పిల్లల పెంపకంలో మెళకువలు - 5/5

పిల్లల పెంపకం ప్రతీ తల్లిదండ్రుల జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. పిల్లలు పుట్టిన తరువాత తల్లిదండ్రుల జీవితం అంతా పిల్లల చుట్టే తిరుగుతూ ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో. ఒక సందర్భంలో పిల్లల పెంపకం గురించి సద్గురు ఐదు సూత్రాలను తెలియజేసారు. ఈ సూత్రాలలో ఐదవ సూత్రాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
 

పిల్లల పెంపకం ప్రతీ తల్లిదండ్రుల జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. పిల్లలు పుట్టిన తరువాత తల్లిదండ్రుల జీవితం అంతా పిల్లల చుట్టే తిరుగుతూ ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో. ఒక సందర్భంలో పిల్లల పెంపకం గురించి సద్గురు ఐదు సూత్రాలను తెలియజేసారు. ఈ సూత్రాలలో ఐదవ సూత్రాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.


సూత్రం - 5 : ముందు మీరు సంతోషంగా , ప్రశాంతంగా జీవించండి!

మీరు మీ పిల్లల్ని బాగా పెంచాలనుకుంటే, ముందు మీరు ఆనందంగా ఉండాలి. కానీ మీకే ఏ విధంగా ఆనందంగా ఉండాలో తెలియదు. ప్రతి రోజు మీరు మీ ఇంట్లో ఆదుర్దా , ఆగ్రహం, భయం , ద్వేషం  మొదలైన వాటిని మీ బిడ్డ ముందు ప్రదర్శిస్తున్నట్లయితే , అతడు మీ నుంచి ఏమి నేర్చుకుంటాడు ?  ఆ లక్షణాలే   కదా! అవునా, కాదా? కాబట్టి మీరు మీ పిల్లల్ని సరిగా పెంచాలంటే, ముందు మీరు  ఆనందంగా ఉండాలి.

parenting4

  మీరు మీ పిల్లల్ని బాగా పెంచాలనుకుంటే, ముందు మీరు  ఆనందంగా ఉండాలి

మీకు నిజంగా మీ పిల్లల్ని బాగా పెంచే ఉద్దేశం ఉన్నట్లైయితే, ముందు మీరు ప్రేమమూర్తులు కండి, శాంతితో జీవించండి. మిమ్మల్ని మీరే మార్చుకోలేకపొతే మీ పిల్లల్ని ఎలా మార్చగలరు? మీరు పిల్లలిని సరిగ్గా  పెంచాలంటే, ఆదర్శ తల్లిదండ్రులు కావాలంటే ఒక చిన్న ప్రయోగం చేసుకోవాలి. అదేమిటంటే మనల్ని మనం మార్చుకోగలమా, లేదా అని ఆలోచించుకోవాలి. ప్రశాంతంగా కూర్చుని, మన చుట్టు ప్రక్కలనున్న ప్రపంచంతో సంబంధం లేకుండా , మనలో, మన  జీవితంలో  ఏది సరిగ్గా  లేదో, ఏది మంచిదో, ఏది మంచిది కాదో  ఆలోచించుకోవాలి. ఒక మూడు నెలలలో మీ స్వభావం, మాట ధోరణి, పని చేసే విధానం, అలవాట్లు, వీటన్నింటిని సరైన పధ్ధతిలో మార్చుకోగలితే, అప్పుడు మీరు మీ పిల్లలని కూడా మంచి అవగాహనతో పెంచగలగుతారు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు

పిల్లల పెంపకం గురించి సద్గురు అందించిన మొదటి సూత్రాన్ని ఇక్కడ చదవండి!

పిల్లల పెంపకంలో మెళకువలు - 1/5 - అనుకూల వాతావరణాన్ని కల్పించండి!

పిల్లల పెంపకం గురించి సద్గురు అందించిన రెండవ సూత్రాన్ని ఇక్కడ చదవండి!

పిల్లల పెంపకంలో మెళుకువలు 2/5 -మీ పిల్లల అవసరాలు తెలుసుకోండి!

పిల్లల పెంపకం గురించి సద్గురు అందించిన మూడవ సూత్రాన్ని ఇక్కడ చదవండి!

పిల్లల పెంపకంలో మెళకువలు – 3/5 - మీ పిల్లల నుండి మీరు నేర్చుకోండి!

పిల్లల పెంపకం గురించి సద్గురు అందించిన నాల్గవ సూత్రం ఇక్కడ చదవండి!

పిల్లల పెంపకంలో మెళకువలు – 4/5 - పిల్లలని స్వేచ్ఛగా, స్వతంత్రంగా పెరగనివ్వండి!
 

 

 

 

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1