, కాంతి సరోవర్ అనే ప్రదేశం ఉంది, ఇక్కడకు ప్రజలు సాధారణంగా వెళ్లరు ఎందుకంటే ఇది కష్టమైన అధిరోహణ. నేను కాంతి సరోవర్ వరకు ట్రెక్కింగ్ చేసి అక్కడ ఉన్న ఒక రాతిపై కూర్చున్నాను.

ఈ విషయం మాటల్లో చెప్పడం చాలా కష్టం, కానీ కొంత సమయం తర్వాత, నా అనుభవంలో ప్రతిదీ నాదంగా మారింది. నా శరీరం, పర్వతం, నా ముందు ఉన్న సరస్సు, అన్నీ నాదంగా మారాయి. ఇది నాదం రూపాన్ని సంతరించుకుంది, పూర్తిగా భిన్నమైన రీతిలో నాలో అది జరుగుతోంది. నా నోరు మూసే ఉంది - ఆ విషయంలో అనుమానం లేదు - కానీ నా స్వరం బిగ్గరగా వినిపిస్తోంది, అది మైక్రోఫోన్‌లో, పాట పాడుతున్నట్లుగా, మరియు అది సంస్కృతంలో ఉంది.

నాద బ్రహ్మ విశ్వస్వరూప
నాదా హి సకల జీవరూపా
నాద హి కర్మ నాద హి ధర్మ
నాద హి బంధన నాద హి ముక్తి
నాద హి శంకర నాద హి శక్తి
నాదం నాదం సర్వం నాదం
నాదం నాదం నాదం నాదం

అనువాదం:నాదం బ్రహ్మం, విశ్వ స్వరూపం, నాదమే అన్ని జీవుల రూపం, నాదమే కర్మ, నాదమే ధర్మం, నాదమే బంధం, నాదమే ముక్తి, నాదమే శంకరుడు, నాదమే శక్తి స్వరూపం, నాదమే సర్వస్వం.

ఆ పాటకు మిమ్మల్ని మీరు సమర్పించుకుంటే, దానికి ఒక రకమైన శక్తి ఉంది. మీరు నిజంగా మిమ్మల్ని మీరు దానిలో లీనం చేసుకుంటే, ఒక వ్యక్తిని కరిగించే శక్తి దీనికి ఉంది.

AUM ఉచ్ఛరించడం వల్ల కలిగే ప్రయోజనాలు

సద్గురు మాటల స్ఫూర్తితో, లేడీ ఇర్విన్ కాలేజీ, న్యూ ఢిల్లీలోని పరిశోధకులు కొన్ని సంవత్సరాల క్రితం AUM జపించడం అథ్లెట్లకు ఎలా సహాయపడుతుందనే విషయంపై ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈశా AUMకార ధ్యానాన్ని అభ్యసించే అథ్లెట్లలో శరీరంలో హైడ్రేషన్ స్థాయి పెరగడం గురించిన ఎరుకను అధ్యయనం కనుగొంది. 2011లో రెండు నెలల వ్యవధిలో నిర్వహించిన ఈ పని, డాక్టర్ ప్రీతి రిషి లాల్ ద్వారా క్లినికల్ మరియు స్పోర్ట్స్ న్యూట్రిషన్‌లో కొనసాగుతున్న పరిశోధనలో ఒక భాగం మరియు అక్టోబర్‌లో, అమెరికాలోని ఇల్లినాయిస్‌లో జరిగే ఆహార అధ్యయనాలపై అంతర్జాతీయ సమావేశంలో ప్రదర్శించబడుతుంది. శ్రీమతి ఆంచల్ అగర్వాల్ మాస్టర్స్ థీసిస్‌లో కూడా ప్రచురించబడిన ఈ అధ్యయనం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో "కం అండ్ ప్లే " స్కీమ్ ద్వారా శిక్షణ పొందుతున్న యువ, పురుష హాకీ క్రీడాకారుల నీరు త్రాగే అలవాట్లను మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది.

శ్రీమతి అగర్వాల్ మరియు డాక్టర్ లాల్ ఆట సమయంలో తగినంత నీరు త్రాగవలసిన అవసరం గురించి అథ్లెట్లకు అవగాహన కల్పించినప్పటికీ, చాలా మంది ఆటగాళ్ళు ఆట సమయంలో శరీరం నిర్జలీకరణంతో బాధపడటం, అలాగే పనితీరు మరియు శారీరక సామర్థ్యాలు తగ్గడంతో పాటు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీసింది.

డాక్టర్ లాల్ ఇలా అంటారు, "శరీరంలోని నీటి అవసరాలపై ఇప్పటికే ఆటగాళ్లకు అవగాహన కల్పించారు. వారికి సమాచారంతో పాటు డెమోల ద్వారా అనుభవపూర్వక అభ్యాసం కూడా ఇవ్వబడింది. వాస్తవానికి, శరీర హైడ్రేషన్ గురించి వారి జ్ఞానంపై మేము వారికి ప్రాథమిక పరీక్ష పెట్టినపుడు, వారిలో ఎక్కువ మంది 100%స్కోర్ చేసారు. వారు ఏమి చేయాలో వారికి తెలుసు, కానీ వారు అలా చేయడంలేదు. జ్ఞానానికి మరియు ప్రవర్తనలో వాస్తవ మార్పుకు మధ్య కొంత సంబంధం అవసరం. శరీరం యొక్క దాహం స్థాయిపై చేతన అవగాహన అవసరం." AUMkar సమాధానమా?

 

జ్ఞానం, ప్రవర్తన మధ్య అంతరాన్ని పూరిస్తుంది

 

AUM ధ్యానం యొక్క శారీరక, మానసిక ప్రయోజనాల గురించిన పరిశోధన ఇప్పటికే జరిగింది. శ్రీమతి అగర్వాల్ మరియు డా. లాల్, ఇతర ప్రాంతాలలో ఇంకా ఈశాలో అందించబడే AUMkar ధ్యానం మధ్య వ్యత్యాసాన్ని చూపుతారు. "ఇటీవలి భారతీయ అధ్యయనంలో AUM ఒక ఏక (ఓం) అక్షరం (OM) గా వర్ణించబడింది. ఈశా ఫౌండేషన్ దీనిని మూడు అక్షరాలుగా అందిస్తుంది” అని శ్రీమతి అగర్వాల్ చెప్పారు.శాంభవి మహాముద్ర యొక్క సానుకూల ప్రభావాలపై, నిర్వహించిన అధ్యయనాలను ప్రస్తావిస్తూ, "AUM కలిగిన యోగ పద్ధతులు మెదడు పనితీరును మెరుగుపరచాయని ఇటీవల నివేదికలు తెలిపాయి." పరిశోధకులు తమ శరీర హైడ్రేషన్ అధ్యయనంలో "జ్ఞానం మరియు ప్రవర్తన మధ్య అంతరాన్ని తగ్గించడం" కోసం AUMకార ధ్యానాన్ని ఒక సాధనంగా ఎంచుకోవడానికి ఇది ఒక కారణం.

ప్రయోగాత్మక అధ్యయనం సమయంలో, 30 మంది ఆటగాళ్లు రెండు గ్రూపులుగా విభజించబడ్డారు: ఒక కంట్రోల్ గ్రూప్ - తగిన నీటి వినియోగంపై ఇప్పటికే ఉన్న ఎడ్యుకేషన్ మాడ్యూల్ అందుకున్న వారు - మరియు ఒక ప్రయోగాత్మక గ్రూప్ - ఎడ్యుకేషన్ మాడ్యూల్ అందుకున్నారు మరియు AUMkar ధ్యానం యొక్క సంక్షిప్త సెషన్ సాధన చేశారు, 21 రోజులు ప్రతిరోజూ 21 నిమిషాలు. 21 రోజుల తరువాత, AUMkar సాధన చేస్తున్న ఆటగాళ్లు, మిగతా సమూహంతో పోలిస్తే గణనీయంగా ఆరోగ్యకరమైన నీటి స్థాయిలను కలిగి ఉన్నట్లు పరీక్షలు చూపించాయి. ఇది హార్ట్ బీట్ రేటు మరియు శారీరక చురుకుదనాన్ని కొలిచే పరీక్షలలో మెరుగైన పనితీరుగా కూడా కనపడింది. క్రీడాకారులు కూడా సంతోషంగా, ప్రశాంతంగా, దృష్టి మరింతగా కేంద్రీకరించినట్లు నివేదించారు.

పాల్గొన్నవారిలో ఒకరు నాకు, ఇంట్లో అందరితో బాగా కలిసిపోతున్నానని చెప్పారు. ఈ అధ్యయన సమయంలో వారు చాలా పరిణతి చెందినట్లు అనిపిస్తుంది. ఈ అధ్యయనం వీటి మొత్తం పరిధులను కనుగొనే అవకాశాలను తెరిచింది. ఈశా అందించే ధ్యానాల వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోవడానికి మేము ఇప్పటికే మరో రెండు అధ్యయనాలను ప్లాన్ చేసాము,” అని డాక్టర్ లాల్ చెప్పారు.