పిల్లలు కలగడం ద్వారానే స్త్రీ జీవితానికి సార్ధకత వస్తుందని అనేవారు ఈ సమాజంలో ఎక్కువే. కాని ఒక జీవి సంపూర్ణత్వాన్ని కేవలం పునరుత్పత్తి ద్వారానే జరుగుతుందా? ప్రస్తుతం ఉన్న జనాభా ఆధారంగా చూస్తే పిల్లలని ఎరుకతో కానని స్త్రీలే నిజంగా సమాజాన్ని కాపాడుతున్నారని సద్గురు గుర్తుచేస్తున్నారు.

ప్రశ్న: ఒక స్త్రీ గా, బిడ్డకు జన్మ నివ్వకపొతే నా జీవితం సార్ధకమవ్వదని నేను భావిస్తున్నాను. నేను ఏదైనా తప్పు చేసినందువల్ల నాకు ఇటువంటి ఆశీర్వాదం కలగలేదా?

సద్గురు: పునరుత్పత్తి సంతృప్తిని కలిగించేదయితే, ప్రపంచంలో ఇంత  వరకూ ఎంత సంతృప్తి  ఉండాలి? కానీ లేదు కదా..! ముందు ఎవరైనా పిల్లలను ఎందుకు కోరుకుంటారో మనం పరిశీలించి చూడాలి. ఒక అంశం ఏమిటంటే, లైంగిక చర్య వైపుకు ప్రేరేపింపజేసే సహజ స్వభావం మీలో ఉంది. అంతమాత్రాన పిల్లలు పుట్టాల్సిన అవసరంలేదు, గర్భనిరోధకాల ద్వారా పిల్లలు సంభవించకుండా చూసుకుంటున్నాం.

చాలామంది ప్రజలు పిల్లలు కలగాలని కోరుకోవటానికి కారణం, జీవితంతో లోతూగా నిమగ్నమవ్వాలన్న ఆకాంక్ష వల్ల వచ్చిందే. మీ భర్త లేదా భార్యతో మీ ప్రమేయం కొద్దికాలం తరవాత తగ్గిపోతుంది, అందువల్ల మీరు క్రొత్తవాటిని కోరుకుంటున్నారు, ఇందుకు  ఒక బిడ్డ ఉంటే మంచిదని మీరు అనుకుంటారు. మీరు నిజంగా అనుభూతి చెందాలని కోరుకుంటున్నది మరో జీవితంతో లోతూగా నిమగ్నమవ్వడం. కానీ ఈ నిమగ్నత తప్పనిసరిగా భౌతిక  ఏకత్వం ద్వారా ప్రేరణ పొందవలసిన అవసరం లేదు. ఇది మీ స్వంత అవగాహన ఇంకా మేధస్సు వల్ల కూడా కలిగించవచ్చు.

జీవితంతో పూర్తిగా నిమగ్నమై ఉండడమెలాగో మీకు తెలిస్తే, పిల్లలను కనవలసిన అవసరం మీకు కనిపించదు.

ఉదాహరణకి ఒక స్త్రీ ఒక పిల్లవాడిని ప్రసవించినప్పుడు, ఆమెకు ఇంకొకరి బిడ్డను తెచ్చి ఇచ్చారనుకోండి, ఆ బిడ్డతో ఆమె అనుభవించే అన్ని విషయాలను ఆమెకు కలిగిన బిడ్డతో అనుభూతి చెందే విధంగానే అనుభవిస్తుంది. భావోద్వేగ, మానసిక సాన్నిహిత్యం అనేవి ఒక మనిషి తాను అనుభవించే ఏకత్వం ఆధారంగా ఉంటుంది. మీ పిల్లవాడు మీ నుండి బయటికి వచ్చినా లేక వేరొకరి నుండి బయటకు వచ్చినా, పెద్ద విషయమేముంది. ఒక  వ్యక్తి పట్ల మీరు సుముఖంగా ఉండి, వారిని మీలో ఒక భాగంగా చేర్చుకోవడం వల్ల కలిగిన అనుభూతి. ఇది భౌతికతకు సంభందించినది కాదు, మానసికమైనది.

జీవితంతో పూర్తిగా నిమగ్నమై ఉండడమెలాగో మీకు తెలిస్తే, పిల్లలను కనవలసిన అవసరం మీకు కనిపించదు. ఒక పిల్లవాడిని పెంచాలని మీరు నిజంగా కోరుకుంటే, అందుకు ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు లేని చాలా మంది పిల్లలు ఉన్నారు. మనం వాళ్ళకు చేయగలిగింది చేద్దాం. మీ అవసరాలు నెరవేర్చుకోవడానికి మీరు పిల్లలను కనకూడదు. ప్రపంచంలోకి పిల్లలను తీసుకురావడానికి ఇది మంచి మార్గం కాదు. దురదృష్టవశాత్తు, 99% పిల్లలు ఈ ప్రపంచంలోకి ఇలాగే వచ్చారు. ఒక జీవితంగా, మీరు సంపూర్ణమైనవారే..!. జీవితాన్ని పూర్తిగా అనుభూతి చెందడానికి పునరుత్పత్తి అవసరం లేదు. ఒక డజను మంది పిల్లలను కన్నవాళ్ళు  ఉన్నారు. వారు పరిపుర్ణులని మీరు భావిస్తున్నారా? ప్రకృతి ఏదో ఒక విధంగా మీరు పునరుత్పత్తి చేయటానికి దాని మాయలను కలిగి ఉంటుంది. మీరు బిడ్డను కంటే, మీ జీవితం నెరవేరుతుందని మీరు నమ్ముతారు. కానీ, అటువంటి విషయాలకు లొంగిపోవలసిన అవసరం లేదు.

ప్రపంచ జనాభాలో 50 శాతం మందికి వారి శరీరంలో తగినంత పోషణ లేదు. మానవులుకు లభించవలసినవేవి వారికి లభించడం లేదు

సామాజికంగా కూడా, ఈ సమాజం మిమ్మల్ని ఇలా మాయ చేసింది. అనేక సమాజాలలో చాలా కాలంగా - వారు, "మీరు పిల్లలను కనలేకపొతే, మీరు ఒక మహిళ కాదని, గోడ్రాలని, చెడ్డ శకునమని” చెప్పారు. " మీరు అడిగిన ప్రశ్న వెనుక ఉన్న భారం ఇదే. దీనికి పెద్ద సామాజిక కారణం ఉంది. పునరుత్పత్తి చేయని వారు చెడ్డ శకునాలు అయితే, ఆధ్యాత్మిక మార్గంలో నడిచిన వారందరూ ఆ పనులు చేయాలనుకోలేదు – సాధువులు, సన్యాసులు, వివేకానందుడు – వీరందరినీ కూడా చెడు శకునాలుగా పరిగణించాలి. కాని వారందరిని మీరు ఆరాధిస్థారు! అంటే, ఎవ్వరూ పిల్లలను కలిగి ఉండకూడదా? అది కాదు. ఒక బిడ్డ జన్మించినట్లయితే అది మంచిదే. ఆ పిల్లవాడి ఎదుగుదలకు అనుకూలమైన పర్యావరణాన్ని సృష్టించాలి. కానీ, ‘ స్త్రీకి ఒక బిడ్డ ఉంటే తప్ప ఆ మహిళ జీవితం సాకారం కాదాని’, సమాజంచే సృష్టించబడిన చాలా దురదృష్టకరమైన ఆలోచనకు లొంగవలసిన అవసరం లేదు.

నేడు, ఒక బిడ్డకు జన్మ ఇవ్వని మహిళ, ప్రపంచానికి ఎంతో మేలు చేస్తోంది. మన జనాభా 7.3 బిలియన్లు ఇంకా  మానవజాతిలో సగభాగం భయంకరమైన పరిస్థితులలో కొట్టుమిట్టాడుతోంది. మీరు 7.3 బిలియన్ల  ప్రజలకి మంచి పరిస్థితులను అందించడానికి ప్రయత్నిస్తే, గ్రహం అంతరించిపోతుంది. 2050 నాటికి, ఈ గ్రహం మీద 9.6 బిలియన్ మంది ప్రజలు ఉంటారని అంచనా. అంటే, మన ప్రపంచం మొత్తం ఇప్పుడు మనం ప్రస్తుతం అనుభవిస్తున్న వనరుల కన్నా  40% తక్కువ వనరుతో నివసించాలి.

వనరులు అంటే వజ్రాలు లేదా బంగారం కాదు, ఇది 40% తక్కువ ఆహారం, నీరు ఇంకా గాలి ! ప్రపంచ జనాభాలో 50 శాతం మందికి వారి శరీరంలో తగినంత పోషణ లేదు. మానవులుకు లభించవలసినవేవి వారికి లభించడం లేదు. మీరు దాన్ని ఇంకా 40% తగ్గిస్తే, మానవుని జీవితం ఏమౌతుందో ఊహించవచ్చు. మీరు ఎంత గొప్ప వారు అయినా, మీ దగ్గర చాలా వనరులు ఉన్నా కూడా, మనం జనాభాను తగ్గించకపోతే చాలా కష్టం అవుతుంది. ఆ పరిస్థితి ఉన్నప్పుడు, పిల్లలకు జన్మ ఇవ్వని మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉండడం ఈ  గ్రహానికి  ఒక దీవెన అవుతుంది. మరింత మంది మహిళలు ఇలా ఎంపిక చేసుకోవాలని నేను కోరుకుంటాను.

ప్రేమాశీస్సులతో,
సద్గురు