మీ అస్థిత్వమే ఆనందభరితం కావాలి...!!

మన జీవితంలో ఆనందం ఎప్పుడో ఒకసారి పొందే బహుమతిలా కాకుండా, ఎల్లప్పుడూ ఉండే ఒక స్ధిరమైన అంశంగా కావాలని, మన అస్థిత్వమే ఆనందభరితం కావాలని మనం కోరుకుంటాము. అందుకు మనం ఏం చెయ్యాలో సద్గురు 'ఆనందం 24x7' సీరీస్‌లోని ఈ పందొమ్మిదవ వ్యాసంలో చెప్తున్నారు. మరి ఆయన ఏమి చెప్పారో తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి!
 
 

మన జీవితంలో ఆనందం ఎప్పుడో ఒకసారి పొందే బహుమతి కాకుండా, ఎల్లప్పుడూ ఉండే ఒక స్ధిరమైన అంశం కావాలని, మన అస్థిత్వమే ఆనందభరితం కావాలని మనం కోరుకుంటాము. అందుకు మనం ఏం చెయ్యాలో సద్గురు మాటల్లో తెలుసుకోండి!


ఆనందం మీ జీవితంలో ఒక స్ధిరమైన అంశం కాకపోవటానికి కారణం ఏమిటంటే మీరు దాన్ని తప్పు వైపు నుంచి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు.

మీరు ఒక చెట్టుని పెంచాలనుకుంటే, మీరు దాని విత్తనాన్ని నాటి, పోషించాలి, అవునా, కాదా? మీరు ఒక చెట్టు బొమ్మని పెయింట్ చేయాలంటే, పై నుండి మొదలు పెట్టవచ్చు, కానీ ఒక నిజమైన చెట్టు కావాలంటే మీరు పై నుండి మొదలుపెట్టలేరు, అవునా, కాదా?

మీకు మామిడిపళ్ళు ఇష్టమనుకుందాం, కానీ మీరు ఆ చెట్టు యొక్క ఇతర భాగాలను పెద్దగా పట్టించుకోకపోతే, మీరు ముందు మామిడిపళ్ళను, తరువాత చెట్టుని సృష్టించాలనుకుంటే, అది అలా సాధ్యం కాదు. మీరు మార్కెట్‌లో చెట్టు లేకుండా మామిడి పళ్ళను కొనుక్కోవచ్చు. మీరు ఇంటికి ఒక డజను మామిడి పళ్ళను తీసుకురావచ్చు, కాని వాటిని మీ తోటలో చెట్టు లేకుండా పెంచలేరు. ప్రతి వేసవిలో మీకు మామిడిపళ్ళు కావాలనుకుంటే, చెట్టుని పైనుండి కిందకి పెంచాలని ప్రయత్నించడం ద్వారా పొందలేరు. అది కింద నుండి పైకి మాత్రమే పెరుగుతుంది.

ఆనందం మీ జీవితంలో ఒక స్ధిరమైన అంశం కాకపోవటానికి కారణం ఏమిటంటే మీరు దాన్ని తప్పు వైపు నుంచి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు

మీరు, మీ అస్థిత్వమే ఆనందభరితం కావాలనుకుంటున్నారు. బాధ తొలిగిపొయిన తరువాత పొందే ఒక బహుమతిలా ఆనందాన్ని పొందాలనుకోవటం లేదు. ఒక సంవత్సరం బాధపడ్డ తరువాత ఏదో ఒక రోజు వచ్చే బహుమతిలా దానిని పొందాలనుకోవటం లేదు. మీరు జీవితాన్ని అలా చూడటం లేదు. ఆనందం మీ జీవితంలో ఒక స్ధిరమైన అంశం కావాలని, అది మీ గుణం కావాలని, అది మీ జీవన విధానం కావాలని మీరు కోరుకుంటున్నారు.

అలాంటప్పుడు, అది ఎలా, ఏ పక్క నుండి పెరుగుతుందో మీరు అర్ధం చేసుకొని, దానిని ఆ పక్క నుండే పెంచాలి, మరో పక్క నుండి కాదు. మరో పక్క నుండి అయితే, మీరు అప్పుడప్పుడు మార్కెట్‌లో కొనుక్కోవచ్చు, కానీ అది ఎల్లకాలం ఉండదు, అది పడిపోతూ ఉంటుంది. సమస్య అదే, అవునా, కాదా?

మీరు, మీ అస్థిత్వమే ఆనందభరితం కావాలనుకుంటున్నారు. బాధ తొలిగినపొయిన తరువాత పొందే ఒక బహుమతిలా ఆనందాన్ని పొందాలనుకోవటం లేదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.

 
 
 
 
 
 
Login / to join the conversation1
 
 
3 సంవత్సరాలు 6 నెలలు క్రితం

"Dura Duramga natina mokkalu kuda perigee kodhi deggaravuthayi ,
Kani manushulu perigina kodhi okariki okkaru duramavutharu " - Brahma Sri Chaganti Koteshwarao garu, I bow down