నా చేయందుకో...
ArticleApr 1, 2016
ఈ వారం, సద్గురు లేఖలో , ఆయన అనుగ్రహాన్ని ఒక కవితా రూపంలో వ్యక్తీకరించారు. మన జీవితాన్నే మార్చేయగల ఆయన ఆహ్వానాన్ని అందుకోండి...పారమార్ధికాన్ని రుచి చూడండి..
నా చేయందుకో
ఏ కార్చిచ్చుల సెగ నిన్ను కాల్చలేదు
ఏ హిమపాతమూ నిన్ను వణికించలేదు
ఏ లోతైన సముద్రమైనా నిన్ను ముంచలేదు
ఏ అనంత అగాధమూ నిన్ను పూడ్చలేదు
ఇదిగో... నాచేయందుకుని
అనంతాన్ని చవిచూడు
నేను పండితుణ్ణీ కాను...
వేదాంతినీ కాను
జ్ఞాన సంపుటిని అసలే కాను
నేను కేవలం శూన్యాన్ని
నను తాకి చూడు..నువ్వు ఐక్యమైపోతావు....