పరిస్థితులు ఏవైనా అవి ముక్తికి సోపానాలే..!!
 
 

Sadhguruమీరు గత జన్మలో చేసుకున్న కర్మ ఎలా ఉన్నాగాని, అది ఎలా పని చేస్తుందో ఓ ఉదాహరణతో చూద్దాం,   మీకు ముప్పై సంవత్సరాల వయసు వచ్చేలోపే, మీరు ఓ కోటి రూపాయలు సంపాదించారనుకోండి.   ఇప్పుడు మీరు ఆ డబ్బుని దుబారా చేయనూ వచ్చు లేదా  ఆ డబ్బు మరింతగా  పెంపొందించుకోవచ్చు. అదే విధంగా , గతంలో మీలో కొన్ని సంపదలను మీరు సృష్టించుకుని ఉండవచ్చు. ఈ జన్మలో, వాటిని ఇంకా పెంపొందించుకోవచ్చు లేదా వాటిని దుబారా చేయవచ్చు. వీటి గురించిన స్మృతి మీలో లేకపోయినా ఆ సంపదల లక్షణాలు,  ఈ జీవితంలోనూ మీలో కొంతవరకు తప్పనిసరిగా ఉంటుంది. అయితే, ఇప్పుడు మీరు చేసే ఆధ్యాత్మిక సాధనల వల్ల, గతంలో మీరు సంపాదించుకోన్నవి, ఈ జన్మలో భౌతికంగా ప్రాపంచిక సౌకర్యాల రూపంలో మీకు లభించవచ్చు. ఇది ఓ మంచి ఇల్లు రోపంలోనో, మీ చుట్టురా అనుకూలమైన వాతావరణం ఉండడంగానో, లేదా మీరు మంచి వ్యక్తులు మధ్య ఉండగలాగడమో ఇలా మీకు లభ్యం కావచ్చు . ఇంత మంచి జరిగినప్పటికీ కూడా, మీరు దానిని వినియోగించుకోవచ్చు, లేదా వినియోగించుకోపోనూవచ్చు. ఏదైనా జరగవచ్చు. అదే ఒక పూర్తి చక్రభ్రమణం.

ఈ జీవితం అంతా ఒక వైకుంఠపాళి లాంటి ఆట అని, నేను పదే పదే ఎందుకు అంటానో తెలుసా? ఈ ఆటలో మీరు నిచ్చెన ఎక్కారనుకోండి, అప్పుడు సంతోషంగా ఉంటారు. అలానే మీ మంచి కర్మల వల్ల మీకు ఇప్పుడు కలిగిన సౌకర్యం కూడాను, దీనివల్ల మీకు ఏమరపాటు కలగవచ్చు. అప్పుడు మీ పరిస్థితి ఈ ఆటలో పాము కరిస్తే ఉన్నటే -  క్రిందికి పడిపోతారు. దాని వల్ల బాధ కలిగితే, అపుడు మళ్ళి మెల్లగా జాగ్రత్తగా, పైకి ఎదుగుతారు. మళ్ళీ అప్పుడు కూడా నిలబెట్టుకోలేకపోతే, మళ్లీ క్రిందకి జారిపోతారు. ఇదే మూర్ఖుడు చేసే పద్ధతి, దానినే శక్తిని వృథా చేసుకోవటం అంటారు. సరైన వివేకం ఉన్న వ్యక్తి ఎవరయినా, ప్రతి శ్వాసనూ కూడా తన అభివృద్ధికి ఒక సోపానంగా స్వీకరించాలి, అదే సరైన పద్ధతి. కొందరికి,ఈ విషయం మనం  వందలసార్లు గుర్తుచేసినా కూడా, వారు ఇంకా మేల్కొకపోతే - ఇంకా సౌకర్యాలలోనే పడి దొర్లుతూ ఉంటే - మనమేం చేయగలం? అలాంటి వారు దారి తప్పినట్టే. ఇటువంటి వారికి మళ్ళీ ఇంకోసారి బాధ కలిగితేనే, తనలో పరివర్తనని కోరుకుంటాడు.

మొత్తం జనాభాలో కనీసం ఒక్క శాతం మందికి వారిలో కూడా ఆధ్యాత్మిక ప్రక్రియ జరగటం లేదు.

మొత్తం జనాభాలో కనీసం ఒక్క శాతం మందికి కూడా వారిలో ఆధ్యాత్మిక ప్రక్రియ జరగటం లేదు. మిగిలిన వాళ్ళందరూ - పరిస్థితులు సక్రమంగా సాగుతున్నంత కాలం, నవ్వుతూ గడుపుతారు, పరిస్థితులు విషమించినపుడు దుఃఖంతో క్రుంగిపోతారు. ఏది ఎలా ఉన్నా సరే , ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించి, తమలో తాము సమతుల్యంలో, ఉండగలిగిన వారు, ప్రపంచంలో చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. వారికి ఏదీ గొప్ప వరమూ కాదు, ఏదీ ఒక సమస్యా కాదు. జీవితంలో జరిగేవన్నీ కూడా వారి దృష్టిలో కేవలం జీవితంలోని పరిస్థితులే. వారి దృష్టిలో అన్నీ కూడా  ముక్తికి మరొక సోపానాలే. మిగిలిన వారందరూ, పరిస్థితులు వారిని ఎలా తోస్తే, అలా వెళ్ళిపోయే రకాలు. వారు మానవ శరీరంతో ఉన్న పశువులలాంటి వాళ్ళు; నిజానికి వారికీ, పశువులకూ ఏ వ్యత్యాసమూ లేదు. జంతువులు జీవించే విధానానికి, మనుషులు సాధారణంగా జీవించే విధానానికీ - గుణంలో ఏమైనా పెద్ద తేడా ఉందా? చూడడానికి కొంచెం తేడా ఉంటే ఉండొచ్చు. మనుషులు  చేసే కార్యకలాపాలలో చాలా వైవిధ్యం ఉండవచ్చు. మనుషులు కారు నడుపుతారు, టెలివిజన్‌ చూస్తారు, ఇంకా చాలా చేస్తారు. కానీ గుణంలో మనుషులకూ, జంతువులకూ తేడా ఎక్కడుంది?

ఆ తేడా రావాలంటే – అది కేవలం ఒక్క చైతన్యంతో మాత్రమే వస్తుంది. మరో మార్గమేమీ లేదు. సాధారణంగా, చైతన్యం అంటే, మానసికపరమైన చుఱుకుతనం అని పొరపాటు పడతారు. కానీ, చైతన్యం చాలా లోతైన అంశం. అది ఒక్క మానసికపరమైన చుఱుకుతనం మాత్రమే కాదు. మీలోని  చైతన్యం వికసించినప్పుడు, మీలో ప్రేమ కారుణ్యాలు సహజంగానే  ఉప్పొంగుతాయి. అపుడు మీ ప్రతి శ్వాసా, ఎదుగుదలకు ఒక సోపానమే అవుతుంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1