శంకర్ మహదేవన్: ప్రణామాలు సద్గురు. మేము ముగ్గురం శంకర్-ఎహసాన్-లాయ్ పేరుతో గత ఇరవై మూడేళ్ళుగా సంగీత దర్శకత్వం చేస్తున్నాం.. నాకెప్పుడూ  ఆశ్చర్యం కలిగించేది ఈ మూడు అనే సంగతి. ఈ మూడు సంఖ్య ఎన్నో అంశాలతో ముడిపడి ఉండడం గమనిస్తున్నాను. న్యూట్రాన్, ప్రోటాన్ ఎలక్ట్రాన్, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అలాగే సంగీతం చేస్తున్న మేము కూడా ముగ్గురం. ఈ మూడు సంఖ్య ఔచిత్యం, ప్రాముఖ్యత ఇంకా ప్రభావం  ఏంటి? 

సద్గురు: త్రిమూర్తులైన శంకర్, ఎహసాన్, లాయ్ లకు నమస్కారం. ఔను త్రిమూర్తులు, త్రినేత్రాలు, త్రిశూలం, త్రికాలాలు, ఇవన్నీ జీవితం పట్ల ఒక ప్రాధమికమైన అనుభవం నుండి పుట్టినవే. మనిషి యొక్క అనుభవాలన్నీ ఈ మూడు అంశాల పైనే ఆధారపడుంటాయి.  

ఈ గతం, భవిష్యత్తూ కూడా వర్తమానంలోనే ఉంటాయి ఎందుకంటే, ఇప్పుడే మీకు జ్ఞ్యాపకం ఉంటుంది, ఇప్పుడే మీరు ఊహించగలిగేది.

మన గత జ్ఞాపకాలని మనం భూతకాలమంటాం, మన ఇప్పటి అనుభవాన్ని వర్తమానమంటాం, మన ఊహలు, కోరికలూ భవిష్యత్తు కాబట్టీ దాన్ని భావిష్యత్తంటాం. మనిషి యొక్క జీవితానుభవం జరిగేది ఈ జ్ఞాపకం, అనుభవం, ఊహల మధ్యనే. వీటి ప్రాతిపదికన, ఈ మూడింటి అనుభవాల నుంచి పుట్టిన ఎన్నో అంశాలు, మన సంస్కృతిలో మూడు అనే సంఖ్యగా క్రోడీకరించబడ్డాయి, త్రినేత్రాలు,త్రికాలాలు, త్రిశూలం, ఇంకా మీ ముగ్గురూ, త్రిమూర్తులూ. 

ఇక్కడ అర్ధం చేసుకోవలసింది ఏమిటంటే, ఈ మూడు పార్శ్వాలూ వర్తమానంలోనే ఉంటాయి. ఈ గతం, భవిష్యత్తూ కూడా వర్తమానంలోనే ఉంటాయి ఎందుకంటే, ఇప్పుడే మీకు జ్ఞ్యాపకం ఉంటుంది, ఇప్పుడే మీరు ఊహించగలిగేది. 

“ఈ క్షణంలో ఉండండి” అని ప్రజలు ఎందుకంటున్నారంటే, వాళ్ళ జీవితం బాధాకరంగా లేదు, వాళ్ళు జ్ఞాపకాలు, ఊహల వల్ల బాధపడుతున్నారు, నిజానికి ఈ రెండూ మనిషికున్న అధ్భుతమైన మనోసామర్థ్యాలు.

ఈ విషయమై ప్రపంచంలో చాలా బోధనలు జరుగుతున్నాయ్. ముఖ్యంగా అమెరికాలో, ఇది భారతదేశాన్ని కూడా తాకింది ఈ మధ్య – అదే “ఈ క్షణంలో ఉండండి”. వీళ్ళు వర్తమాన ప్రేమికులు. కానీ నాకు అర్ధం కానిదేంటంటే,  అందరూ మీకెందుకు ఈ క్షణంలో ఉండమని చెబుతున్నారు? మీరు వేరే ఎక్కడా ఉండలేరు. మీరు ఇంకెక్కడ ఉండగలరు అసలు? మనం ఎలాగైనా వర్తమానంలోనే ఉంటాం.

వీళ్ళు చెప్పేదేమిటంటే గతాన్నీ, భవిష్యత్తునీ తల్చుకోవద్దంటున్నారు. ఈ రకమైన మస్తిష్కం రావటానికి, ఈ బుద్ధి ఇలా వికసించటానికీ, ఈ స్పష్టమైన జ్ఞాపకాలు రావటానికీ, అద్భుతమైన ఊహాశక్తి ఉండటానికీ, కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. కానీ ఇప్పుడు మీకెవరో వచ్చి అదంతా వదిలేసి ఒక వానపాములా బ్రతకమంటున్నారు. నాకు వానపాములంటే చిన్నచూపు లేదు, అవి పర్యావరణంతో స్నేహపూర్వకంగా ఉంటాయి. కానీ మన ఈ మేధస్సు, ఈ స్థాయికి రావటానికి కారణమైన ఈ పరిణామక్రమం, ఒక చిన్న తత్త్వానికి  బందీ అయిపోకూడదు.

“ఈ క్షణంలో ఉండండి” అని ప్రజలు ఎందుకంటున్నారంటే, వాళ్ళ జీవితం బాధాకరంగా లేదు, వాళ్ళు జ్ఞాపకాలు, ఊహల వల్ల బాధపడుతున్నారు, నిజానికి ఈ రెండూ మనిషికున్న అధ్భుతమైన మనోసామర్థ్యాలు. ప్రాధమికంగా మనుషుల దుఃఖానికి కారణం, “వాళ్ళు పదేళ్ళ క్రితం జరిగిన విషయం గురించి బాధపడగలరు”, “రేపు జరగబోయే విషయానికి ఇవాళే బాధ పడగలరు”.

వారు ఈ మనోసామర్థ్యాలను తిరిగి అప్పగించేద్దాం అని చూస్తున్నారు, ఎందుకంటే వారికి వారి ఆలోచనలు, మనోభావాలను ఎలా సంబాళించుకోవాలో తెలీదు. మీరు ఆనందంగా జ్ఞాపకాలను  గుర్తుంచుకోగలిగితే, ఎంతో అతిశయంతో, తన్మయత్వంతో ఊహించగలిగితే, వాటిని ఎందుకు వదులుకోవాలనుకుంటారు? విషయం ఏంటంటే, మీ జ్ఞాపకాలూ, ఊహలు అన్నీ ఒక నిర్బంధ అలవాట్లుగా మారి మీ జీవితాలని దుఃఖమయం చేస్తున్నాయి. అందుకే మనుషులు గతాన్ని మరచిపోవటం, భవిష్యత్తు ఆలోచించకుండా ఉండటం ఎలా అనే విషయాల గురుంచి మాట్లాడుతున్నారు. మానవ జీవితానికి ఇది సరైన మార్గం కాదు.

విషయం ఏంటంటే, మీ జ్ఞాపకాలూ, ఊహలు అన్నీ ఒక నిర్బంధ అలవాట్లుగా మారి మీ జీవితాలని దుఃఖమయం చేస్తున్నాయి. అందుకే మనుషులు గతాన్ని మరచిపోవటం, భవిష్యత్తు ఆలోచించకుండా ఉండటం ఎలా అనే విషయాల గురుంచి మాట్లాడుతున్నారు.

ఈ మూడు పార్శ్వాలూ ఉండటం చాలాముఖ్యం, త్రికాలాలు, త్రిశూలాలూ ఇంకా త్రినేత్రాలూ. జీవితాన్ని చూడటం, అనుభవించడం జరిగేది ఈ మూడు పార్శ్వాల ద్వారానే. మాకు చాలా సంతోషంగా ఉంది శంకర్, ఎహసాన్, లాయ్ అనే త్రిమూర్తులు ఉన్నారు, చక్కటి సంగీతం స్వరపరచండి!

సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి..UnplugWithSadhguru.org.

 

Youth and Truth Banner Image