వేప వల్ల ఉపయోగాలు, ప్రయోజనాలు

సద్గురు వేప (అజాడిరక్తా ఇండికా) వల్ల కలిగే అనేక ఔషధ ప్రయోజనాలను, ఉపయోగాలను వివరిస్తున్నారు. వేప యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఏజింగ్ గుణాలను కలిగి ఉండే కల్పవృక్షం. ఇది క్యాన్సర్ ను దూరంగా ఉంచడంతో పాటు యోగసాధనలో కూడా ఉపయోగపడుతుంది.

వేప అంటే ఏంటి ?

వేప ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఔషధ గుణాలున్న చెట్టుగా పేరుగాంచిన శక్తివంతమైన వృక్షం. ఆయుర్వేదంలో వేప చెట్టును సహజ ఔషధాలయంగా పరిగణిస్తారు. ఇది ఎక్కువగా భరత ఖండంలో పెరుగుతుంది కానీ దీని ఉపయోగాన్ని గుర్తించడం మొదలుపెట్టి ఇదే తరహా వాతావరణం ఉన్న ప్రదేశాలలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెంచుతున్నారు.

అది ఎలా పని చేస్తుంది?

వేప చెట్టు ఎన్నో లాభదాయకమైన రసాయనముల సమ్మేళనము. బెరడు మొదలుకొని వేపాకుల దాకా, ఆఖరికి పూలు, పళ్ళు , విత్తనాలు, వేరులు - వేప చెట్టులోని అన్ని భాగాలు అనేక రకాల రుగ్మతలను సరి చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్లకు ఒక గొప్ప వనరు కావడం వలన దానికి ఫ్రీరాడికల్ స్కావేజింగ్ లక్షణాలు ఉంటాయని పరిశోధనలు ధృవీకరించాయి. అలాగే అది సెల్ సిగ్నలింగ్ మార్గాలను నియంత్రించడం ద్వారా క్యాన్సర్ ను కూడా ప్రభావవంతంగా ఎదుర్కొనేందుకు సహకరిస్తుంది. వేప, సైక్లోఆక్సీజనేస్ (COX) ఇంకా లిపాక్సీజనేస్ (LOX) లతో సహా అనేక ప్రో - ఇన్ఫ్లమేట్రీ యంజైమును నియంత్రించడం ద్వారా ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థం పాత్రను కూడా పోషిస్తుంది.

వేపాకుల వల్ల కలిగే ప్రయోజనాలు

సద్గురు: వేప అనేది చాలా ప్రత్యేకమైన చెట్టు. వేపాకులు ఈ గ్రహం మీదే అత్యంత సంక్లిష్టమైన ఆకులు. వేప చెట్టులో 130కి పైగా జీవశాస్త్ర పరంగా చురుకైన కాంపౌండ్ లు ఉన్నాయి. ఈ గ్రహం మీద మీరు కనుగొనగల అత్యంత సంక్లిష్టమైన ఆకులలో వేపాకు ఒకటి.

1. వేపాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు - క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో సహాయపడుతుంది.

1neem

వేపకు ఎన్నో నమ్మశక్యం కాని ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. కానీ అత్యంత ముఖ్యమైన విషయాలలో ఒకటి ఏంటంటే, అది క్యాన్సర్ కణాలను చంపుతుంది. ప్రతి ఒక్కరికి కూడా తమ శరీరంలో క్యాన్సర్ కణాలు ఉంటాయి. కానీ అవి సాధారణంగా వ్యవస్థీకరించబడి ఉండవు. అయితే మీరు శరీరంలో కొన్ని పరిస్థితులను సృష్టించినప్పుడు, అవి వ్యవస్థీకరించబడతాయి. ఈ కణాలు విడివిడిగా వాటికై అవి అలా తిరుగుతూ ఉన్నంతకాలం ఎటువంటి సమస్య ఉండదు. అవి గనుక అన్నీ ఒక చోట చేరి, దాడి చేస్తే అప్పుడు అది సమస్య అవుతుంది. ఇది ఒక చిన్నపాటి నేరం నుండి ఒక వ్యవస్థీకరించబడిన నేరానికి మారడం లాంటిది. ఇది చాలా పెద్ద సమస్య. మీరు ప్రతిరోజు వేపాకును తీసుకుంటే అది శరీరంలోని క్యాన్సర్ కణాలను ఒక నిర్దిష్ట పరిమితిలో ఉంచుతుంది, తద్వారా అవి ఒక గ్యాంగు లాగా అయ్యి, వ్యవస్థకి వ్యతిరేకంగా పని చేయకుండా ఉంటాయి.

2. వేప వల్ల ప్రయోజనాలు - హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయడంలో సహాయపడుతుంది.

ఈ ప్రపంచం బ్యాక్టీరియాతో నిండిపోయి ఉంటుంది. అలాగే ఈ శరీరం కూడా. మీలో మీరు ఊహించగల దానికన్నా ఎక్కువ సూక్ష్మజీవులు నివసిస్తూ ఉన్నాయి. ఈ బ్యాక్టీరియాలో చాలా వరకూ సహాయకారిగా ఉంటాయి. అవి లేకుంటే మీరు ఏమి అరిగించుకోలేరు. వాస్తవానికి అవి లేకుంటే మీరు మనగలగలేరు. కానీ కొన్ని బ్యాక్టీరియాలు మీకు హాని కలిగించగలవు. మీ శరీరం ఈ బ్యాక్టీరియాలను మేనేజ్ చేయడానికి నిరంతరం శక్తిని ఖర్చు పెడుతూ ఉంటుంది. ఒకవేళ అధిక స్థాయిలో బ్యాక్టీరియా ఉంటే, మీకు మతకగా అనిపిస్తుంది. ఎందుకంటే మీ సంరక్షణ వ్యవస్థ వాటితో యుద్ధం చేసేందుకు చాలా ఎక్కువ శక్తిని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. శరీరం లోపల ఇంకా శరీరం బయట కూడా వేపను వాడటం ద్వారా, మీరు ఈ బ్యాక్టీరియాలు అధికంగా పెరగకుండా ఉండే విధంగా మేనేజ్ చేయగలుగుతారు. ఇక అప్పుడు వాటితో యుద్ధం చేయటం కోసం మీ శరీరం అధిక శక్తిని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. మీరు రోజూ కొంత వేపను కనుక తీసుకుంటే, అది పేగు ప్రాంతంలో ఉన్న ఇబ్బంది కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అలాగే మీ పెద్ద పేగును శుభ్రంగా ఇన్ఫెక్షన్ లేకుండా ఉంచుతుంది.

అలాగే శరీరంలోని కొన్ని భాగాల్లో కొద్దిగా వాసన వస్తూ ఉన్నట్టయితే, దాని అర్థం అక్కడ బ్యాక్టీరియా కొంచం ఎక్కువ యాక్టివ్ గా ఉంది అని.

వేపాకు వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు

దాదాపు ప్రతి ఒక్కరికి కొన్ని చిన్న చర్మ సమస్యలు ఉంటాయి కానీ మీరు మీ శరీరాన్ని వేపతో కడిగితే అది శుభ్రంగా, ప్రకాశవంతంగా మారుతుంది. మీరు స్నానం చేసే ముందు వేప పేస్ట్‌తో మీ శరీరాన్ని రుద్దుకుని, కొంచం సేపు ఆరనిచ్చి, ఆపై నీటితో కడిగేస్తే అది మంచి యాంటీ బాక్టీరియల్ స్నానంగా పనిచేస్తుంది. ప్రత్యామ్నాయంగా, మీరు కొన్ని వేప ఆకులను రాత్రిపూట నీటిలో నానబెట్టి, ఉదయం ఈ నీటితో స్నానం చేయవచ్చు.

వేపాకు యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనాలు

అన్నింటినీ మించి వేప శరీరంలో ఉష్ణాన్ని కలిగిస్తుంది. ఈ ఉష్ణాన్ని సృష్టించడం అనేది వ్యవస్థలో చాలా తీక్షణమైన శక్తి రూపాలను తయారుచేయడంలో సహాయపడుతుంది. శరీరంలో విభిన్నమైన లక్షణాలు ప్రధానమైనవిగా ఉంటాయి. వీటిలో రెండు ఏమిటంటే,శీత, ఉష్ణ. ఇంగ్లీష్ భాషలో శీతకి అత్యంత దగ్గరైన పదం కోల్డ్. కానీ అది శీతకి సరిగ్గా సమానమైన పదం కాదు. మీ వ్యవస్థ శీత వైపుగా వెళితే, శరీరంలోని శ్లేష్మము స్థాయిలు పెరుగుతాయి. శరీరంలో మితిమీరిన శ్లేష్మము అనేది, సాధారణ జలుబు నుండి సైనసైటిస్ నుండి ఇంకా ఎన్నో ఇతర రకరకాల పరిస్థితులకు అనుసంధానమై ఉంటుంది.

ఒక హఠ యోగికి వేప ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే అది శరీరాన్ని కొద్దిగా ఉష్ణం వైపుగా ఉంచుతుంది.

2neem

ఒక హఠ యోగికి వేప ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే అది శరీరాన్ని కొద్దిగా ఉష్ణ వైపుగా ఉంచుతుంది. అంటే మీకు కొంచెం ఎక్కువ ఇంధనం ఉంది అని. తెలియని ప్రదేశాలను అన్వేషిస్తున్న ఒక సాధకునికి, కొద్దిగా ఎక్కువ ఇంధనాన్ని తీసుకువెళ్లడం అనేది సురక్షితం. ఎందుకంటే ఒకవేళ మీ వ్యవస్థకీ ఎక్కువ శక్తి అవసరపడొచ్చేమో. మీరు(మీలో) మంటను సాధారణంగా అవసరమైన దానికన్నా కొద్దిగా ఎక్కువగా ఉంచాలి అనుకుంటారు. శరీరం శీత వైపు ఉంటే, మీకు మరీ ఎక్కువ కార్యకలాపాలు చేసే సామర్థ్యం ఉండదు. కానీ మీరు గనుక శరీరాన్ని కొద్దిగా ఉష్ణ వైపున ఉంచితే, మీరు ప్రయాణం చేసినా, బయట తిన్నా, లేదా మరి దేనికైనా ప్రభావితం అయినా, అప్పుడు మీలోని ఈ ‘ఎక్కువ’ మంట రగిలి బాహ్య ప్రభావాలను నిర్వహిస్తుంది. ఈ దిశగా వేప అనేది ఎంతో సహకారి.

వేప చెట్టు ప్రయోజనాలు

వేప చెట్టులోని ప్రతి భాగానికీ కూడా ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఉన్నాయి. అందువల్ల అది ప్రపంచంలోనే అత్యంత బహుముఖ ఔషధ చెట్టుగా గుర్తించబడింది. భారతదేశంలో మన సాంప్రదాయంలో వేప చెట్టు ప్రయోజనాలు మనకు ఎప్పటినుండో తెలిసినా, గత దశాబ్ద కాలంలో ఆధునిక పరిశోధన ఈ వేప చెట్టుని వెలుగులోకి తీసుకువచ్చింది. అధ్యయనాలు, వేపతో చేసిన ఉత్పత్తులు ప్రయోజనకరమైన కీటకాలకు, పరాగ సంపర్కాలకు ఇంకా తేనెటీగలకూ అనుకూలంగా ఉన్నాయని కనుగొన్నారు. అవి పర్యావరణపరంగా నిరపాయమైనవి, స్థిరమైనవి, పునరుత్పాదకమైనవి, అందరికి అందుబాటులో ఉన్నవి.

వేప జ్యూసు యొక్క ప్రయోజనాలు

వేప జ్యూస్ తాగటం అనేది ఒకరి జీర్ణవ్యవస్థను పునర్వ్యవస్థీకరించి రీబూట్ చేయడానికి సహాయపడుతుంది. అది ఒకరి మెటబాలిజంను కూడా గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఒక జ్యూస్ గా తీసుకున్నప్పుడు, చేదుగా ఉండే ఈ వేప శరీరంలోని కొవ్వును కరిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే అది పేగులలోని మలాన్ని శుభ్రపరచడానికి, శరీరం మల విసర్జన ప్రక్రియను మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇది అవసరం లేని బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడం ద్వారా రక్తాన్ని శుద్ధిచేస్తుంది. ఎందుకంటే వేపలో యాంటీ బ్యాక్టీరియల్, ఏంటి సెప్టిక్ ఎంజైములు సమృద్ధిగా ఉంటాయి. ఈ అన్ని కారణాల వల్ల, వేప జ్యూసు అనేది తీసుకోదగిన అత్యంత ప్రయోజనకరమైన జ్యూస్ లలో ఒకటిగా భావించబడుతుంది. అయితే పరిశోధన ఇప్పటికీ, ఎంత తాగితే అది మితిమీరినది అవుతుంది అన్న దాన్ని నిర్ధారించలేదు. వేప జ్యూస్ తాగేటప్పుడు, మితంగా తాగమని డాక్టర్ల సూచన.

వేపాకు పొడి ఉపయోగాలు

వేప, పొడి రూపంలో కూడా లభిస్తుంది. అలాగే ఆ విధంగా దాన్ని చాలా కాలం పాటు నిల్వ ఉంచ వచ్చు కూడా. కాబట్టి అది ప్రయాణిస్తున్నప్పుడు మీతోపాటు తీసుకువెళ్లేందుకు ఉత్తమమైనది. అలాగే పొడిగా చేయడంలోని మరొక ప్రయోజనం ఏమిటంటే, దాన్ని వేప చెట్టు పెరగని, ప్రపంచంలోని ఇతర భాగాలకు అందుబాటులోకి తీసుకురావడం చాలా సులభం అవుతుంది. పొడిని తినవచ్చు అలాగే బయట చర్మం మీద పౌడర్ లాగా రాసుకోవచ్చు. వేపాకులను ఎండలో ఎండబెట్టి ఆ తర్వాత మెత్తని పొడిగా మిక్సీ వేయడం ద్వారా మనం ఇంటివద్దే వేప పొడి తయారు చేసుకోవచ్చు.

వేప ఔషధ ప్రయోజనాలు

ప్రాచీన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వేప అనేది అన్ని ఔషధాలలోకీ రారాజు. ప్రాచీనకాలం నాటి ఆయుర్వేద గ్రంథాలలో, వేప చర్మ రుగ్మతలను, జుట్టు సమస్యలను ఎలా పోగొడుతుందో, ఆకలిని ఎలా పెంచుతుందో, జీర్ణక్రియను ఎలా పెంచుతుందో, కడుపులోని జఠరాగ్నిని ఎలా పెంచుతుందో, శ్వాసను ఎలా మెరుగుపరుస్తుందో, మధుమేహ పరిస్థితులను నిర్వహించడానికి ఎలా సహాయపడుతుందో, గాయాలను నయం చేయడంలో ఎలా సహాయపడుతుందో, వికారం నుండి ఎలా ఉపశమనాన్ని ఇస్తుందో రాసి ఉంది. వేపను "21వ శతాబ్దపు చెట్టు" గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ కూడా 1992లో తన నివేదికలో “వేప: ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి ఒక చెట్టు” అనే పేరుతో వేప ఔషధ విలువను గుర్తించింది. వేప కొన్ని ముఖ్య ఔషధ ఉపయోగాలు ఇవి:

1.సంరక్షించడం- చర్మ సంరక్షణ కోసం వేప ఆకులు

2.శుబ్రం చేయడం - శుబ్రం చేయడం కోసం వేప విత్తనాలు

వేప విత్తనాలకు ప్రక్షాళణ లక్షణాలు ఉంటాయి, కాబట్టి పేగులలోని పురుగులను పోగొట్టడం కోసం వాటిని ఉపయోగిస్తారు. ఈ వేప విత్తనాలలో నుండి రసం తీసి తాగుతారు. ఈ వేప విత్తన రసం, పేగులో ఉండే పురుగులను, ఇంకా ఇతర అవాంఛిత పరాన్న జీవులను నాశనం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

౩. నయం చేయడం – పంటి రోగాలను నయం చేయడానికి వేప బెరడు

దంతాల పాచిని ఎదురుకొనే సామర్థ్యంలోనూ, నోటిలో ఉండే బ్యాక్టీరియాను తగ్గించే సామర్థ్యంలోనూ, వేప బెరడు పెట్టింది పేరు. ఈ కారణంగానే, ఈ సాంప్రదాయంలో వేప పుల్లలను టూత్ బ్రష్ గా ఉపయోగిస్తారు. అలాగే వేప బెరడు కు ఉన్న యాంటీసెప్టిక్ ఇంకా వగరు లక్షణాల కారణంగా, అది నోటిలోని గాయాలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది.

శుద్ధి చేయడం - శుద్దీకరణ కోసం వేప వేర్లు

వేప చెట్టులోని అన్ని ఇతర భాగాలలో లాగానే, వేప వేళ్లలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 2011 లో నిర్వహించిన ఒక అధ్యయన ఫలితాలు, వేప వేరు బెరడు సారం, 27.3 μg / mL వద్ద 50% స్కావెంజింగ్ యాక్టివిటీతో, అధిక ఫ్రీ రాడికల్ స్కావెంజింగ్ ప్రభావాన్ని ప్రదర్శించిందని అలాగే ఈ సారం యొక్క మొత్తం యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటి ఆస్కార్బిక్ ఆమ్లం ప్రామాణికం ప్రకారం 0.58 అని తేలింది.

వేప పండు ఉపయోగాలు

వేప పండు నుండి నూనె తీస్తారు. దీన్ని చుండ్రుని పోగొట్టడం కోసం తలకి రాయవచ్చు. అలాగే చుండ్రు రాకుండా నివరణకు కూడా వాడవచ్చు. ఈ నునే దోమల రిపెల్లంట్ గా కూడా సమర్ధవంతంగా పనిచేస్తుంది. సాధారణంగా లభించే అన్ని రూమ్ ఫ్రెషనర్‌లలో కూడా ఇది ఒక భాగంగా ఉంటుంది.

వేప పూత ఉపయోగాలు

వేప పూతకు యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి, అలాగే దాన్ని తిన్నప్ప్పుడు అది వ్యవస్థను శుభ్రం చేస్తుంది. దక్షిణ భారతదేశంలో కొన్ని వంటకాలలో వేపపువ్వు వాడటానికి గల కారణాలలో ఇది ఒకటి. ఉదాహరణకు, సాంప్రదాయ నూతన సంవత్సరాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంకా కర్ణాటకలలో ఉగాది పచ్చడి అనే ప్రత్యేకమైన వంటకంతో జరుపుకుంటారు. దానిలో బెల్లం, వేప పువ్వులు వాడతారు. ఆయుర్వేదం వేపపువ్వు చలవ చేస్తుంది అని చెప్తుంది. వేసవి కాలంలో వేసవి తాపాన్ని తట్టుకోగలడానికి వంటకాలలో దానిని వాడాలి అని సూచిస్తుంది.

వేప వల్ల జరిగే అవకాశం ఉన్న ప్రతికూల ప్రభావాలు

సద్గురు: బాగా గుర్తుంచుకోవలసిన ఒక విషయం ఏంటంటే వేపను అతిగా తీసుకోవడం అనేది వీర్యకణాలను చంపుతుంది. గర్భం దాల్చిన మొదటి నాలుగైదు నెలల్లో, పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడు, గర్భిణీ స్త్రీలు వేపను తీసుకోకూడదు. వేప అండాశయాలకు ఎటువంటి నష్టం కలిగించదు కాని అది అధిక వేడిని కలిగిస్తుంది. ఒక స్త్రీ అప్పుడే గర్భం దాల్చి ఉంటే, అదే సమయంలో శరీరంలో ఎక్కువ వేడి ఉంటే, ఆమె పిండాన్ని కోల్పోవచ్చు. ఒక స్త్రీ గర్భం ధరించాలని అనుకున్నట్లయితే ఆమె వేపను తినకూడదు, ఎందుకంటే అధిక వేడి ఉంటుంది, మన శరీర వ్యవస్థ ఆ శిశువును బయటి పదార్థంలా భావిస్తుంది.

వేప అండాశయాలకు ఎటువంటి నష్టం కలిగించదు కాని అది అధిక వేడిని కలిగిస్తుంది. ఒక స్త్రీ అప్పుడే గర్భం దాల్చి ఉంటే, అదే సమయంలో శరీరంలో ఎక్కువ వేడి ఉంటే, ఆమె పిండాన్ని కోల్పోవచ్చు.

వేడి పెరిగితే, వ్యవస్థలో కొన్ని మార్పులు జరుగుతాయి - దీనిని పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలు గమనిస్తారు. ఒకవేళ ఇది శరీర సాధారణ ప్రక్రియపై ప్రభావం చూపితే, మనం వేడిని కొంతవరకు తగ్గించుకుంటాము, కాని సాధారణంగా వేపను వదులుకోవటానికి ఇష్టపడము. ఎందుకంటే సాధన చేసేవారికి, వ్యవస్థలో కొంత వేడి అవసరం. ఒకసారి రోజూ వేపను తీసుకోవడం ప్రారంభించిన తర్వాత, కొంతమంది మహిళలు, తమ ఋతు చక్రాల వ్యవధి తక్కువగా అవ్వడాన్ని గమనించే అవకాశం ఉంది. అలా అవుతున్నట్లయితే, మరిన్ని మంచి నీళ్లు తాగండి చాలు. వేడిని తగ్గించడానికి కేవలం నీటిని మాత్రమే తీసుకోవడం అనేది సరిపోకపోతే, నీటికి ఒక బద్ద నిమ్మకాయని, లేదా ఒక బద్ద నిమ్మకాయ రసాన్ని కలపండి. ఒకవేళ అది కూడా సరిపోకపోతే, ఎంతో చలవ చేసే గ్లాసుడు బూడిదగుమ్మడికాయ రసాన్ని తాగండి. మరొకటి ఏమిటంటే ఆముదం. ఆముదంను మీ బొడ్డు మీద, అనాహత వద్ద, గొంతు గుంట వద్ద, ఇంకా చెవుల వెనుక రాస్తే, అది వెంటనే వ్యవస్థను చల్లబరుస్తుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు