ప్రశ్న: నా ప్రశ్న, పంచభూతాలలో ఒకటయిన ఆకాశం గురించి. మైదానాలలోనో, బయళ్ళలోనో ఊరికే కూర్చొని పోయి గానీ, లేకపోతే, దూరంలో కనిపించే దిక్చక్రక్షితిజ రేఖలను (Horizon points) దీర్ఘంగా చూస్తూ ఉండిపోయిగానీ, లేదా తల ఎత్తి ఆకాశశాన్ని సీమను తదేకంగా పరికిస్తూ ఉండటంవల్ల గానీ, లేక, విశాలమైన బయళ్లలో సుదీర్ఘ కాలం గడపటం వల్ల గానీ, ఆకాశంతో గురించి మన అవగాహన పెంచుకోవచ్చా? ఆ అవగాహన, మీ లోపలా మీ చుట్టూరా కూడా ఉన్న ఆకాశాన్నిఈ మూలకంపై ఎరుక పెంచుకునేందుకు గురించి అర్థం చేసుకొనేందుకు ఇది దోహదం చేస్తుందా?

సద్గురు: కొంత దోహదం చేయచ్చేమో కానీ, అలాంటి విశాలమైన బయళ్ళలో కాలం గడిపే వాళ్లలో చాలామంది సాధారణంగా మొగ్గు చూపేది, ముందు ఏదయినా కప్పుకొని తమను తాము రక్షించుకొనే ఉపాయాల మీద. విభిన్న ప్రాంతాలలో ఉష్ణోగ్రతల వ్యత్యాసాలను గమనించుకోక తప్పదు కదా! అదెలా ఉన్నా, నిజమే, మీరు చెప్పింది సంభవమే, కాకపోతే తప్పక జరిగి తీరుతుందని మాత్రం చెప్పలేం.

మీరు ఎప్పుడైనా ప్రకృతి సిద్ధమైన పరిసరాలలో ఎక్కడయినా కూర్చొన్నప్పుడు, ఆ అవకాశాన్ని వినియోగించుకొని చూడచ్చు. కానీ సులభ పద్ధతి ఏమిటంటే, ముందు శ్వాసక్రియా, అన్నపాణాలూ, శరీరం లోపలా బయటా ఉండే ఉష్ణోగ్రతలలో తేడాలూ - ఇలాంటి సామాన్య దైహిక వ్యాపారాలకు సంబంధించిన విషయాల పట్ల శ్రద్ధ చూపాలి.

ఈ సాధారణ విషయాల మీద ఇప్పటికంటే కాస్త ఎక్కువ ధ్యాస ఉంచాలి.

మన శ్వాసక్రియనే చూడండి, అది నాకెప్పుడూ ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంటుంది! అతి సాధారణమైన శరీర ధర్మమే అయినా, అది గుట్టు చప్పుడు కాకుండా దాని దోవన అది జరిగిపోదు. శ్వాసక్రియ శరీరాన్నంతా కదిలించేస్తుంది. అలా కానీఅది శరీరం మొత్తాన్ని కదిలించేస్తున్నదని దాన్ని చాలా మంది గమనించరు. మీరు మీ శ్వాసక్రియనే గమనించే స్థితిలో లేకపోతే, అంతకంటే, సూక్ష్మమైన విషయాలు ఎలా అవగాహన చేసుకోగలుగుతారు, చెప్పండి? నిజమే, మీరు ప్రకృతి సిద్ధమైన పరిసరాలలో ఉండటం మంచిదే. కానీ, అంతకంటే ఎక్కువ అవసరం, - అతి సాధారణమైన మీ శారీరక వ్యాపారాలను వ్యవహారాలను - అంటే, ఊపిరి పీల్చటం, అన్నం తినటం, నీరు తాగటం, నడవటం, దేన్నయినా స్పృశించటం, ఇలాంటి చర్యలను - శ్రద్ధగా గమనించుకోవటం. ఇలాంటి శరీర వ్యాపారాలవ్యవహారాల మీద మీరు మీ ధ్యాస పెంచుకోవటంతో ఆరంభం చేస్తే,చేయటం, వెళ్ళి వెళ్ళి ఏ శూన్య ప్రదేశంలోనో కూర్చోవటం కంటే అది మెరుగయిన ప్రారంభం. దానివల్ల, మీరు మీ జీవితాన్ని ఒక విభిన్నమైన, విశేషమైన స్థాయిలో అనుభూతి చేసుకోగలుగుతున్నారని మీరే గ్రహిస్తారు.

మనుషులలో చాలా మంది ఇలాంటి సామాన్యమైన విషయాల పట్ల శ్రద్ధ చూపటం లేదు. తినటమంటే, తాగటమంటే గబ గబా గుటుక్కున మింగేయటమే. శ్వాసక్రియ అంటే, అది పూర్తిగా అప్రయత్నంగా జరిగి పోతూ ఉండటమే. దేన్నయినా తాకినప్పుడు, అసలు దేన్ని స్పృశిస్తున్నారో గూడా గమనించరు. ఆ స్పర్శ వల్ల కలిగే అనుభూతి మీద దృష్టే ఉండదు. చాలామందికి జీవితం ఇలాగే జరిగిపోతున్నది.

మీరు చేస్తున్న పనులకు ఎలాంటి ఆటంకమూ లేకుండానే, వాటి వేగం ఏ మాత్రం తగ్గించకుండానే, వాటి పట్ల మీరు శ్రద్ధ చూపచ్చు. ఇది గ్రహించటం ముఖ్యం. ఎందుకంటే, చాలామంది శ్వాస మీద శ్రద్ధ ఉంచి ఊపిరి పీల్చుకోవటం అంటే మిగిలిన పనులన్నీ మానేసి, మనసంతా గాలి పీల్చి విడవటం మీద మాత్రమే ఉంచి ఆ ఒక్క పనే చేయటం అని అనుకొంకుంటారుటారు. అది పొరపాటు.

మనుషులందర్లోనూ ఒక ప్రత్యేక విశేషం ఉంది. మన మెదడుకున్న అద్భుత సామర్థ్యం పుణ్యమా అని మనం మన శరీరంతో ఎన్నో సంక్లిష్టమైన పనులు చేస్తూనే, అన్నిటి మీదా శ్రద్ధధ్యాస చూపచ్చు. మీరు కారు నడుపుతూనే పక్కవాళ్లతో సంభాషిస్తూ వెళ్ళటం లేదూ? ఒకే సమయంలో రెండు చర్యల మీద శ్రద్ధధ్యాస పెడుతున్నారు కదా? ఇదీ అలాంటిదే. మీరు చేస్తున్న పనేదో చేసుకొంకుంటూనే, శ్వాస మీద కూడా శ్రద్ధధ్యాస ఉంచచ్చు. శ్వాసక్రియ దానిపాటికి అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కననుక దాని మీద ధ్యాస ఉంచతాటమే మీరు చేసేది. అలాగే మీరు తినే ఆహారం మీదా, తాగే పానీయం మీద కూడా మీరు పూర్తి శ్రద్ధ చూపుతూధ్యాస కలిగి ఉండచ్చు. వెళ్ళి ఎక్కడో శూన్యమైన మైదానంలో కూర్చోటం కంటే, మీ సాధనను ఇలాంటి వాటితో ప్రారంభించటం మంచిది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు