పారిస్ లో పర్యావరణ సదస్సు జరుగుతూ , ఇలాంటి ప్రమాదకరమైన వాతావరణ మార్పుకు కారణం అయిన దేశాలు, భారతదేశంలో సగటు వ్యక్తి కార్బన్ ఫుట్ ప్రింట్ అత్యంత తక్కువగా ఉన్నప్పటికీ , ఎలా అభివృద్ధి పగ్గాలు పట్టాలి అని నిరూపించుకోవటానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే, దాన్ని పరిహసిస్తున్నట్లుగా ఇలా జరిగింది. చెన్నై ఈ విపత్తుకు గురైయ్యింది. నగర నిర్మాణంలో సరైన ప్రణాళిక లేకపోవటం ఈ పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది, దానివల్ల అక్కడివారికి చెప్పలేనన్ని కష్టాలు మీద పడ్డాయి. ఏ అధికార యంత్రాంగం కూడా ఇలాంటి ఆపదను ఎదుర్కోవటానికి సామర్ధ్యం కలిగి ఉండదు కాని ప్రజల కష్టాలను కొంతవరకు తగ్గించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయం, ఆర్మీ, ఎయిర్ ఫోర్సు సహాయం, తమిళ రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చిన భారీ మొత్తాల్లో డొనేషన్లు, అన్నిటినీ మించి ఆ నగరానికి బయట ఉన్న వారు చేసిన బ్రహ్మాండమైన రిలీఫ్ కార్యక్రమాలు ప్రజలకు కొంత ఊరటనిచ్చాయి. చెన్నై తన ధైర్య స్పూర్తిని నిలబెట్టుకుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం ఎన్నో ప్రాణాలను తీసుకుంది, ఎన్నో హృదయాలను కలిచి వేసింది. ఎంతో దుఃఖంతో నిండిన కధలు చెన్నై వాసులను వచ్చే చాలా కాలం వరకూ వెంటాడతాయి. ఇళ్ళు నాశనం అయిపోయి, వ్యాపారాలు తుడిచిపెట్టుకు పోయాయి కాని తమిళ ప్రజల స్ఫూర్తి అలానే నిలిచి ఉంది. ధైర్యం, కరుణతో నిండిన అనేక పనులు ఒక ప్రేరణగా నిలుస్తాయి, ఇది మానవ సంబంధాల మీద నమ్మకాన్ని తిరిగి పునరుద్ధరణ చేసాయి.

ఈశా వాలంటీర్లు ఎంతో నిస్వార్ధంగా, చిరుకుగా ఉండటం ప్రపంచంలోనే ఒక చరిత్రను సృష్టించింది. 50 వైద్య శిభిరాలను, నీరు వెనక్కి తగ్గిన తరువాత వచ్చే అవకాశం ఉన్న అంటువ్యాధుల నియంత్రణ కోసం ముందస్తుగా ఈశా ఏర్పాటు చేసింది.

ఈశా వాలంటీర్లు అందరూ ముందుకు వచ్చి, అత్యున్నత స్థాయి చిత్తశుద్ధి , అంతః దృష్టిని చూపించి అసహాయంగా ఉన్న చెన్నై, కడలూరు ప్రాంత వాసుల బాధను తగ్గించటానికి ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

నేను మీతోనే ఉన్నాను, వచ్చే వారంలో చెన్నైకు వచ్చి మీ సేవకు, త్యాగానికి ధన్యవాదాలు తెలియజేస్తాను.

ప్రేమాశీస్సులతో,
సద్గురు