“మహాశివరాత్రి పర్వదినాన” ఉండే అద్భుతమైన శక్తిని అనుభూతి చెందేందుకు, మన గ్రహణశీలతను పెంచే ఒక గొప్ప అవకాశమే మహాశివరాత్రి సాధన. ‘బెంగళూరు’ నుంచి “కావ్య” తన అనుభవాన్ని, తను చేసిన సాధనను, అది తన జీవితాన్ని ఎలా మార్చేసింది అన్న విషయాన్ని మనతో పంచుకుంటోంది.

కొన్ని ఏళ్ల క్రితం నేను నా ఐ.టి ఉద్యోగంతో విరక్తి చెందాను. అప్పుడు నాలో ఈ ప్రశ్న ఉత్పన్నమైనది. “నేను దీనితో సంతోషంగా లేను. నేను ఎందుకు ఈ ఉద్యోగంలో ఉండాలి?” అని అనుకున్నాను. నేను ఆ ఉద్యోగం మానేసాను. నాకు ఏది ఆనందం కలిగిస్తుందో తెలుసుకోవాలని అన్నిటిని ప్రయత్నం చేసాను. ఫోటోగ్రఫి, ఫీజికల్ ట్రైనరుగా, అన్నీ ప్రయత్నం చేసాను. కానీ ఏవి నాలో ఉన్న శూన్యాన్ని నింపుతున్నట్టుగా అనిపించడం లేదు. ఒక రోజున “భగవంతుడా! నాకు దారి చూపించు? నాకు సహకారం కావాలి?” అని ఒంటరిగా బాధపడ్డాను.

నేను ఇలా నిస్సహాయంగా, ఎన్నో తెలియని ప్రశ్నలకు సమాధానం కావాలని కోరుకుంటూ ఉన్నాను. ఒకరోజున, మా ఆయన నన్ను  న్యూస్ ఛానెల్లో వస్తున్న సద్గురు ప్రొగ్రాము చూడమని  చెప్పారు. సద్గురు ఇంటర్వ్యూ  చూడమని బలవంతం చేశారు.

మూడు రోజులు ఈ సాధన చేసిన తరువాత మొట్టమొదటి సారిగా నా జీవితంలో నేను ఒకరకమైన నిశ్చలత్వాన్ని అనుభూతి  చెందాను

నాకు గురువుల మీద  కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అందుకని నేను అది అప్పుడు చూడ్డానికి  కొంత సంశయించాను. సరే, ఈయన ఎవరో గొప్ప గురువు అని  చెప్తున్నారు కాబట్టి చూద్దామని, నేను ఆ ప్రొగ్రాము చూసాను. ఎంతో సంక్లిష్టమైన అంశాలకి ‘సద్గురు’ ఎంత సరళంగా సమాధానాలు చెప్పారో చూసి నేను ఎంతో ఆశ్చర్యపోయాను. నా జీవితంలో మొట్ట మొదటిసారి నాకు తెలియని ఎన్నో అంశాలు నాకు అర్ధమయ్యాయి. ఆ రోజు నుంచి నేను సద్గురు వీడియోలు చూడ్డం నా  దినచర్యలో ఒక భాగంగా చేసుకున్నాను. నేను జీవితాన్ని ఎలా అవగాహన చేసుకుంటున్నాను అన్న దాని మీద ఇది ఎంతో ప్రభావం చూపించింది.

మహాశివరాత్రి సాధన : నా జీవితంలో మొట్టమొదటి సాధన

ఒక రోజున “మహాశివరాత్రి సాధనను” నేను ‘ఈశా వెబ్ సైట్’  లో చూసాను. ఎలా అయినా సరే, ఇది  నేను చేసి తీరాల్సిందే అని అనుకున్నాను. నేను అంతకు ముందర ఎటువంటి సాధనలు చేయలేదు. ‘ఈ సాధన అనేది సద్గురు నాకు చూపిస్తున్న ఒక మార్గం లాగా అనిపించింది’. ఎంతో ఉత్సాహంతో నేను ఈ ప్రక్రియను మొదలుపెట్టాను. నేను పొద్దున్నే నాలుగు గంటలకే లేచాను. ఇది జీవితంలో నేను అంతకు మునుపు ఎప్పుడు చేయలేదు. శివ నమస్కారం చేసి, ఆ మంత్రోచ్ఛారణ చేశాను. ఇది కూడా జీవితంలో అంతకు ముందర ఎప్పుడు చేయలేదు. ‘మూడు రోజులు ఈ సాధన చేసిన తరువాత మొట్టమొదటి సారిగా నా జీవితంలో నేను నిశ్చలత్వాన్ని అనుభూతి  చెందాను’. ఇది ఎంత గాఢమైన అనుభూతి అంటే, నేను దాన్ని మాటల్లో చెప్పలేను. అలా రోజులు గడుస్తున్న కొద్దీ  ఈ అనుభూతి మరింత తీవ్రంగా, మరింత పారవశ్యంగా మారింది.

మహాశివరాత్రి: వర్ణనాతీతమైన అనుభవం

మహాశివరాత్రి రోజున నేను ఎంతో ఉత్సాహంతో ఈశా యోగ సెంటర్ లో జరుగుతున్న వేడుకలను టీవిలో చూసాను. అర్ధరాత్రి అయ్యేసరికే ఒక ప్రత్యేకమైన ధ్యానం సద్గురు చేయించారు. అటువంటిది నా జీవితంలో మొట్ట మొదటిసారిగా నేను చేసాను. నేను నా శరీరానికి,  మనస్సుకి మించిన దాన్ని దేన్నో అనుభూతి చెందడం మొదలుపెట్టాను.

నేను నా శరీరానికి,  మనస్సుకి మించిన దాన్ని దేన్నో అనుభూతి చెందడం మొదలుపెట్టాను. అది ఎంతో పారవశ్యంతో కూడుకుని ఉంది.

అది ఎంతో పారవశ్యంతో కూడుకుని ఉంది. నాకు పరవశంతో కూడిన ఆనంద భాష్పాలు అలా కారిపోతున్నాయి. ధ్యానం గడుస్తూ ఉంది. నాలాంటి సామాన్యమైన వాళ్ళకి ఇది  సాధ్యం అని నేను ఎప్పుడు అనుకోలేదు. నా కళ్ళు మూసే ఉన్నాయి. నాకు వాటిని తెరవాలని అనిపించడంలేదు. నేను ఒక రకమైన స్థితిలో ఉన్నాను. కేవలం పారవశ్యం, మరేదీ లేదు. అది కేవలం కొన్ని క్షణాలే అనుభూతి చెందినప్పటికీ, ఇది ఎంత అద్భుతంగా ఉందంటే నాకు అది మళ్ళీ కావాలి అని అనిపించింది. నేను వెంటనే  ‘ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాము’ లో చేరాను. ‘ఇన్నర్ఇంజనీరింగ్ ప్రోగ్రాము చేసిన తరువాత, నా జీవితం ఎంతగా పరిణామం చెందిందంటే నేను చేయగలను అని ఎప్పుడు అనుకోనివి కూడా ఎన్నో పనులు చేయగలుగుతున్నాను. జీవితంలో శ్రమ లేకుండా అన్నీ సులువుగా జరిగిపోతున్నాయి’. “ఇలాంటి ఆవశ్యకతలను అందించినందుకు సద్గురు కి ఎలా ధన్యవాదాలు చెప్పుకోవాలి”?

ఎల్లప్పటికీ కృతజ్ఞతతో,

కావ్య, బెంగళూరు.

సంపాదకుడి ద్వారా:

మహాశివరాత్రి సాధన, అమోఘమైన  సంభావ్యతలు గల మహాశివరాత్రికి మిమ్మల్ని సిద్ధంచేసే ప్రక్రియ.ఈ సాధనను  ఎనిమిది సంవత్సరాల వయసు దాటిన వారు ఎవరైనా చేయవచ్చు.ఈ సాధనను మీరు  40,21,14,7 లేక 3 రోజుల పాటు చేయవచ్చు. దీక్ష మొదలు పెట్టిన రోజు నుంచి  ఫిబ్రవరి, 24 2017 నాడు వచ్చే శివరాత్రి వరకు మీరు సాధన చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం చూడండి: మహాశివరాత్రి సాధన