బీట్-రూట్ సలాడ్
బీట్-రూట్‌ను ముందర కడిగి తురమాలి. తురిమినది పల్చని బట్టలో వేసి పిండి రసం తీయాలి.
బీట్-రూట్ నిమ్మకాయ సలాడ్
కావాల్సిన పదార్ధాలు
బీట్-రూట్ - 1 (మీడియం సైజ్)
మిరియాలపొడి – ¼ టీస్పూన్
ఉప్పు – కావలసినంత
నిమ్మకాయ – ½ ముక్క
కొబ్బరికోరు – 1 టీస్పూన్
మామిడికాయ తురిమినది – 2 టీస్పూన్
శనగపప్పు – ¼ టీస్పూన్
ఆవాలు – ¼ టీస్పూన్
మినపప్పు – ¼ టీస్పూన్
కొత్తిమీర, కరివేపాకు – తగినంత
వేరుశనగపప్పు (నానపెట్టినది లేక వేయించినది) – 2 టీస్పూన్స్
చేసే విధానం:
బీట్-రూట్‌ను ముందర కడిగి తురమాలి. తురిమినది పల్చని బట్టలో వేసి పిండి రసం తీయాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనె పోసి ఆవాలు, మినపప్పు,శనగపప్పు వేసి వేయించాలి. తురిమిన బీట్-రూట్ అందులో వెయ్యాలి.
మిరియాల పొడి, ఉప్పు వెయ్యాలి. నిమ్మకాయ పిండాలి. మామిడి తురుము వేరుశనగపప్పు, కొత్తిమీర, కొబ్బరి తురుము వేసి, చివరగా బీట్- రూట్ ని పిండిన రసం పోయాలి.
కొలతలు
1 టీస్పూన్ – 5 మి.లీ.
1 టేబుల్ స్పూన్ – 15 మి.లీ.