ప్రశ్న: పిల్లలు ఆనందంగా ఉంటారని మీరు చెప్పినపుడు, నేను మీతో ఏకీభవించడం లేదు. ఎందుకంటే, నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు, ఇంట్లో వున్నప్పుడు ఎంతో ఆనందంగా వుంటారు. కానీ స్కూల్ కి వెళ్లినప్పుడు ఈ రోజుల్లో కిడర్-గార్టెన్ అంటే అదో పెద్ద యుద్ధభూమిలా వుంటుంది. ప్రతిరోజూ వాళ్ళు ఓ  యుద్ధం చేయడానికి సంసిద్ధంగా వుండాల్సిందే. ఈ పరిస్థితుల్లో, ఇన్నర్ ఇంజనీరింగ్  పిల్లలకు ఎలా పనిచేస్తుందో అర్ధం కావడంలేదు.

సద్గురు: మీ పిల్లలు స్కూల్ లో అంత సంతోషంగా లేనట్లైతే, మనం ఒకసారి అక్కడ టీచర్లను పరీక్షించాల్సి వుంటుంది. సహజంగా మీరు,  ఏదైనా కొత్తది నేర్చుకొన్నప్పుడు, మీకు ఎంతో ఆనందం కలుగుతుంది కదూ..? మీకు తెలియనిది, మీరు నేర్చుకొన్నప్పుడు, అది సహజంగా మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. దురదృస్టవశాత్తూ, మీ పిల్లలని  స్కూల్ కు, వారు ఏదో తెలుసుకోవాలి - అని పంపించటం లేదు. వాళ్ళు సంపాదించాలి, అందుకని మీరు వాళ్ళని స్కూల్ కు పంపిస్తున్నారు. విద్యా విధానాన్ని ఇలా చూడడం  దురదృష్టకరం. ఇది, అసలు విద్యే కాదు. మీరు, వాళ్ళని బానిసలుగా చేయాలనుకొంటున్నారు. అందుకని, టీచర్ లు మీకోసం ఆ పని చేసిపెడుతున్నారు. మీరు ఏదైతే ఆర్ధిక శ్రేయస్సు అని అనుకుంటున్నారో - దానికి మీరు వాళ్ళని, బానిసలుగా చేయాలనుకొంటున్నారు. ఆ టీచర్లు, మీకు ఆ పని చేసిపెడుతున్నారు. మీరు పిల్లలని స్కూళ్ళకి, వారిలో నేర్చుకోవాలీ అన్న తృష్ణ కలిగించడానికి పంపించడం లేదు కదా.

మీ ఉద్దేశంలో విద్య అంటే కేవలం డబ్బు, సమాజంలో ఒక  పలుకుబడి. మనం విద్యని, ఈ  విధంగా చూడడం ఎంతో తప్పు.

వాళ్ళు డబ్బులు సంపాదిస్తే ఏమిటి లేకపతే ఏమిటి? కదూ..? అందుకని ముందు మీరు విద్యపట్ల మీకున్న అభిప్రాయాన్ని మార్చుకోవాలి. స్కూల్ లో విషయసేకరణ పట్ల దృష్తి పెట్టకోడదు. అది జ్ఞానాన్ని పెంపొందించేదిగా ఉండాలి. మీ జ్ఞాన తృష్ణని పెంచేదిగా ఉండాలి. పిల్లల్లో ఇటువంటి ఆలోచన కలిగించాలి. ఒకసారి ఈ తృష్ణ పెంపొందించిన తరువాత, మీరు వారిని నేర్చుకోకుండా ఆపలేరు. వాళ్ళంతట వాళ్ళు నేర్చుకుంటారు. కానీ ఆ తృష్ణ కలిగించడానికి  బదులు, మీరు దానిని అణగతొక్కేసి, విద్యావిధానం గురించిన మీ ఆలోచనతో దానిని కొట్టిపారేస్తున్నారు. మీ ఉద్దేశంలో విద్య అంటే కేవలం డబ్బు, సమాజంలో ఒక  పలుకుబడి. మనం విద్యని, ఈ  విధంగా చూడడం ఎంతో తప్పు. ఇలా చేస్తే ఆనందంతో జీవం పొంగిపొరలుతున్న పిల్లలు విచారంగా మారిపోతారు. ఎందుకంటే మీరు వారిని, సరియైన అవగాహన దిశగా తీసుకువెళ్లడం లేదు. ఈ రకమైన నిర్బంధనలు, మీలో మీరు నిర్మించుకున్నారు. అవే నిర్బంధనాలు  మీరు, మీ పిల్లలమీద కూడా పెట్టాలనుకుంటున్నారు. ఇది అవసరం లేదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు