ఆధ్యాత్మిక ఎదుగుదలకు తగిన సమయం

ఆధ్యాత్మిక మార్గంలోనివారికి ఉత్తరాయణం దక్షిణాయణాల మధ్యకాలం చాలా గణనీయమైన ప్రాధాన్యతను కలిగి ఉంది. దీనిని "సాధనపాద" అనే గొప్ప స్వీకార సమయంగా భావిస్తారు. యోగా సంప్రదాయంలో ప్రత్యేకించి ఉత్తరార్ధగోళంలో ఈ కాలంలో ఆధ్యాత్మికమైన మార్పు సహజంగా జరుగుతుందనీ సాధనకు చాలా అనుకూలమైనదనీ భావిస్తారు. ఈ సమయంలో సాధనకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.

అప్రయత్నంగా మారే సమయం

sadhanapada

ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో పూర్తి స్థాయిలో పనిచేయటానికి సమతౌల్యం స్పష్టతలు చాల ముఖ్యమైన అంశాలు. సమతులనమైన జీవితంలో కేవలం తాము ఎంచుకున్న బాహ్య కార్యకలాపాలకన్నా మించినవి కూడా ఉంటాయి. తమ లోపల జరిగేవి కూడా ముఖ్యం. సాధనపాద కాలంలో ప్రతిఒక్కరికి తమ మనస్సునూ భావోద్వేగాలనూ సమతౌల్యంలో ఉంచుకోవటానికి జీవితంలో ఎదురయ్యే ఏ పరిస్థితికయినా తోడ్పడే ఒక స్థిరమైన పునాదిని సాధించటానికి అవకాశముంటుంది.

తీవ్ర సాధనకు సమయం:

Sadhanapada

 

2018 వ సంవత్సరంలో మొదటిసారిగా సద్గురు ఈశా యోగ కేంద్రంలోని పవిత్ర వాతావరణంలో సాధనపద సమయాన్ని గడపటానికి ప్రజలకు అవకాశం ఇచ్చారు.దేశాలనుండి మందికి పైగా పాల్గొని తమ "అంతరంగ పరివర్తన" మీద దృష్టిని పెట్టే ప్రయత్నం చేసే అవకాశం పొందారు.

Sadhanapada

కార్యక్రమంలో భాగంగా పాల్గొనేవారు నిత్య యోగసాధనలతోబాటు సేవతో కూడిన తీవ్రసాధన చేస్తారు. పాల్గొనేవారి సాధనా ప్రయాణాన్ని మహాశివరాత్రినాడు ముగిసేదాకా మేము అనుసరిస్తుంటాము. వారి అనుభవాలు పరివర్తనలను తెరవెనక గమనించి తెలుసుకుంటాము.