కనబడీ కనబడని పరం
ధ్యానలింగ ప్రతిష్టించడానికి మూడేళ్లకు పైగా తీవ్ర కృషి చేయవలసి వచ్చింది. ఈ ప్రతిష్ట జరగడానికి కావలసిన వాతావరణాన్ని సృష్టించడానికి, కావలసిన మూల ప్రక్రియ గురించి సద్గురు మాట్లాడుతున్నారు.
సద్గురు: మతానికి, నమ్మకానికి, సిద్ధాంతాలకీ, గ్రంధాలకీ అతీతమైన శక్తి, ధ్యానలింగాన్ని చేయటానికి, ఎంతో అద్భుతమైన వారు, పూర్తిగా తమను తాము అర్పించకున్న వారు, ఉన్నారు. వారు తమ గురించి మరోసారి ఆలోచించని వారు. మరి అలాంటి వారికి నేనేమి ఇవ్వగలను? వారికి కృతజ్ఞతలు చెప్పడానికి నా దగ్గర ఆ తీయ, తీయని మాటలు లేవు. అన్ని విధాలుగా వారిని నేను నాలో భాగంగా చేసుకున్నాను, అంతకన్నా గొప్పది నా దగ్గర ఏమీ లేదు. వారే కాక, మేము ఎన్నో ఇతర శక్తులను ఉపయోగించుకున్నాము. ఆ శక్తులకు మనతో ఏ పని లేదు. ప్రకాశవంతమైన వారు, వికారమైన వారు అన్ని రకాల వారు ఉన్నారు. వారందరికీ నా కృతజ్ఞతలు తెలియపరచాలనుకుంటున్నాను. ఎందువల్లనంటే వారు మన జీవితాలను అంత ప్రభావవంతంగా, సానుకూలంగా చేస్తున్నారు.
నేను వారిని కిడ్నాప్ చేశాను ఎన్నో రకాల జీవులను, భూతాలను, యోగులను, అశరీరులను, దేవుళ్ళను, దేవతలను నేను వశపరచుకున్నాను.
ప్రపంచంలో సామాన్య మానవ స్మృతికి, మానవ సామర్థ్యాలకు అందని అనేక శక్తులు ఉన్నాయి. వాటితో మనం సున్నితంగా వ్యవహరించాలి. అటువంటి వారిని ఆహ్వానించడానికి, వారి నుంచి ఆశీస్సులు అందుకోవటానికి ప్రజలు నెలలకొద్దీ –హోమాలు చేస్తుంటారు, బలులు ఇస్తుంటారు - ఏవేవో కర్మలు చేస్తుంటారు. నేను వారిని కిడ్నాప్ చేశాను ఎన్నో రకాల జీవులను, భూతాలను, యోగులను, అశరీరులను, దేవుళ్ళను, దేవతలను నేను వశపరచుకున్నాను. నేను కూర్చుని వారికై ప్రార్థించ లేదు. నేను అంతా బలవంతంగా చేశాను. నేను వారిని కిడ్నాప్ చేసినప్పుడు, అది ఏ పరిహారం చెల్లించకుండా జరగలేదు. వారు తమ చెత్తను వదలించుకోకుండా, బలవంతాన రాలేదు.
అలాంటి నా శక్తులను నేను అలా వాడినట్టయితే అది నా శరీరాన్ని పాడు చేస్తుంది. అప్పుడు నాకు శరీరము ఒక పెద్ద విషయం ఏమీ కాదుగాని. నేను కేవలం ధ్యానలింగం ప్రతిష్టకు కావలసినవి చేస్తూనే వచ్చాను, కానీ ఆ పనులు, నాకు చాలా హాని కరమైనవి. నా జీవితానికి అది ఎలాగూ ఆఖరి దశ కాబట్టి, నన్ను పట్టుకొని చిత్రహింస చేయటానికి వారికి అవకాశం దొరకలేదు. ఈ శక్తుల కలయిక వల్లనే ప్రతిష్ట సాధ్యమైంది. ఆయన (తమ గురువుగారిని ఉద్దేశించి) నువ్వు చేస్తావా, చేయవా అని అడగలేదు. నేను ఎలాగో చేస్తానని ఆయన అనుకున్నాడు. గురువుగారి, ఈ ఆశయాన్ని నెరవేర్చుటం అన్నది, అన్ని రకాల విధి విధానాలు, క్షేమం, మంచి చెడులకు, అతీతమైనది. నేను ఆయనకిచ్చిన మాట, నా జీవితానికి ఇచ్చిన మాట కన్నా, ఎంతో పెద్దది. కాబట్టి, నేను అన్నింటినీ పక్కన పెట్టాను.
నేను కేవలం ధ్యానలింగం ప్రతిష్టకు కావలసినవి చేస్తూనే వచ్చాను, కానీ అవి నాకు చాలా హాని కరమైనవి.
రాబోయే గ్రంథాలు నా గురించి ఏమంటాయో? మరి మిగతా ప్రాణులన్నీ- దేవతలు అనే వారు అందరూ – నాపట్ల ఎంతో ఆనందంగా ఉన్నారు. భారతదేశంలో, అంటే సంస్కృతంలో, మేము దేవుడు అంటే, మేము ఏదో ఒక గొప్ప మనిషి గురించి మాట్లాడటం లేదు. దేవా అనే మాటకు భాషాపరమైన అర్థం, ప్రకాశమైనవాడు, ప్రకాశించేవారు అక్కడ చాలా మంది ఉన్నారు, వారి జనాభా కూడా పెరుగుతూనే ఉన్నది. ‘వారి ఆశీస్సులు మానవాళిని గట్టెక్కిస్తాయి లేక వారి అసంతుష్టి మానవ జాతిని అంతం చేస్తుంది’ అని శివుడే అన్నాడు. అందువల్ల అన్నిటికంటే ముఖ్యమైనది ఈ దేవతలు ఆనందంగా ఉన్నారా లేదా అన్నదే. వారు నాపట్ల ఆనందంగా ఉండటం, చూశాను.