రాతి ఫలకాలు
ధ్యానలింగం లోపలి పరిక్రమ ప్రక్క గోడలకు, ఎంతో బాగా చెక్కబడిన ఆరు రాతి ఫలకాలు కనబడతాయి. అవి జ్ఞానోదయం పొందిన ఆరుగురు దక్షిణ భారత ఋషుల కథలను చూపుతాయి. ప్రతి ఫలకం వారి అద్భుత జీవితంలోని ఒక సందర్భాన్ని చూపుతాయి.
ధ్యానలింగం లోపలి పరిక్రమ ప్రక్క గోడలకు, ఎంతో బాగా చెక్కబడిన ఆరు రాతి ఫలకాలు కనబడతాయి. అవి జ్ఞానోదయం పొందిన ఆరుగురు దక్షిణ భారత ఋషుల కథలను చూపుతాయి. ప్రతి ఫలకం వారి అద్భుత జీవితంలోని ఒక సందర్భాన్ని చూపుతాయి. అక్కమహాదేవి ఫలకం, రాజు కోరిన విధంగా తన వంటి మీద ఉన్న అన్నింటిని ఆఖరుకు వస్త్రాలను కూడా వదిలేసి, ఒక రకమైన దేహరహిత స్థితిలోకి వెళ్ళటాన్ని చూపించే, పూర్తిగా మనసు కదలించివేసే సంఘటన చూపుతుంది. రెండో ఫలకం పసి మనస్తత్వంతో, కన్నప్ప నయనార్ తన కళ్ళని శివునికి అర్పణ చేయటం చూపుతుంది. మూడవ ఫలకంలో శివుని భక్తుడైన మైపురల్ నాయనార్, శివుని ప్రతీకను, తన జీవితం కన్నా ముఖ్యంగా భావించే హృదయ విదారకమైన సన్నివేశం కనబడుతుంది. నాలుగవ పలక మీద నిర్మాణకాయుడైన సదాశివ బ్రహ్మేంద్రులవారు తన తెగిన చేతిని కూడా పట్టించుకోకుండా నడిచిపోవడం కనిపిస్తుంది. ఐదవ ఫలకం పూసలార్ తన అంతరంగంలోని గుడికి గుర్తింపు రావటం అనే అద్భుత ఘట్టం. ఆరవ ఫలకం సద్గురు తన మూడు జన్మలకు ముందు, ఈశా పుట్టుకకు మూలమైన సన్నివేశంలో, దివ్య గురువు తన కారుణ్యాన్ని, అతీగతీ లేని సాధకునకు ప్రాప్తింప చేయటం కనబడుతుంది.