ప్రశ్న: మీ ఇన్నర్ ఇంజినీరింగ్: యోగం ఆనంద మార్గం అనే పుస్తకంలో మనమంతా స్పష్టమైన ఆకారాన్ని, ఆలోచనలను పొందడానికి, తద్వారా పురోగమించడానికి, మన ‘ఆంటెనా’ (antenna)లను తిరిగి శృతి చేయాలని అన్నారు. దానిని వివరిస్తారా ?

సద్గురు: ఒకరు కూర్చున్న పద్ధతిని గమనిస్తే, రాబోయే పది-పదిహేను సంవత్సరాలలో వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారో నేను చెప్పగలను. మీ స్వరూపం యొక్క జ్యామితి (రేఖా గణిత రూపం), కొన్నింటిని ఆహ్వానిస్తుంది- ఆ విషయంలో మీరు నిస్సహాయులు. ఎలా కూర్చోవాలి, ఎలా శ్వాస పీల్చాలి, మీ దేహాన్ని మనస్సును ఎలా ఉంచుకోవాలి అన్న విషయాల మీద, ఈ సంస్కృతిలో అతి క్లిష్టమైన విజ్ఞానాన్ని సృష్టించాము. మీ శరీర రేఖాగణితం సరిచేయగలిగితే, మీ అవగాహన సామర్థ్యం మెరుగవుతుంది. మీ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారానే, మీ జీవితాన్ని నిజంగా అభివృద్ధి చేసుకోగలరు- మిగతాదంతా మీ భ్రమే. మీ భ్రమలను గొప్పగా భావించుకొంటారని నాకు తెలుసు, కానీ మీరర్థం చేసుకోవాల్సింది ఏమంటే భ్రమలనేవి, మీ జ్ఞాపకాలను తిరగ తోడుకోవడమే. అలాకాక, మీ జ్ఞానం యొక్క పరిమితులను పెంచుకోవడం ద్వారానే మీ జీవితాన్ని నిజంగా వృద్ధి చేసుకోగలరు.

మీ జ్ఞానాన్ని అభివృద్ధి చేసి, మీ మేధస్సును ఎలా పెంచాలి అన్న విషయం మీద శాస్త్రీయంగా నిరూపించదగిన విధానం ఉన్నది. పద్యాలు రాసే లేదా చిత్రలేఖనం వేసే మానవ మేధస్సుని గురించి కాదు నేను చెప్పేది. మానవ శరీరాన్ని నిర్వహణ చేయించే మౌలిక మేధస్సు గురించి.

భావానురాగాలు లేకుండా, "నేను" అని కాకుండా, ఈ మానవుణ్ణి కేవలం ఒక యంత్రంగా చూస్తే, ఇది ప్రపంచంలో కల్లా అధునాతనమైన యంత్రం. దీనిని మనం దేనితో తయారు చేస్తున్నాము? మీరు ఒక పండు తిన్నారనుకోండి, ఉదాహరణకు అరటి పండు. అది ఒకటి రెండు గంటల్లో, ఈ అరటి పండు మానవుడిగా తయారవుతుంది. మనం తినే పండుని, కాయగూరల్ని లేదా మరింకేదయినా సరే, ఈ క్లిష్టమైన (మానవ) యంత్రంగా మార్చే మేధస్సు ఇక్కడ ఉంది. మౌలికమైన ఓ మేధస్సు లేకుండా ఇదెలా సాధ్యం? ప్రస్తుతానికి ఈ మేధస్సు గురించిన ఎరుక మీకు లేదు.

యోగ విధానం అంతా, మిమ్మల్ని స్తబ్దత లేని ఒక స్థాయి సౌఖ్యానికి తేవడమే. ఇక్కడ "స్తబ్ధత" అంటే, పరిణామ క్రమంలో, మానవ మస్తిష్కం కొత్తది, అది ఇటీవలనే రూపుదిద్దుకున్నది. దాన్ని అనుకూలంగా వాడుకోవడం మీకు తెలియనందు వల్ల, అది కొంత స్తబ్ధతను సృష్టిస్తుంది. అది ఒక పిల్లవాడు రేడియోతో ఆడుకుంటున్నట్లే - దానిద్వారా మీరు అర్థ రహితమైన ధ్వనులు వింటుంటారు.

మీ వ్యవస్థను ప్రశాంత స్థితిలో ఉంచితే, మీ మేధస్సుకు మించిన మరో జ్ఞానం ఏదో ఎల్లప్పుడూ పని చేస్తోందని గ్రహిస్తారు. మీరు ‘మీ బుద్ధి’ వలన జీవించడం లేదు. మీరు మీ స్థితిని గమనిస్తే, మనం స్థిరంగా లేని, ఒక గుండ్రని గ్రహం మీద ఉన్నాము- అది పరిభ్రమిస్తోంది- ఇంకా ఈ విశ్వములో దాని ఆద్యంతాలు ఎవరికీ తెలియవు. కానీ మనం అవేమి పట్టకుండా కూడా మన జీవితాల్ని జీవిస్తున్నాము. మీలో, మీ చుట్టూ పక్కల, అన్ని చోట్లా లోతైన ఓ జ్ఞానం పనిచేస్తూ ఉంది. మానవ యత్నము, కృషి ఈ పరిమాణాన్ని అందుకోవడానికే అయి ఉండాలి.

ఈ భూమి మీద నడవాలన్నా, మిగిలిన విశ్వముతో ఒక విధమైన శృతిలో ఉండాలి. కొంత మద్యం ఎక్కువయిన వారు నడవడానికి కూడా తడబడతారు. నడక అనేది సామాన్య విషయం కాదు. ఇదంతా మీ మేధస్సు వలన జరగడం లేదు- అది మీలో ఉన్న లోతైన మరో పరిమాణం వలన జరుగుతోంది. ఈ జ్ఞానాన్ని మీరు స్పృశించగలిగితే, బాహ్యమైన ఈ పైపై తర్కం నుండి, జీవం యొక్క అసలైన ఇంద్రజాలం వైపు పయనిస్తారు.

Editor's Note: "Inner Engineering: A Yogi's Guide to Joy" by Sadhguru is now available for purchase in US, UK and in India. Order your copy now!