మందార పువ్వుతో టీ
 
VV Subrahmanyam and ensemble at the Day 2 of Yaksha 2014
 

ఈ ఉజ్వలమైన, తాజా పానీయం మీ శరీరానికి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందితయారు చేయడం తేలిక, రోజంతా మిమ్మల్ని ఉత్తేజంగా ఉంచుతుంది.

కావలసిన పదార్థాలు :

ఒక కప్పు ఎండబెట్టిన మందార పువ్వులు (రసాయనాలు, పురుగుమందులు వాడకుండా పెంచిన, తినదగిన పువ్వులు)

1 (1।। అంగళపు) దాల్చిన చెక్క ముక్క

1/2।। అల్లంముక్క - బాగా కడిగిన, తాజాముక్క, పొట్టు తీయకుండా గుండ్రని బిళ్లలుగా కోయాలి.

రుచికి తగినంత తేనె/ తాటి బెల్లం

తయారుచేసే పద్ధతి:

  1. 4 కప్పుల నీటిని మరిగించండి. మందారపూలు, దాల్చిన చెక్క, అల్లంముక్కలు వేయండి. 5 నిమిషాలు మరిగించండి.
  2. పాత్రను దించి మూతపెట్టండి. 15-20 నిమిషాలు అలా ఉంచండి. (పూలను ఎక్కువసేపు నీళ్లలో ఉంచితే చేదురావచ్చు. మరింత పరిమళం, రుచికోసం మరికొన్ని ఎండు పూలు వేయవచ్చు)
  3. దాల్చిన చెక్క, అల్లం ముక్కలను గట్టిగా ఒత్తి పానీయాన్ని వడకట్టండి. వాటి పరిమళం చక్కగా దిగుతుంది.
  4. రుచికి తగ్గట్టు తేనె లేదా తాటిబెల్లం చేర్చండి. చల్లగాగాని, వేడిగా గాని తాగండి. దాన్ని రిఫ్రిజరేటర్‌లో పెట్టే ముందు పూర్తిగా చల్లబడనివ్వండి.

చిట్కాలు:

  • దాల్చిన చెక్క ముక్క బదులుగా 2 టీ స్పూన్ల దాల్చిన పొడి కూడా వాడచ్చు, అట్లా వాడినప్పుడు బట్టతో వడకట్టండి.
  • ఈ టీ ని సాధారణంగా రిఫ్రిజరేటర్లో చల్లబరిచి, కొన్ని పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కతో అలంకరించి సర్వ్ చేస్తుంటారు.
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1