సుభాషితాలు - విద్య ఎందుకు ముఖ్యం?

విద్యాభ్యాసం అంటే ఆర్థిక యంత్రానికి పనికొచ్చే కీలలను ఉత్పత్తి చేయడం కోసం మాత్రమే అనే భావనను మనం దాటి వెళ్ళాలి.

quotes-about-education-sadhguru-01

విద్య మనుగడ కోసం మాత్రమే కాకుండా అవగాహనను పెంపొందించే సాధనం కావాలి. పిల్లలు వికసించి గొప్పగా తయారవ్వాలి.

quotes-about-education-sadhguru-02

పిల్లలను కలుషితం కాని మేధస్సుతో ఎదగనివ్వడమే విద్య. సంస్కృతి, మతం, భావజాలం లేదా పక్షపాతంతో గుర్తించబడని , వాటిలో చిక్కుకోని తెలివితేటలు, సహజంగానే ఆ వ్యక్తి అత్యుత్తమ వికాసానికి దారి తీస్తాయి.

quotes-about-education-sadhguru-04

బోధన ఒక వృత్తి కాకూడదు - అది అభిరుచిగా ఉండాలి. అప్పుడే విద్యాభాసం, విషయాలను కేవలం వల్లించటం నుండి సత్యాన్వేషణ వైపు పయనిస్తుంది.

quotes-about-education-sadhguru-03

విద్య అంటే పిల్లలను మీరు కోరుకున్న విధంగా తీర్చిదిద్దడం కాదు, కాని అన్నిటినీ తెలుసుకోవాలనే వారి సహజమైన కుతూహలానికి మద్దతు ఇవ్వడం.

quotes-about-education-sadhguru-08

విద్య సాధికారతకు సంబంధించినది, ఒక మనిషి తన అత్యున్నత సామర్థ్య స్థాయికి చేరుకునేందుకు కృషి చేయడం గురించి - జీవి తన అపరిమితత్వాన్ని సఫలం చేసుకోవడానికి ఒక సాధనం.

quotes-about-education-sadhguru-05

విద్య అంటే పిల్లల మనస్సును సమాచారంతో నింపేయడం కాదు, సునిశిత అవగాహనా సామర్థ్యాన్ని కలిగించడం, జీవితం యొక్క లోతుపాతుల్ని పూర్తిగా తెలుసుకోగలిగేలా చేయడం.

quotes-about-education-sadhguru-07

విద్యార్ధుల కోసం విద్యాభ్యాసం గురించి కొన్ని సూక్తులు

మీరు పుట్టిన రోజు నుండి, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో వారికి పని చేయని దాని గురించి మీకు బోధించడానికి ప్రయత్నిస్తున్నారు.

quotes-about-education-sadhguru-10

అర్హత కాదు, సామర్థ్యమే తలుపు తెరుస్తుంది.

quotes-about-education-sadhguru-13

విద్యాభ్యాసం అంటే సర్టిఫికేట్ పొందడం కాదు. విద్యాభ్యాసం అంటే మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడం.

quotes-about-education-sadhguru-14

విద్య మీ పరిధులను విస్తరింప చేసుకోవడం గురించి కావాలి, జీవితం పట్ల విశాలమైన దృష్టిని కలిగి ఉండటం గురించి కావాలి. కాని సాధారణంగా, దీనికి విరుద్ధంగా జరుగుతోంది.

quotes-about-education-sadhguru-11

విద్యాభ్యాసపు దృష్టి సమాచారం పై కాకుండా జ్ఞాన దాహాన్ని కలిగించేదిగా ఉండాలి.

quotes-about-education-sadhguru-12

విద్యాభ్యాసానికి స్ఫూర్తి కావాలి, కేవలం సమాచారం కాదు. ప్రేరణ పొందిన మానవులు మాత్రమే వారి స్వంత జీవితాలను ఇంకా వారి చుట్టూ ఉన్న జీవితాలను మార్చగలరు.

quotes-about-education-sadhguru-09

ఆధునిక విద్య కేవలం సమాచారాన్ని ఇచ్చేదిగా ఉంది - ఎక్కడా ప్రేరణ లేదు. ప్రేరణ లేకుండా, ఏ మానవుడు తాను జీవించే పరిమితులను దాటి ఎదగలేడు.

quotes-about-education-sadhguru-06

విద్యా రంగంలోని ప్రముఖులు తమ జ్ఞానాన్ని పంచుతున్నారు

సద్గురుతో సంభాషణలో సర్ కెన్ రాబిన్సన్

“పిల్లలు దేనిలో రాణిస్తున్నారో మీరు కనుగొంటే, సద్గురు సూచించినట్లు మీరు చేస్తే, ఆధ్యాత్మిక వికాసానికి, భౌతిక వికాసానికి దోహదపడేది, మానవ జీవితం ఒకే క్రమంలో లేదని, అది సేంద్రీయమైనది, విభిన్న మార్గాలను అనుసరిస్తుంది అని గుర్తించగలిగే సంపూర్ణమైన వాతావరణాన్ని మీరు సృష్టిస్తే - అప్పుడు పూర్తిగా అసాధారణమైన తరహా పరిస్థితులు ఏర్పడతాయి- అందులో వ్యక్తులు సంపూర్ణ వికాసం పొందగలరు."

యునెస్కోలో సద్గురుతో సంభాషణలో ప్రొఫెసర్ గ్రెగోయిర్ బోర్స్ట్

"ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, మనం ఇప్పటి నుండి ముప్ఫై సంవత్సరాల తరువాత, ప్రపంచానికి ఎలాంటి పిల్లలను ఇస్తున్నాము అని చూసుకొని, ఇక మనం మన పాఠశాలలను ఆ దృక్పథానికి తగినట్టుగా మార్చుకోవాలి."

సంపాదకుని సూచన:  సద్గురు నుండి మరిన్ని సలహాల కోసం "మీ పిల్లలకు స్ఫూర్తిని ఇవ్వండి, ప్రపంచాన్ని చైతన్యం చెయ్యండి" ఈబుక్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. పుస్తకం "మీకు ఇష్టం అయినంత చెల్లించండి", అందుబాటులో ఉంది