అంతర్ముఖ ప్రయాణం - ఎలా చెయ్యాలి...???

 

ప్రశ్న: సద్గురు, నా జీవితంలోని ప్రతి అంశంలో మీరు ఉన్నందుకు మీకు ధన్యవాదాలు. సద్గురు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇది దిశ గురించి...అంటే "అంతర్ముఖ ప్రయాణం". నేను ఎప్పడు అంతర్ముఖ ప్రయాణం మొదలుపెట్టినా కాని...నేను ఏది మంచిది...ఏది చెడ్డది ..ఏది చెయ్యొచ్చు....ఏది చెయ్యకూడదు...అన్నవాటిల్లో చిక్కుకుపోతున్నాను. నాకు ఈ అంతర్ముఖ ప్రయాణం అంటే ఏమిటో తెలీడంలేదు. ఇది ఎలా చెయ్యాలి?

సద్గురు: మీరు ఎక్కడికెళ్లాలనుకుంటున్నారు?

ప్రశ్న: ఏమో నాకు తెలీదు. నేను నా లోకి...నా లోపలికి నేను వెళ్లాలనుకుంటున్నాను.....నాకు తెలీదు. ...నేను మీ వీడియో ఒకటి చూసాను. అందులో మీరు, “ముందు మీరు సరైన దిశలో, డైరెక్షన్ లో ఉన్నారో లేదో సరి చూసుకోండి” అని చెప్పారు...........

సద్గురు: ఇది మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి....ఎందుకంటే, ఒక ప్రయాణం చేయాలనుకోండి ...మీరు ఒక ప్రయాణం చెయ్యాలనుకుంటే ..కొంత దూరం ఉండాలి...అవునా..? అసలు దూరమే లేదనుకోండి, అప్పుడు ప్రయాణం అనేది ఎలా చేయగలరు? మీకు, మీరు ఎంత దూరంలో ఉన్నారు? అసలు దూరమే లేనప్పుడు మీరు ప్రయాణం ఎలా చేస్తారు? ఎవరో మిమ్మల్నీ మోసం చేస్తున్నారు.....అవునా..? ఎవరో మీతో  ఆటాడుకుంటున్నారు. ఎందుకంటె ఒక ప్రయాణం చెయ్యాలంటే, మౌళికంగా ఓ దూరం అన్నది ఉండాలి. అసలు  దూరమే లేనప్పుడు మీరు ప్రయాణం ఎలా చేస్తారు..? అందుకని, అంతర్ముఖ ప్రయాణం చేద్దామన్న ప్రయత్నం చెయ్యకండి. “కాని, నేను లోపలికి వెళ్లాలనుకుంటున్నాను” అని మీరనవచ్చు. కానీ, దేనిలోపలికి వెళ్లాలనుకుంటున్నారు?.  ” నేను నాలోకి నేను వెళ్లాలనుకుంటున్నాను.”  అని మీరంటే, ఎవరైనా వారి లోకే వారు వెళ్లగలుగుతారా?...ఇది ఇందులోకే ఎలా వెళ్తుంది? “సద్గురు..మీరు మాటల్తో ఆడుకుంటున్నారు. అంతర్ముఖ ప్రయాణం మాటేమిటి?” అన్నది మీ ప్రశ్న.

అంతర్ముఖ ప్రయాణం అనేదేది  లేదు. ఈ భాషంతా కూడా  బాహ్య ప్రపంచాన్ని మాత్రమే వివరించగలదు. భాష బాహ్య ప్రపంచానికి సంబంధించినది. మనం అంతర్ముఖత్వం గురించి ఏం మాట్లాడినా కాని, దాని దరిదాపుల్లో, దాన్ని దెగ్గరగా పోల్చిచెప్తున్నదే. ఎందుకంటె... దాన్ని ఎవరూ మాటల్లో చెప్పలేరు. ఎవరైనా చెప్పగలిగామంటే, అప్పుడు వాళ్లకి ఒక సైకియాట్రిస్ట్ అవసరమన్నమాట, గురువు కాదు. ఎందుకంటే, అన్నీ సరిగ్గా ఉండి, ఇంకా ఏదో తెలుసుకోవాలి ఆనుకుంటున్న వాళ్ళకోసం గురువు. ఇప్పుడు, మీకు ఏదో సమస్య ఉందనుకోండి, మీకు సైకియాయాట్రిస్టు కావాలి. అందుకని ఎటువంటి ప్రయాణం చెయ్యాలని ప్రయత్నం చెయ్యకండి.

మీరు ఒక్క క్షణం అలా ఉరికే కూర్చోగలిగితే, మీకు అన్ని దొరికినట్టే. ఇప్పుడు, మీ సమస్య ఏమిటంటే ఇక్కడ కూర్చోమంటే మీరు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు. మీరు ఇక్కడ ఊరికే అలా కూర్చోండి. మీ శరీరంలో ఎక్కడికీ వెళ్లకుండా, మనస్సులో ఎక్కడికీ వెళ్లకుండా, మీ భావావేశాలలో ఎక్కడికీ వెళ్లకుండా, మీ ఊహల్లో ఎక్కడికీ వెళ్లకుండా, ఊరికే అలా కూర్చోండి. అంతే.... మీకు, అది వొచ్చేసినట్టే... ! "అంతర్ముఖ ప్రయాణం" అనేదేదీ లేదు. మీరు ఇక్కడే ఉన్నారు. ఒకవేళ  మీరు ఇంకా  పుట్టలేదనుకోండి, అప్పుడు ఇక్కడికి రావడానికి మీరొక ప్రయాణం చెయ్యాలి. కానీ మీరు ఇక్కడే ఉన్నారు కదా. మీరు ఇక్కడే ఉన్నారా? మీరు ఇక్కడే ఉన్నారు. మరి ఇంకేమిటి? ఇది ఇంత సరళంగా ఉన్న మీకు ఎందుకు అర్థం కావడం లేదంటే, మీకు ఎక్కడికో ప్రయాణం చేయడం కావాలి కాబట్టి. మీరు ఇక్కడ ఊరికే కూర్చుంటే మీ జీవితం ఏదో వృధా అయిపోతోంది అని మీరు అనుకుంటున్నారు. ఎప్పుడూ మీరు ఎక్కడికో వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలి అని అనుకుంటున్నారు.

ఈ కలెక్టర్లు దేవాలయాలకి  వెళ్ళుతుండేవాళ్లు. భక్తితో కాదు...అక్కడ  వచ్చిన ఆదాయంలో శిస్తు వసూలు చెయ్యడానికి. అందుకని దేవాలయాలలో అకౌంట్లు రాయాల్సివచ్చేది.

ఓ అందమైన కథ ఉంది. ఇది బ్రిటీష్ కాలంలో, తమిళనాడులో జరిగింది. పంతొమ్మిది వందల ఇరవైలలో. అప్పుడు బ్రిటీష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. వీళ్ళకి ఆఫీసర్లు ఉండేవాళ్ళు. అప్పట్లో వాళ్ళని కలెక్టర్సు అనేవాళ్ళు. ఇప్పటిక్కూడా కలెక్టర్సు ఉన్నారు వాళ్ళని కలెక్టర్లు అని ఎందుకు పిలిచేవాళ్ళంటే, వాళ్ళ ఉద్యోగం శిస్తులు వసూలు చేయటం. చిన్న గ్రామాలలో వాళ్ళు శిస్తులు వసూలు చెయ్యడానికి ఏమి ఉండేది కాదు. ఎందుకంటే, అక్కడి ప్రజలకి తినడానికే కష్టంగా ఉండేది. అందులో కూడా ఏవో వసూలు చేస్తూనే ఉండేవాళ్ళు. వ్యవసాయం చేసే వారి దగ్గెర ఎంతో ఎక్కువ శిస్తులు కట్టించుకునే వాళ్లు. దాదాపు యాభై శాతం దాకా శిస్తులు కట్టించుకునే వాళ్ళు. ఈ కలెక్టర్లు దేవాలయాలకి వెళ్ళుతుండేవాళ్లు. భక్తితో కాదు...అక్కడ  వచ్చిన ఆదాయంలో శిస్తు వసూలు చెయ్యడానికి. అందుకని దేవాలయాలలో అకౌంట్లు రాయాల్సివచ్చేది. ఒక దేవాలయానికి ఒక కలెక్టరు వచ్చారు. వాళ్ళ అకౌంటు పుస్తకాల్ని చూడడం మొదలు పెట్టారు. అందులో ముప్పై రూపాయిల ఖర్చు, ఒక నెలకి – ‘ఏమి చెయ్యని స్వామికి భోజనానికి’ అని రాసుంది. ఆ కలెక్టరు దీన్ని చూసి “ఏమి చెయ్యని వారికి ఎందుకు భోజనం పెడుతున్నారు? “అన్నారు. దానికి,  ఆ ట్రస్టీలు  ఇలా చెప్తున్నారు, “ఈయన ఏమి చెయ్యకపోవడం అంటే ఈయన నిజంగానే ఏమి చెయ్యరు” అని. “లేదు లేదు...రాణిగారి  పరిపాలనలో మీరు జీవించాలనుకుంటే, మీరు మీ జీవనోపాధికి ఏదో ఒకటి చేయవల్సిందే.

ఏమి చెయ్యని వాళ్లకి భోజనం పెట్టకూడదు. అది ఆపేయండి” అన్నారు. ఆ ట్రస్టీలు “అలా కాదు ...ఈయన నిజంగానే ఏమి చెయ్యరు” అని చెప్పారు. “అయితే, ఖచ్చితంగా అతనికి భోజనం పెట్టకూడదు. అది మానేసేయ్యండి. మనం ఇలా ఖర్చు పెట్టలేము. ఏమి చెయ్యనతనికి ముప్ఫైరూపాయిలు  భోజనానికి ఖర్చు పెట్టలేము” అన్నారు కలెక్టరు. వాళ్లలో ఒక తెలివైన ట్రస్టీ ఉన్నారు. ఆయన, “నేను మీకు ఈయనని  చూపిస్తాను. రండి. ఆయనతో కూర్చొని మీరు ఆయన లాగా ఏమి చెయ్యకుండా కాసేపు కూర్చోండి. మీకే అర్థమౌతుంది” అని అక్కడకు కలెక్టర్ని తీసుకువెళ్లారు. అక్కడ ఒక ఆయన ఊరికే అలా కూర్చొని ఉన్నారు. కలెక్టరును అక్కడికి తీసుకు వచ్చి, ”మీరిక్కడ ఏమి చెయ్యకుండా అయిదు నిమిషాలు కూర్చోండి” అన్నారు. కలెక్టరు “సరే, ఇందులో పెద్ద విశేషం ఏముంది. నేను కూడా చేస్తాను” అని కూర్చున్నారు. అక్కడ ఊరికే కూర్చుంటే అతని ఊహకి కూడా అందనటువంటి విషయాలు ఆయనకి జరిగాయి. ఆయిన “సరే, ఈ స్వామికి భోజనం పెట్టండి” అని చెప్పారు. అందుకని ఏమి చెయ్యకుండా ఉండడం అన్నది సామాన్యమైన విషయం కాదు.

ఇది అన్నిటికంటే సరళమైన విషయం. కాని, ఇప్పుడు, మీ జీవితంలో మీరు దీనికి భిన్న దిశలో ఎంతో పెట్టుబడి  పెట్టేసారు. ఐప్పుడు దీన్ని మార్చాలంటే, మీకిది కష్టంగా అనిపిస్తుంది. అందుకని మీరు అంతర్ముఖ ప్రయాణం చేద్దాము అనుకుంటున్నారు. ఇక్కడ చాలా ట్రాఫిక్కు ఉందనుకోండి... ఎం చేస్తారు?.......ఇక్కడ చాలా ట్రాఫిక్కు ఉండి జామ్ అయిపోయిందనుకోండి ..మీరు ప్రయాణం చెయ్యాలనుకుంటే, అప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా?ఎన్నో సమస్యలు వస్తాయి. ఇప్పుడు అక్కడ ఎర్రలైటు పడితే ఎం చేస్తారు? అందుకని ఎటువంటి ప్రయాణం చెయ్యకండి. ఎంతో సరళమైన దాన్ని క్లిష్టంగా మార్చుకోకండి. మీరు ఊరికే ఉండండి.

మీరు ఒక జీవమే, ఒక ప్రయాణమే. మీరు ఒక ఆలోచన కాదు. మీరొక భావావేశం కాదు.

మీరు ఒక జీవమే, ఒక ప్రయాణమే. మీరు ఒక ఆలోచన కాదు. మీరొక భావావేశం కాదు. మీరు ఈ రక్తమాంసాలు కాదు. మీరు కేవలం జీవం. మిగితావన్నీ మీకు జరిగినవి. శరీరం మీకు కలిగింది, ఆలోచనలు మీకు వచ్చాయి, మీకు భావావేశాలు కలుగుతున్నాయి. మీకు వివాహం జరిగింది, పిల్లలు పుట్టారు. కాని, మీరు ఒక ప్రాణి మాత్రమే. అవునా? ఇది నిజామా? లేకపోతే నేను మీకేదైనా బోధిస్తున్నానా? ఇది నిజమే కదా?మీరు నిజంలో జీవించండి. జరగాల్సింది అదే జరుగుతుంది.

మీరు సత్యంలో జీవించండి, అన్నీ జరుగుతాయి. కానీ మీకు మీరే ఎప్పుడూ అసత్యాలు చెప్పుకుంటున్నారు. ఏవైతే అసత్యాలో వాటిల్లో జీవిస్తున్నారు. ఎన్ని విధాలుగా మీకు మీరే అసత్యాలు చెప్పుకుంటున్నారో చూడండి. ఇలా చేయడం ఆపేయండి. ఇది ఎంతో సరళమైనది, కానీ మీకు ఇంత  సరళంగా ఉంటే నచ్చట్లేదు. ఏదో క్లిష్టంగా ఉండాలనుకుంటున్నారు. సరళంగా ఉండటం అంటే ఇదేదో మూర్ఖత్వం అని మీరు అనుకుంటున్నారు. కానీ అన్నీ సరళంగానే ఉన్నాయి.

ప్రేమాశిస్సులతో,
సద్గురు

అంతర్ముఖ సాధనే మార్గం

 

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1