సద్గురు : ప్రధమంగా మనం "వివాహ మెందుకు " అనేది అర్థం చేసుకుందాం. ఒక మనిషి గా , స్త్రీ కి కానీ పురుషుడు కి కానీ కొన్ని అవసరాలు ఉంటాయి. మీకు ఎనిమిది సంవత్సరాల వయసప్పుడు, వివాహం గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్న మీకు అర్థం లేనిది . అవునా? మిమ్మల్ని అదే ప్రశ్న , పధ్నాలుగు ఏళ్ళ వయసులో అడిగితే మీరు కొద్దిగా సిగ్గు పడతారు, ఎందుకంటే దాని గురించి మీరు ఆలోచిస్తున్నారు. మీ శరీరం ఒక విధంగా పెరుగుతోంది అంతేకాక హార్మోన్లు మీ బుద్ధిని బాధిస్తున్నాయి, మీరు దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టారు (సోకుతున్నాయి). నేను అదే ప్రశ్న మీకు పద్దెనిమిది ఏళ్ల వయసు ఉన్నప్పుడు అడిగితే , ఖచ్చితమయిన "అవును", "లేదు, ఇప్పుడు కాదు ", లేదా " అసలు చేసుకోను" అన్న సమాధానాలు ఇస్తారు. ఈ సమాధానాలు మీకు పధ్నాలుగు నుండి పద్దెనిమిది సంవత్సరాల మధ్యలో ఏం జరిగింది అన్న దాని మీద ఆధార పడి ఉంటాయి.

కనుక , చిన్నతనంలో స్వేచ్ఛ ఉండాలనే అభిప్రాయం వల్ల, వివాహం అనే పదం, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ఎంతో వ్యతిరేకతని పొందింది. కొన్ని సమాజాలలో యువత వివాహాన్ని ఒక చెడ్డ విషయంగా అర్థం చేసుకొంటున్నారు. మీరు వయసులో ఉన్నప్పుడు, మీ దేహం ఒక తీరులో ఉండటంవలన, వివాహం పట్ల విముఖత ఉంటుంది. వివాహమనేది ఒక ఖైదు గాను, సంకెళ్ళలా ఉంటుంది . మీరు విషయాలను ఒక రీతిలో చేయాలనుకుంటారు. కానీ కాల క్రమేణా, దేహ దారుఢ్యము తగ్గుతున్న కొద్దీ, మీకు బద్ధమై ఉండే ఒక తోడుంటే బాగుండనిపిస్తుంది. అంతే కదా ? ఇది ఒక పిల్ల చేష్ట లాంటిది - నేను బలంగా ఉన్నప్పుడు నాకెవరి అవసరం లేదు, నేను బలహీనుడ్ని అయినపుడు , ఎవరయినా తోడు ఉంటె బాగుండును అనుకోవడం. నిజానికి, మీ శ్రేయస్సు అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడే ఒక భాగస్వామ్యం ఏర్పడాలి . మీరు , పతనావస్థ చేరిన తర్వాత భాగస్వామ్యాలు ఏర్పరాచుకున్నా, అవి పనికిరాని భాగస్వామ్యాలవుతాయి. మీరు బాగా ఉన్నప్పుడు, మీ జీవితం ఉత్కృష్ట స్థాయి లో ఉన్నప్పుడే మీరు భాగస్వామ్యాలు , ఏర్పరచుకోవాలి,,అవే మిమ్మల్ని జీవితపు ఒడు దుడుకుల ను తట్టుకోవడానికి సహకరిస్తాయి.

ఈ స్థితిలో ఇప్పుడు, అన్ని దశలు అయిపోయిన తర్వాత , వివాహం గురించి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం మంచిదే. నేను కాదు అడిగేది లేక మీ తల్లితండ్రులు కాదు . మీరే ఆ ప్రశ్న వేసుకొంటున్నారు, " నేను వివాహం చేసుకోవాలా " అని . ఒక మానవుడిగా మీకు , శారీరక, భావపూరిత, మానసిక అవసరాలే కాకుండా సాంఘిక, ఆర్ధిక అవసరాలు ఉంటాయి . ప్రజల వీటిని గురించి ఆలోచిందాము అనుకోరు ,వారి వివాహం అసహ్యకరంగా అవుతుందన్న కారణంగా ఆలోచించరు. ఏది ఏమయినప్పిటికి ఈ అవసరాలు, కారణాలు ఉన్న మాట వాస్తవం.

ఈనాటి స్త్రీల విషయంలో ప్రపంచం కొద్దిగా మారిందనే చెప్పాలి. సాంఘిక, ఆర్థిక కారణాల కోసం, ఆమె వివాహం చేసుకొనవసరం లేదు. ఆమెకు ఎన్నుకొనే అవకాశం ఉంది . ఆమె తన సాంఘిక , ఆర్థిక వ్యవహారాలను చక్క పెట్టుకోగలదు. ఒక వంద సంవత్సరాల క్రితం పరిస్థితులు ఇలా ఉండేవి కావు. కాబట్టి అది ఇప్పుడు, ఏంతో కొంత స్వేచ్ఛ. వివాహానికి కారణమయిన రెండు కారణాలు తొలగింపబడ్డాయి. ఇప్పుడు మీరు మిగతా మూడు విషయాల గురించి ఆలోచించాలి. జీవితంలో, మానసికంగా మీకు ఒక తోడు కావాలా ? మీ శారీరిక అవసరాలు ఎంత బలీయమైనవి? వీటిని మీరు వ్యక్తిగతంగా ఆలోచించాలి. ఇది ఒక సాంఘిక ఆదేశం కాదు- ప్రతి వారు వివాహం చేసుకోవాలి లేదా ఎవరూ చేసుకోకూడదు అని. ఇది ఆ విధంగా జరగదు . ఒక వ్యక్తిగా, మీ కోర్కెలు ఎంత బలమైనవి ? అవి మీరు అధిగమించి ముందుకు సాగ గలవేనా , కేవలం క్షణికమైన కోర్కెలా? ఆలా అయితే మీరు వివాహం చేసుకోవద్దని నేను చెప్తున్నాను. ఆలా బంధంలో చిక్కుకోవడం వలన ప్రయోజనం లేదు. ఆలా చిక్కుకుంటే కేవలం మీ ఇద్దరే కాకా, మీ కుటుంబం మొత్తం పర్యవసానాలు ఎదుర్కోవాలి. వివాహము తప్పు అని నేను చెప్పడం లేదు. మీకు అది కావాలా అన్నదే ప్రశ్న. ప్రతి వ్యక్తి తనకు తానుగా పరిశీలించుకోవాల్సిన విషయమిది. సాంఘిక ఆచారాలను పట్టి కాదు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు