సద్గురు: జీవిత సహచర్యం అనేది , ఒక వ్యక్తిగా మీకు అవసరమా లేక అది కాలంతో సమసిపోయే అభిరుచా అన్నది మీరే చూసుకోవాలి. ఇరవై అయిదు నుండి ముప్ఫయి శాతం ప్రజలకు వివాహ దిశగా పోయే అవసరంకూడా లేదని నేను అంటాను, ఎందుకంటే వారికీ అది కాలంతో పాటు దాటిపోయే అభిరుచి. ఇంకొక ముప్ఫయి -నలభయి శాతానికి ఈ స్థితి కొంత ఎక్కువ కాలము ఉండి, వారు ఆ బంధంలో పడతారు. ఒక 10 -12 సంవత్సరాలు వారికి బాగానే అనిపిస్తుంది. ఆ తర్వాత అది ఒక భారంగా అనిపిస్తుంది. కానీ కొంతమందికి ఈ అవసరాలు బలీయంగా ఉంటాయి. షుమారు 25 నుంచి -30 శాతం మంది ప్రజలకు ఈ సహచర్య అవసరాలు చాలా కాలం ఉంటాయి. అటువంటివారు, తప్పకుండా ఈ ఏర్పాట్లలోకి రావాలి.

మీ అవసరాలను తీర్చుకోవడానికి (పెళ్ళి కాకుండా) సహజీవనం పరిష్కారం కాదు

ప్రస్తుతం, ప్రజలు ఇతర పరిష్కారాలను కనుగొన్నారు. ముఖ్యంగా, పాశ్చాత్య దేశాలలో. అదే పరిష్కారం భారత దేశంలోకూడా మొదలయింది. "సరే, నేను పెళ్లి చేసుకోను. నేను కేవలం సహా జీవనం చేస్తాను". కాబట్టి సహజీవనం; మీరు ఒకే మనిషితో జీవిస్తుంటే, వివాహ ధ్రువ పత్రం ఉన్నా లేక పోయినా అది వివాహమే. కానీ, ప్రతి వారాంతానికీ ఒక కొత్త భాగస్వామిని ఎంచుకోవచ్చని మీరనుకుంటే, మీకు మీరు తీవ్రమైన హాని చేసుకొంటున్నట్లే. కారణమేమంటే, మీ మనసుకి జ్ఞాపక శక్తి ఉన్నట్లే, మీ శరీరానికి కూడా అంతకంటే ఎంతో ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంది. మీ శరీరం, అనుభవాలని గ్రహించి, తనలో నిలుపుకొంటుంది. మీరు, హిమాలయాలకు వెళ్లి వస్తే, మీరు హిమాలయాల గురించి మర్చి పోవచ్చు, కానీ మీ శరీరం మరిచిపోదు. అది ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటుంది. మీకు మతి భ్రంశం వచ్చి, పూర్తిగా జ్ఞాపక శక్తి కోల్పోవచ్చు. కానీ భౌతిక శరీర, జ్ఞాపక శక్తి కొనసాగుతూనే ఉంటుంది .

భౌతిక సాన్నిహిత్యం అనేది, భారతీయ సంప్రదాయంలో ఋణానుబంధం అంటారు. `ఋణానుబంధం` అంటే, శరీరానికి ఉన్న భౌతిక స్మృతి. శరీరం అనేది, భౌతిక సాన్నిహిత్య విషయంలో ఒక గాఢమయిన స్మృతిని పెంపొందించుకుంటుంది. ఈ స్మృతులకారణంగా, అనేక విధాలయిన ప్రతిక్రియలు, స్పందనలు కలుగుతాయి. ఈ విధంగా మీరు అనేక జ్ఞాపకాలను ముద్ర వేసుకుంటే, మీ శరీరం గందరగోళ పడుతుంది. ఇలాంటి అనేకమయిన జ్ఞాపకాలు, ఒక స్థాయికి మించిన, గందర గోళానికి , బాధలకు దారి తీస్తాయి. ఇది మీరు స్పష్టంగా చూడవచ్చు. తమ జీవితంతోనూ, దేహంతోనూ విచ్చలవిడిగా ఉండే వ్యక్తులకి నిజమయిన ఆనందం అంటే ఏమిటో తెలియనే తెలియదు. మీరు చుట్టుపక్కల ఈ విషయాన్నిజాగ్రత్తగా గమనించండి. అటువంటి వారు మనస్ఫూర్తిగా నవ్వలేరు, ఏడవలేరు. వాళ్ళు ఇలా అవడానికి కారణం- ఒకే జీవిత కాలంలోనే భౌతిక శరీరంలో ఏర్పడ్డ అనేక జ్ఞాపకాలు, ఎన్నో చెరగని ముద్రలను వేస్తాయి. కాబట్టి, సహా జీవనమనేది మీ అవసరాలను, తీర్చడానికి ఉపకరించే సాధనం కాదు.

మీరు వివాహమయిన చేసుకోండి , లేదా సునాయాసంగా మీ అవసరాలనయినా అధిగమించండి. కానీ ఇది ఒక వ్యక్తిగా మీరు పరిశీలించాల్సిన విషయం - మీ అవసరం ఎంత బలీయమైనది. ఈ విషయాన్ని, సాంఘిక పరమైన ప్రభావం లేకుండా స్పష్టంగా గమనించాలంటే, కొంత సమయం తీసుకోవడం మంచిది. ఒక నెల అనుకోండి. మీరు ఈ నిర్ణయం తీసుకునేప్పుడు, పూర్తి స్పష్టతతో కూడిన స్థితిలో ఉండాలి. మీరు ఎవరి వలనా ప్రభావితులు కాకూడదు. మీ గురువుల వలన కానీ, సమాజం వల్ల కానీ, ఎవ్వరి వలనా ప్రభావితం కాకూడదు. ధ్యానంతో మిమ్మల్ని స్పష్టమైన స్థితిలోకి తెచ్చుకోండి. ఆ స్పష్టతలో, మీ అవసరాలు నిజానికి ఎంత బలమైనవో చూడండి.

వివాహం అవసరం లేదు అనిపిస్తే, అంతే, ఒకసారి నిర్ణయం తీసుకొన్నతర్వాత తిరిగి ఆ వైపు చూడవద్దు. ఒక దారిలో వెళదామని నిర్ణయిస్తే, తిరిగి ఇంకో దారి వైపు చూడద్దు. ఎదో ఒకటి మీరు తప్పక చేయాలి. మీరు మధ్యలో వెళ్ళాడుతుంటే, ఎప్పుడూ తత్తరపాటుతో ఉంటారు. "ఏది మంచిది?" ఆంటే, మంచిది అనేది ఏదీ లేదు. మీ జీవితాన్ని ఆలా జీవించండి- మీరు ఏమి చేస్తున్నారో, అది మాత్రమే చేస్తున్నారు. సంపూర్ణంగా, ఈ గుణం మీకుంటే, మీరేం చేస్తున్నా అది మంచిదే. కానీ నిరంతర చపలత్వంతో; పదిహేను సంవత్సరాలు వైవాహిక జీవితంలో ఉండి ఇప్పుడు "నేను బ్రహ్మచారిగా ఉండవలిసింది" అనుకుంటున్నారు. పదేళ్లు బ్రహ్మచర్య దీక్షలో ఉండి, ఇప్పుడు "నేను వివాహం చేసికొని ఉండవలసింది" అని ప్రజలు అనుకుంటున్నారు. ఇది పూర్తిగా జీవితాన్ని వ్యర్థం చేసుకోవడమే.

ప్రేమాశీస్సులతో,

సద్గురు