మార్మిక జ్ఞానానికి గొప్పనిధి అయిన కైలాస పర్వతం గురించి సద్గురు మాట్లాడుతూ, శివుడి సన్నిధికి ఎదురుగా నిలబడడమంటే ఏమిటో వివరిస్తారు.


సద్గురు: ఈ రోజున, ఆధునిక భౌతిక శాస్త్రాలు 11 రకాల ప్రమాణాలు(డైమెన్షన్స్) ఉన్నాయని ఒప్పుకుంటున్నాయి. అవేమిటో వాళ్లింకా కనుక్కోలేకపోతున్నారు. అవి సమాంతర ప్రమాణాలని వారు అంటున్నారు. యోగిక వ్యవస్థల్లో 21 ప్రమాణాలు ఉన్నాయని మనం చెప్తూ వస్తున్నాం - సమాంతరంగా కాదు, అవి ఒకదానిలో మరొకటి ఒదిగి ఉన్నాయి. మానవులతో ఏమాత్రం పోల్చలేని ప్రాణులు ఎన్నో ఉన్నాయి. ఏ విషయంలోనూ అవి మానవుల్లా ఉండవు. మీరిక్కడ ఎలాగైతే ఉన్నారో, అవి ఇక్కడ అలాగే ఉన్నాయి, కానీ మీకు సంబంధించినంత వరకూ, అవి లేవు. వాటికి, మీ ఉనికి తెలియచ్చు లేదా తెలియకపోవచ్చు – ఆ విషయం అవి ఎటువంటివి, అనేదానిపై ఆధారపడి ఉంది. వాస్తవానికి దీన్నిలా చెప్పడం అంత సముచితం కాదు కానీ, ఇదిఎలా వివరించవచ్చు అంటే, 21 బ్రహ్మాండాలు, ఒకదానిలో ఒకటి ఉన్నట్టు. 21 సృష్టులు ఒకదానిలో ఒకటి ఒదిగి ఉన్నాయి, అవన్నీ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయి. మీరు భౌతికానికి అతీతంగా వెళ్ళ గల్లిగితే గానీ అసలు మరొకటి ఉందన్న ఎరుక మీకు కలగదు.

మాహాపురుషుల అవగాహన వెల్లివిరచినప్పుడు, వారు ఇతరులు సాధారణంగా తెలుసుకున్నదానికంటే జీవితాన్ని ఎంతో లోతుగా తెలుసుకున్నారు.

మాహాపురుషుల అవగాహన వెల్లివిరిసినప్పుడు, ఇతరులు సాధారణంగా తెలుసుకున్నదానికంటే జీవితాన్ని ఎంతో లోతుగా తెలుసుకుంటారు. కాని దాన్నివారు ఎవరితోనో పంచుకునే మార్గమే లేదు ఎందుకంటే అది సాధారణ మనుషుల అవగాహనా పరిధిలో లేని విషయం. వారు జ్ఞానాన్ని మరొకరికి ప్రసరించడానికి సరైన వారికోసం ఎప్పుడూ ఎదురు చూసేవాళ్ళు, కానీ వారు ఆ ప్రయత్నాల్లో ఎక్కువ సార్లు విజయం సాధించలేదు. తనను తాను మొత్తంగా ప్రసరింపచేసుకోడానికి ఎవరో ఒకరు దొరకడం ఏ గురువుకైనా చాలా చాలా అరుదు. చాలా మంది గురువులు తాము ఇవ్వాలనుకున్నదాన్ని ఇవ్వకుండానే వెళ్ళిపోతారు. నా జీవితంలో కూడా, నేను ఇవ్వాలనుకున్నదానిలో కేవలం 2% మాత్రమే ఇస్తున్నాను. నేను చనిపోయేలోపు దానిని మరో శాతం పెంచినా అదొక గొప్ప విజయమే. కాబట్టి ఎవరైనా దీన్నంతా ఎక్కడ వదిలేస్తారు? ఇది మరుగైపోవాలని ఎవరూ కోరుకోరు.

శివుడి సన్నిధి

సాధారణంగా, భారతదేశంలో చాలా మంది యోగులు, మార్మికులు ఎప్పుడూ పర్వత శిఖరాలను ఎందుకు ఎంచుకుంటారంటే, అక్కడికి తరచుగా ఎవరూ రారు, అవి సురక్షితమైన ప్రదేశాలు. వాళ్ళు తమ జ్ఞానాన్ని శక్తి రూపంలో భద్రపరుచుకోవడానికి రాళ్ళని ఎంచుకునేవారు. వేల సంవత్సరాలుగా, జీవన్ముక్తి పొందినవారంతా కైలాస పర్వతానికి ప్రయాణించి, తమ జ్ఞానాన్ని ఓ నిర్దిష్టమైన శక్తి రూపంలో భద్రపరిచేవారు. వాళ్ళు ఈ పర్వతాన్ని ఆధారంగా తీసుకుని దీనిని భద్రపరిచేవారు (సృష్టించారు). ఇందువల్లే, హిందువులు శివుడు ఇక్కడ నివసిస్తాడని అంటారు. మనం దీన్ని శివుడి నివాసం అంటున్నామంటే, దాని అర్థం ఆపైన ఎక్కడో శివుడు కూర్చున్నాడనో లేదా నాట్యం చేస్తున్నాడనో లేదా మంచులోనో, మరెక్కడో దాక్కున్నాడని అర్థం కాదు. యోగ సంస్కృతిలో శివుణ్ణి దైవంలా చూడం, అతన్ని ఆదియోగిలా, ఆది గురువులా చూస్తాం. శివుడు మొదలుకొని, అన్ని సంప్రదాయాల నుండి ఎందరో యోగులు, వారికి తెలిసిన ప్రతిదాన్నీ ఇక్కడ ఒక నిర్దిష్ట శక్తి రూపంలో భద్రపరిచారు.

వేల సంవత్సరాలుగా, జీవన్ముక్తి పొందినవారంతా కైలాస పర్వతానికి ప్రయాణించి, తమ జ్ఞానాన్ని ఓ నిర్దిష్టమైన శక్తి రూపంలో భద్రపరిచేవారు.

దక్షిణ భారత మార్మికత్వంలో, వారి సంప్రదాయానికి చెందిన అతి గొప్ప యోగి, అగస్త్య ముని, ఈ పర్వతపు దక్షిణ ముఖంలో నివసిస్తాడని ఎప్పుడూ చెబుతుంది. బౌద్ధులు తమ ముఖ్యులైన బుద్ధులలో ముగ్గురైన మంజుశ్రీ, అవలోకితేస్వర, వజ్రపాణి, ఈ పర్వతంలో నివసించినట్లుగా చెబుతారు. జైనులు తమ రిషభుడు ఈ పర్వతంలోనే నివసిస్తారని చెబుతారు. దీని అర్థం వారు అక్కడ వాస్తవంగా నివసిస్తున్నారని కాదు, తమ కృషినంతా వారు అక్కడ భద్రపరచారని అర్ధం. వారు దాన్ని మనుషులకు ఇవ్వలేకపోయారు – వివిధ రకాలైన సామాజిక పరిస్థితులు అలా చేయడానికి వారిని అనుమతించవు. దక్షిణ భారతానికి చెందిన 63 మంది నయన్మార్లు, వారిలో ఒక మహిళ కూడా ఉంది, వారిక్కడికి వచ్చారు, ఎందుకంటే వారి అవగాహనను వారి చుట్టూ పక్కల ఉన్న మనుషులకి అందించే అవకాశం వారికి ఎప్పుడూ దొరకలేదు, సామాజిక వాస్తవికత అందుకు అనుమతించలేదు. కాబట్టి, ఇదొక జ్ఞానభాండాగారం.

మహా గ్రంధాలయం

కైలాస పర్వతం మహా మార్మిక గ్రంధాలయం. గడిచిన వేల సంవత్సరాలుగా మనుషులు అక్కడికి తీర్థయాత్రకు వెళుతూ వస్తున్నారు. సాధారణంగా గత 10 నుండీ 12 వేల సంవత్సరాలనుంచి అంటారు, కానీ చాలా మంది అంతకు ముందు నుంచే అక్కడికి వెళుతూ వస్తున్నారని అంటారు.

మీరు కైలాస పర్వతానికి వెళ్తున్నట్లయితే, మీరొక మాహా గ్రంధాలయానికి వెళుతున్న నిరక్షరాస్యుడిలాంటి వారు. మీరొక నిరక్షరాస్యుడని, మీరు ఒక మహా-గ్రంధాలయంలోకి నడిచారని అనుకుందాం. ప్రతి ఒక్కరూ అక్కడ కూర్చొని పుస్తకాలన్నీ చదువుతున్నారు. మీకు వాటిలో ఒక పదం కూడా తెలియదు, కానీ మీరు విస్మయానికి లోనవుతారు. మీరు దాన్ని చదవాలంటే, మీరు అ, ఆ ల నుండీ మొదలుపెట్టాలి. మీతోనే మొదలుపెట్టి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి మీరు మౌలికాంశాలు నేర్చుకోవాలి. మీరు ఈ చిన్నపాటి జీవితపు ముక్కని అర్థం చేసుకోకపొతే, ఈ బ్రహ్మాండం యొక్క 21 ప్రమాణాలను అర్థం చేసుకోవడమనే ప్రశ్నే తలెత్తదు. కాబట్టి, మీకిప్పుడు, దార్శనికత కావాలి, లేదంటే మిమ్మల్ని మేము విద్యావంతులని చేయలేం. మీరు చూడగలిగితేనే, నేను మీకు అక్షరాలను నేర్పగలను.

మీరు అక్షరాలు నేర్చుకుంటే, అప్పుడు మీరు వాక్యాన్ని చదవాలనుకుంటారు. మీరు వాక్యం చదివినప్పుడు, పుస్తకం చదవాలనుకుంటారు. మీరు పుస్తకం చదివినప్పుడు, ప్రతి ఒక్కటీ తెలుసుకోవాలనుకుంటారు. మీకు ఆ అభిరుచి లేకపోతే, మీరు కనీసం ఆ దిశవైపు చూడను కూడా చూడరు. మొత్తం సమాజమంతా నిరక్షరాస్యమయమైందని అనుకుందాం, అప్పుడు వాళ్లకు ఏదీ చదవాలన్న ఆలోచన కూడా రాదు. ఉన్నట్టుండి ఒక మనిషి చదవడం నేర్చుకుంటే, వాళ్ళు అతన్ని చూసి “వామ్మో” అని అంటారు! ఎంతటి పురోగతి, కేవలం అతనొక్కడు చదవడం వల్లే.

మా చిన్నతనంలో పల్లెల్లో ఇలానే ఉండేది – కేవలం ఒకరిద్దరు మాత్రమే చదవగలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఉదాహరణకి, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తా ఉన్నారు; ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమ. ఆ భర్త నెలరోజులపాటు ఎక్కడకో ప్రయాణంచేయాల్సి వచ్చింది, సెల్ఫోన్ లేదు, ఏమీ లేదు – విషయాలు తెలిసేదెలా? కాబట్టి, ఆ భర్త వెళ్ళిపోయినప్పుడు, చదవడం రాయడం వచ్చిన వ్యక్తి భార్య తరపున ఉత్తరాలు రాసేవాడు. ఆమె చెప్పాల్సినదంతా చెప్పేది, అతను చెప్పినవన్నీ రాసి, ప్రతీ మూడు రోజుల కొకసారి పోస్టు చేసేవాడు. ఆ భర్త కూడా ఈ భార్యకు ఉత్తరాలు రాసేవాడు.

అలాంటి ఒక ఉత్తరం వచ్చినప్పుడు, ఆ పల్లెటూరులో చదవడం వచ్చిన వ్యక్తి ఒకే ఒక్కడు ఉండేవాడు, ఆ వ్యక్తితో మీ అంతరంగిక సమాచారాన్నంతా పంచుకోవాల్సి వచ్చేది. అతను ఇంటికి వచ్చి ఆ ప్రేమలేఖను ఈమెకు చదివిపెట్టేవాడు. ఇది జరగడం నేను చూసాను; అది చూడడానికి చాలా అందంగానూ, హృద్యంగానూ ఉండేది. అతను ఆ ఉత్తరం తెరిచి చదివేటప్పుడు మీరక్కడ ఉన్నవారు అతన్ని ఎలా చూసేవారో చూడాలి – అతను వారికి భగవంతుడిలాంటివాడు ఎందుకంటే అతను వారికి ఆ ఉత్తరం చదివి అందులో ఏముందో చెప్తాడు కనుక.

ఇది కూడా అలాంటిదే, కానీ మరో స్థాయిలో. మీరు నిజంగా ఈ వివిధ ప్రమాణాల్ని అర్థం చేసుకొని తెలుసుకోవాలంటే, మీరు కొంత సమయం, జీవితం, దీనికోసం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కానీ మీరు కేవలం శక్తిని మాత్రమే అనుభూతి చెందాలనుకుంటే, మీరు కొన్ని ప్రదేశాలకు వచ్చి, అక్కడ ఉండి, ఆ శక్తిని అనుభూతి చెంది, ఆనందించి, ఏదో కొంచెం తీసుకొని వెళ్ళిపోతారు. ఆ కృప మనకు అందుబాటులోనే ఉంది, కానీ దాని జ్ఞానం కావాలంటే దానికోసం శ్రమించాల్సి ఉంటుంది.

జీవితకాల ప్రయాణం

ప్రపంచంలో నేను ఎన్నో నిజమైన పవిత్ర ప్రదేశాలకు వెళ్లాను. అవి ప్రార్థనా స్థలాలు, ప్రదేశాలు, ఇంకా ప్రపంచంలో మరేవైనా కావచ్చు, నేను ఎన్నో శక్తివంతమైన ప్రదేశాలకు వెళ్లాను, ఎంతోమంది శక్తివంతమైన వారిని కలిసాను – వారికి శిరస్సువంచి నేను నమస్కరించినప్పుడు, నేను మన: పూర్వకంగానే నమస్కరిస్తాను, కానీ వారికెప్పుడూ నా శిరస్సును నా గురువుకి వంచినంతగా వంచను. అది కేదార్నాథ్ లేదా గౌతమ బుద్ధుడు లేదా నా ముందుకు వచ్చినవారికి ఎవరికైనా సరే, నేను మన:స్పూర్తిగా నమస్కరిస్తాను, కానీ నా గురువుకు వంచినంతగా వంచను. కానీ, నేను కైలాస పర్వతానికి నమస్కరించినప్పుడు, నేను నా గురువుకి నమస్కరించినట్టుగానే నమస్కరిస్తాను. ఈ విధంగా నా మొత్తం జీవితంలో దేనికి లేదా ఎవరికీ ఇలా చేయలేదు, కొంత తక్కువగానే చేసేవాణ్ణి. కానీ కైలాస్ విషయంలో మాత్రం, నేను శిరసు వంచి నమస్కరిస్తే, నా గురువుకి చేసినట్లుగానే పూర్తిగా నమస్కరించాను.

అంతర్గత ప్రమాణాల విషయానికొస్తే, మీరు తెలుసుకోవాల్సినదంతా కైలాస పర్వతంలో ఉంది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలిస్తే, మీ సృష్టి గురించి మీరు తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కటీ, మీ తయారీ గురించి, మీ ఉనికి గురించి, మీ ముక్తి గురించి, అన్ని అక్కడే ఉన్నాయి. దాని ప్రతీ రూపం, ప్రతీ సాంప్రదాయం ఈ జ్ఞానాన్ని ఇక్కడ నిక్షిప్తపరిచింది అలాగే అది అందుబాటులోనూ ఉంది. మన అవగాహనా స్థాయిని మనం చాలినంత స్పష్టతకు తీసుకెళ్లగలిగితే, అది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి, కైలాస పర్వతం అనేది మేము అర్థం చేసుకోగలది, అది ఎలా రూపుదిద్దుకున్నదో, అలాటి విషయాల గురించి అంతా తెలుసుకోగలం. కాని మానససరోవరం ఈ భూమికి చెందనిదిగా ఉంటుంది, మరోదానిలా ఉంటుంది.

ఒక తీర్థయాత్ర అవసరమైన (అంతర్గత) స్థితిలో నేను లేను, అయినా కైలాస మానస సరోవర యాత్ర మాత్రం అనుభవపరంగా నాకెంతో అద్భుతమైనది.

ఒక తీర్థయాత్ర అవసరమైన (అంతర్గత) స్థితిలో నేను లేను, అయినా కైలాస మానస సరోవర యాత్ర మాత్రం అనుభవపరంగా నాకెంతో అద్భుతమైనది. నేను ఇదిలా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు, ఎందుకంటే ఏది ఆశ్చర్యపరచలేనట్టుగా నేను తయారుచేయబడ్డాను. నేను ఎంతో చూసాను. ఏదీ ఆశ్చర్యపరచనంతగా నేను నా జీవితాన్ని అనుభావించాను, నేనున్నది అలాగే. నేనేమి చూస్తానన్నది అసలు ముఖ్యం కాదు, ఎందుకంటే, వింతల్లో వింతైనదాన్ని, విచిత్రాల్లో విచిత్రమైనదాన్ని నేను నా జీవితంలో చూసాను. మీరు నమ్మలేని విషయాలు నాకు రోజువారి వాస్తవాలు. మనుషులకు కాల్పనిక కథల్లాంటి విషయాలు నాకు ఎప్పుడూ సజీవమైనవి, కానీ మానస సరోవరం నేనింతవరకూ చూసినవాటినన్నిటిని మించిపోయింది.

ఇది నమ్మకానికి చెందిన ప్రశ్న కాదు, విశ్వాసానికి చెందిన ప్రశ్న కాదు, మతానికి చెందినది కూడా కాదు. మీరు మాములుగా నివసించే చోటుకంటే అది ఖచ్చితంగా ఉన్నతమైన ప్రదేశం.

పేమాశీస్సులతో,
సద్గురు

“ఈషా సేక్రెడ్ వాక్స్” ప్రతీ సంవత్సరం కైలాస మానససరోవరానికి ప్రయాణిస్తుంది.  మరింత సమాచారం కోసం:Isha Sacred Walks చూడండి.

కైలాస తీర్థం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది, ఈశా షాప్పి ద్వారా కొనుగోలుచేసుకోవచ్చు: కైలాస తీర్థం