ప్రేమ ఓ బంధనం – కారుణ్యం, విముక్తికి మార్గం

Kashi - City of Light
 

ప్రేమ, మనోభావం, కారుణ్యాల మధ్య  భేదాన్ని సద్గురు వివరిస్తున్నారు. కుట్ర నుండి ఐక్యతవైపు ప్రయాణాన్ని కూడా వివరిస్తున్నారు.

ప్రశ్న: ప్రేమకూ, కారుణ్యానికి గల భేదమేమిటి?

మీరు పెంపొందించుకొనే మనోభావాలన్నిటిలోనూ కారుణ్యమన్నది అతి తక్కువగా బంధనాలను కలిగిస్తుంది, విముక్తి కలిగించే మనోభావాలన్నిటిలో అది ముఖ్యమైంది.

మీరు కారుణ్యం లేకుండా కూడా జీవించవచ్చు, కాని మనోభావాలు(లేక) భావోద్వేగాలు లేకుండా ఉండలేరు కాబట్టి, ఆ మనోభావాలను మరొకదానిగా పరిణమింప జేసుకోవడానికి బదులు కారుణ్యంగా పరిణమింపచేసుకోవడం మేలు.  ఎందుకంటే తక్కిన ఏ మనోభావమైనా మనకు బంధనాలను కలిగిస్తుంది, కానీ ఈ మనోభావం ఒక్కటి మాత్రమే మనల్ని విముక్తం చేసేది, మరో దానితో కాని, మరో వ్యక్తితో కాని ఇది చిక్కుపడదు.

సాధారణంగా మీ ప్రేమను ఉద్దీపింపజేసేది మనోభావం. కారుణ్యం అంటే సమస్తాన్నీ ఆవరించుకొనే ఉద్వేగం.

సాధారణంగా మీ ప్రేమను ఉద్దీపింపజేసేది మనోభావం. కారుణ్యం అంటే సమస్తాన్నీ ఆవరించుకొనే ఉద్వేగం. ఈ మనోభావం ఒక ప్రత్యేకమైన దానికే  పరిమితమైనదైతే ఇది మీ అభిరుచి అవుతుంది. అలా కాకుండా ఇది అన్నిటినీ మీతో కలుపుకునేదైతే, ఇదే కారుణ్యం. ప్రేమ అన్నది ఒక ఇష్టంగా ప్రారంభమవుతుంది, మీకు మంచి చేసిన ఏదో వస్తువు, విషయం, వ్యక్తి మీద అది ఆధారపడి ఉంటుంది. మీరెప్పుడూ ఆ ఏదో విషయం లేదా వ్యక్తి మంచితనం మీద ఆధారపడతారు. మరో విధంగా చెప్పాలంటే మీ మనోభావం పరిమితికి లోనవుతుంది. మీరు ప్రేమించే వ్యక్తి మంచి వ్యక్తి అయినప్పుడు మాత్రమే మీరా వ్యక్తిని ప్రేమించడం కొనసాగుతుంది. మీరు చెడు అనుకుంటున్న వైపు వాళ్లు మళ్లినట్లు మీకనిపిస్తే , మీరిక  ఆ వ్యక్తిని ప్రేమించలేరు.

కారుణ్యంలో ఉన్న విశేషం ఏమంటే, ఒక వ్యక్తి చాలా చెడ్డ  వ్యక్తి గా ఉన్నా, ఘోరమైన స్థితిలో ఉన్నా, లేదా చాలా చాలా చెడ్డ మనఃస్థితిలో ఉన్నప్పటికీ, మీరు ఆ వ్యక్తి పట్ల మరింత కారుణ్యం కలిగి ఉండవచ్చు. కారుణ్యం మీకు పరిమితుల్ని కల్పించదు. మంచికీ, చెడుకూ అది భేదాన్ని పరిగణించదు. అందువల్ల సానుభూతి అన్నది ప్రేమకంటే కూడా ఎక్కువ విముక్తిని కలిగించే భావోద్వేగం.

ప్రేమ సాధారణంగా ఒక వ్యక్తిని గురించింది. అది చాలా అందమైందే కావచ్చు, కాని అది మీకు మాత్రమే పరిమితమైంది. ఇద్దరు ప్రేమికులు ఒకచోట కూర్చుంటే వాళ్లకు తక్కిన ప్రపంచం ఉండదు. వాళ్లు తమలో తాము ఒక సొంత కృత్రిమ ప్రపంచాన్ని నిర్మించుకుంటారు. వాస్తవానికి అదొక కుట్రలాంటిది. మీకు కుట్ర చాలా ఆనందాన్నిస్తుంది.

ఇద్దరు ప్రేమికులు ఒకచోట కూర్చుంటే వాళ్లకు తక్కిన ప్రపంచం ఉండదు.

వాళ్లు ప్రేమలో పడతారు, దాన్నెంతో ఆనందంగా అనుభూతి చెందుతారు. కాని, వాళ్లు పెళ్లి చేసుకున్నప్పుడు అది ప్రపంచానికి ప్రకటితమవుతుంది. అకస్మాత్తుగా అందులోని ఆకర్షణంతా పోతుంది, ఎందుకంటే ఇక అదిప్పుడు కుట్రగా మిగలదు కదా. దాన్ని గురించి అందరికీ తెలుసు.

ప్రేమలో ఈ కుట్రకోణం జనానికి చాలా వత్తిడి తెస్తుంది. తక్కిన ప్రపంచాన్ని మీ అనుభూతి నుండి మీరు దూరం చేస్తే అది మిమ్మల్ని దుఃఖం వైపు నడిపిస్తుంది. అది మనోభావంగా పుట్టి మనోభావంగానే మిగిలిపోయినట్లయితే మీ జీవితంలో అది కష్టాలే మిగులుస్తుంది - అది మిమ్మల్ని చిక్కుల్లో ముడివేస్తుంది. అది మనోభావంగా ప్రారంభమై ఎల్లలు లేని కారుణ్యంగా విస్తరించినప్పుడు అది మిమ్మల్ని విముక్తి వైపు నడిపిస్తుంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1