తార్కికంగా ఆలోచిస్తే, ఎవరైతే దేనికీ శ్రమ పడలేదో, అతనికి శ్రమ అనిపించకపోవడం తెలిసి ఉండాలి. కానీ అది నిజంకాదు. మీకు ఏదీ శ్రమ లాగా అనిపించకపోవడం ఏమిటో తెలియాలంటే, శ్రమపడడం తెలిసి ఉండాలి. శాయశక్తులా శ్రమపడ్డప్పుడే, మీకు  సునాయాసంగా ఒక పనిని చేయడం అంటే ఏమిటో తెలుస్తుంది. పని చెయ్యడం అంటే ఏమిటో తెలిసిన వ్యక్తికే, విశ్రాంతి అంటే ఏమిటో కూడా అర్థం అవుతుంది. వింత ఏమిటంటే, ఎప్పుడూ విశ్రాంతి తీసుకునేవారికి, విశ్రాంతి అంటే ఏమిటో తెలియదు. వాళ్ళు క్రమేపీ సోమరితనంలోకి, జడత్వంలోకీ జారుకుంటారు. జీవితం పని చేస్తున్న తీరు అదే. 

రష్యను బాలే డాన్సరు నిజిన్ స్కీకి, నృత్యమే జీవితం. కొన్ని సందర్భాలలో, అతను ఎగురుతూ చేసిన విన్యాసాలు కొన్ని, మానవ మాత్రులకి సాధ్యం కావనిపించేవి.

రష్యను బాలే డాన్సరు నిజిన్ స్కీకి, నృత్యమే జీవితం. కొన్ని సందర్భాలలో, అతను ఎగురుతూ చేసిన విన్యాసాలు కొన్ని, మానవ మాత్రులకి సాధ్యం కావనిపించేవి. ఒకవ్యక్తి కండరాలు వాటి అత్యుత్తమ ప్రదర్శన చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాయనుకున్నా కూడా,  మనిషి ఎగరగల ఎత్తుకి కొన్ని హద్దులున్నాయి. కాని కొన్ని తారాస్థాయి క్షణాల్లో అతను ఆ పరిమితులను కూడా దాటిపోయినట్టపించేది!

నిజిన్స్కీ, అలాగే మరికొందరు అందుకున్నట్లు, మీరూ అలాంటి స్థాయిని తీవ్రమైన పరిశ్రమ చెయ్యడం ద్వారా అందుకోగలిగితే, ఆ క్షణాలు మీకు అవ్యక్త పారవశ్యాన్ని కలిగిస్తాయి. కాని మీరు ఆ స్థితిని నిష్క్రియత్వంలోని తీవ్రత ద్వారా చేరుకుంటే, అది ఒక యోగ ఆసనమవుతుంది, అటువంటి స్థితిని మీరు ఎక్కువకాలం నిలుపుకోగలరు.

ఇలా మిమ్మల్ని మీరు  తీవత్రలోని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళగలిగితే, కొంతకాలం తరువాత ఇక అందులో ఏ శ్రమ ఉండదు, ఇదే ధ్యానం యొక్క పరమావధి. అప్పుడు ధ్యానం ఒక పనిలా కాకుండా, నిష్క్రియత్వంలో మీరు చేరుకున్న తీవ్రతకి సహజంగా వచ్చే ఫలితమవుతుంది. అప్పుడు మీరా స్థితిలో అలా ఉండిపోగలరు మీరు కేవలం ఆ స్థితిలో ఉంటారు.  ఏ నిర్బంధం లేని ఇటువంటి అస్థిత్వ క్షణాల్లోనే, మనిషి ఈ సృష్టిలో సంపూర్ణంగా వికసించడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది.

మనిషి అలా వికసించడానికి అనువయిన వాతావరణాన్ని కల్పించకుండా మనం ప్రతి నిమిషాన్ని వృధాగా పోనిస్తే, మనం వ్యక్తులుగా, సమాజాలుగా ఒక అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకున్నట్టే. మనం మనిషిగా ఉండడంలోని మహత్వాన్ని పూర్తిగా శోధించకపోవడం వల్లనే స్వర్గం, అక్కడి సుఖాలు అనే తెలివితక్కువ మాటలు అంత ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. మీలోని మానవత్వం పొంగిపొర్లినపుడు, దైవత్వం దానంతట అదే మిమ్మల్ని  అనుసరిస్తుంది. మీకు సేవ చేస్తుంది.  దానికి మరో దారి లేదు.

ప్రేమాశిస్సులతో,
సద్గురు