వయస్సు లేనిది!
వయస్సు, వయోరహితాలలో
వయస్సు దేహా సంబంధితమైతే
వయోరహితం ఆత్మ సంబంధితం!
జీవన వలయంలో చిక్కుకున్నవారు
నిత్య యవ్వనాన్ని కోరుకుంటారు.
వయసు మీరడాన్ని ఒకరు ఆపాలనుకుంటే,
అది బాల్య దశలోని అవివేకం వల్లనా,
లేక కౌమారంలోని నిర్బందతల వల్లనా,
లేక నడి వయస్సులోని పరిపక్వత వల్లనా?
అయితే, వృద్ధులకే సొంతమైన పరిపూర్ణమైన వివేకానికీ,
బాల్య దశపు సున్నితత్వానికీ , కౌమార దశపు తాజాదనానికీ,
నడి వయస్సులోని సమతుల్య దృక్పధానికీ ఎవరూ విలువనివ్వరా?
కేవలం శరీరపు మాధుర్యానికో, మృదువైన చర్మానికో
సంబంధించినది కాకుండా, వీటన్నిటినీ మించిన ఆధ్యాత్మిక
బీజానికి సంబంధించిన ఆత్మ వికాసానికి ఎవరూ విలునివ్వరా?
అన్నిటికీ దేశకాలానుసారంగా ప్రాముఖ్యత ఉన్నప్పటికీ,
జీవ వికాసంలోనే దాగి ఉంది జీవితపు అందం!
ప్రేమాశీస్సులతో,
సద్గురు