Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
మీరు ప్రతి ఒక్కరినీ ఇంకా ప్రతిదాన్నీ ప్రేమగా చూడగలిగితే, మిమ్మల్ని పరమోత్కృష్ట సంభావ్యతకు తీసుకువెళ్ళటం సులభం అవుతుంది.
మట్టి అనేది ఒక అంగడి సరుకూ కాదు, అపరిమితమైన వనరూ కాదు. మనం దాన్ని నాశనం చేస్తే, ఈ భూమ్మీద జీవం అంతరించిపోతుంది. మట్టిని రక్షించు.
ప్రాథమికంగా, ఇన్నర్ ఇంజినీరింగ్ అంటే మనశ్శరీరాల ఈ సంక్లిష్టమైన యంత్రాన్ని, మీకు వ్యతిరేకంగా కాకుండా, మీకోసం పనిచేసేలా ఇంజినీరింగ్ చేసుకోవడమే.
యోగా అంటే ఐక్యం. దాన్ని మీరు క్రమశిక్షణతో చేరుకుంటారా లేక పరుత్యాగంతో చేరుకుంటారా అన్నది మీ ఇష్టం.
చికాకు, కోపం, ద్వేషం, ఇంకా ఆవేశం అనేవి ఒకదానికి ఒకటి వరుస పర్యవసానాలు. మీకు ఏమాత్రం చికాకుగా అనిపించినా, మీరు అక్కడికక్కడే దానిపై కృషి చేయాలి.
నన్ను సంతోషపెట్టే, బాధపెట్టే, విచారానికి గురిచేసే లేదా నాకు కోపం తెప్పించే హక్కు నేనెవరికీ ఇవ్వలేదు. ఇదొక్కటి మీరు చేయాలి: మీరు ఎలా ఉండాలనేది మీచేతే నిర్ణయించబడాలి.
అంతర్గత స్వభావం విషయానికి వస్తే, మీరు మీ చైతన్యాన్ని దేనిమీదైనా కేంద్రీకరిస్తే, మీరు దానిని చేరుకోకుండా చేయగల శక్తి విశ్వంలో ఏదీలేదు.
ప్రతిరోజు కాకపోయినా, కనీసం నెలకి ఒకసారి, పద్దు చూసుకోండి - మీరు మెరుగైన మనిషిగా పరిణితి చెందుతున్నారా లేదా అని.
మీరు మీ మనసు, శరీరం ఇంకా మనోభావాలను వికసింప జేస్తే, మీ జీవితం ఎంతో అందంగా ఉంటుంది. అదే మీరు మీ శక్తులను వికసింప జేస్తే, అది అత్యద్భుతంగా మారుతుంది.
అపజయాల నుంచి నేర్చుకోవడమే కాదు; అపజయం పాలుకాకుండా ఉండటం ఎలాగో నేర్చుకోండి. మీరు ఆకాంక్షించేది ఏదైనా సరే, దాన్ని సాధించే పద్ధతి కనిపెట్టండి. జీవితం మీ కర్మ - అది మీరు చేసుకున్నదే.
కార్యకలాపాలలోనూ, అభివ్యక్తీకరణలోనూ ఒక్కో వ్యక్తి ఒక్కోలా ఉండొచ్చు. కానీ ప్రాథమిక జీవం విషయానికి వస్తే, ప్రతి మనిషి ఒకటే.
యవ్వనంగా ఉండడం అంటే - మిమ్మల్ని పరిమితం చేసుకోలేదని - జీవితానికి సుముఖంగా ఉన్నారని. పరిణామం చెందటానికి, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, జీవితానికి నిరంతరం సుముఖంగా ఉన్నారని.