ప్రియమైన సద్గురూ. నేను నా ఇన్నర్ ఇంజినీరింగ్ ప్రోగ్రాం చేసినప్పటినుండి, నాకొక సందేహం ఉంది. ఇన్నర్ ఇంజినీరింగ్ చేసినవాళ్లను, బిఎస్‌పి చేసిన వాళ్లను, సంయమ చేసినవాళ్లను, సంయమ సాధన చేసినవాళ్లను, బ్రహ్మచారులను చూశాను.  కాని మీలాగా ఉండడమెలాగా? సాధ్యమైతే,  మీ కంటే మెరుగ్గా...?

అంటే మీరు చాలామందిని చూడడం, వదిలివేయడం కూడా జరిగిపోయిందన్నమాట – ఇన్నర్ ఇంజినీరింగ్ చేసినవాళ్లను, భావస్పందన, సంయమ చేసినవాళ్లను, బ్రహ్మచారులను – అందర్నీ చూడడం, వదిలివేయడం కూడా జరిగిపోయిందన్నమాట. మీరు వచ్చే ఇన్నర్ ఇంజినీరింగ్ కార్యక్రమానికి వెళ్లండి, వాలంటీరుగా.. సరేనా? చివరిరోజున ఆ ప్రోగ్రామ్ కి వచ్చిన వాళ్ళందరూ ఎలా ఉన్నారో గమనించండి, ఒక నెల అంతా అలా ఉండండి. తర్వాత భావస్పందనకు వెళ్లండి. ప్రోగ్రామ్ ముగిసే రోజున అందరూ ఎలా ఉన్నారో చూడండి – అలా ఒక నెల ఉండండి. అట్లాగే సంయమ. అప్పటికి నేను దేన్ని గురించి మాట్లాడుతున్నానో మీకర్థమవుతుంది, పరివర్తన అంటే ఏమిటో తెలుస్తుంది. పరివర్తన అన్నది ఒక ఆశయమో కాదు, ఆకాంక్ష కూడా కాదు. అదొక వికాసం. మీరు దానికి అనుకూలమైన పనులు చేస్తే, మీలో వికాసం కలుగుతుంది. మీరేదో కావాలని కోరున్నారానో, ఆశించారనో అది జరగదు; మీరు ఈ  జీవి పరిణితి చెందడానికి సంసిద్ధులు గా ఉండాలి. ఇది పరిణామం చెంది ఒక సంభావ్యతగా వికసిస్తుంది.

మీరు నిజంగా ఎక్కడికయినా చేరుకోవాలనే ఉద్దేశమే కలిగి ఉంటే మీరు ఒక్కొక్క అడుగే వేస్తూ వెళ్ళవలసిందిదే.

మీరు కోరుకున్నది పరివర్తనే అయితే, మీరు అనుభూతి చెందిన ఉన్నత శిఖరం వద్ద మీరు స్థిరంగా నిలవాలి. ఇలా జీవించగలిగేందుకు అనుకూలమైన వాతావరణం మీ అంతర్ముఖంలో ఉండేటట్లు చూసుకోవాలి. లేకపోతే మీరో కార్యక్రమంలో పాల్గొనడానికి  వెళ్లి, అక్కడ ఏవేవో చేసి, ఇంటికి వెళ్లి, మళ్లీ మీ పాత పద్ధతుల్లోనే పనులు చేస్తే – దానివల్ల ఉపయోగం ఏముంటుంది. మీకు తెలిసిన అత్యున్నత అనుభూతి  మీ భావస్పందన ప్రోగ్రామ్ అయితే అలా ఒక నెలంతా ఉండగలగడమెలాగో నేర్చుకోండి. అప్పుడు తర్వాతి స్థాయి కోసం ప్రయత్నించండి. మీరు పైకి వెళుతున్నారు, కిందికి పడుతున్నారు. మళ్లీ అదే సాధించాలనుకుంటారు, దీనికి అర్థమేముంది? ఒకడుగు ముందుకు, ఒక అడుగు వెనక్కు – ఇటువంటి వ్యక్తికి ఎక్కడికీ వెళ్లే ఉద్దేశం లేదని.

ఆ ఉన్నత శిఖరంలో నిలవడమెలాగన్న ప్రాథమిక సూత్రాలే ఈ కార్యక్రమం. వీటిని మీ జీవితంలోకి ఆచరిస్తే చాలు, తరువాతిది, ఆ తరువాతిది మీ జీవితంలో వాస్తవాలు అయిపోతాయి. లేకపోతే అది కేవలం ఒక తీరని స్వప్నం మాత్రమే. మీరు నిజంగా ఎక్కడికయినా చేరుకోవాలనే ఉద్దేశమే కలిగి ఉంటే మీరు ఒక్కొక్క అడుగే వేస్తూ వెళ్ళవలసిందే. ఒక మెట్టు తరువాత మరోమెట్టు అధిరోహిస్తారు. చిల్లి గవ్వ కూడా లేని వ్యక్తి కోట్ల గురించి మాట్లాడడం వల్ల ఉపయోగమేమీ లేదు; మీరు పైకి ఎక్కవలసిందే.

 ప్రేమాశిస్సులతో,
సద్గురు