పుస్తకాలు చదివే అలవాటును ప్రోత్సహించడం

పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా,సంస్కృతిలో ఓ భాగంగా పెంపొందించాలి. ప్రభావం, వీడియోలు చూడటం లేదా కంప్యూటర్ గేమ్స్ ఆడటం కన్నా పుస్తకాలు చదవడం అన్నది పిల్లల మీద ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అది మీ మనస్సును ఇంకా అంతర్ద్రుష్టిని ఓ విభిన్నమైన పద్ధతిలో పనిచేయిస్తుంది. వీడియోస్ చూడడంపై కాకుండా చదవడంపై ఎక్కువ ఆకాంక్ష కలిగి వుండాలా నేటి యువాతారాన్ని రుపుదిద్దాలి. నిజమే, ఆడియో విసువల్ మీడియా  ద్వారా కూడా విద్యని అందించవచ్చు, అది కూడా దాని తరహాలో సమర్థవంతమైనదే, కాని పుస్తకాలు చదవడం అన్నది మరింత సంక్లిష్టమైన, లోతైన విషయం. ఓ సినిమా చూడడంలో కన్నా ఓ పుస్తకం చదవడంలో ఎంతో విశిష్టత ఉంది. ఎక్కువ సంఖ్యల్లో ప్రజలు ప్రస్తుతం కంటే ఎక్కువగా పుస్తకాలు చదవడం మొదలు పెట్టినట్లైతే, వారు ఓ పుస్తకం చదవడంపై దృష్టిసారించ గలిగితే, వారు ఇప్పటి కంటే ఎంతో ప్రశాంతంగా జీవితాన్ని మరింత లోతుగా ఆలోచనా పూర్వంగా చూడగలుగుతారు.

మేధస్సును ఇంకా ఆశయాలను సంరక్షించండి

ప్రతి పిల్లవాడిలో తన జీవితాన్ని పూర్తిగా జీవించడానికి కావలిసిన మేధస్సు వుంది. తల్లిదండ్రులుగా మీరు చేయవలసిన పని ఏమిటంటే, వారు తమ మేధస్సును పెంచుకునేలా ఓ మంచి వాతావరణం కలుగచేసి, వారు ఎరుకతో  చైతన్యవంతులుగా ఉండేలా ప్రోత్సహించండి. తల్లిదండ్రులు తమ పిల్లలను వారి మార్గంలో కాక తమకు నచ్చిన మార్గంలో ఎదగాలని కోరుకోవడం వల్ల సమస్య వస్తుంది. తల్లిదండ్రుల ఆలోచనలో వారు తమ బిడ్డను డాక్టర్  అవ్వడమే మేధస్సు అనుకోవచ్చు. బహుశ ఆ పిల్లవాడు ఒక గొప్ప కార్పెంటర్ అవ్వాగలడేమో, కానీ మీరు వారిని డాక్టర్ చేయాలనే అనుకుంటారు, అది కూడా వారు డాక్టర్ వృత్తికి అంకితమై సేవ చేయాలనే ఉద్దేశంతో కాదు, కేవలం మీ ఆలోచనా విధానంలో డాక్టర్ లేదా ఇంజనీర్ అవ్వడం అంటేనే సమాజంలో ఓ ప్రతిష్ట  భావిస్తారు. మీ జీవితాలను  మీ పిల్లల ద్వారా జీవించాలని ప్రయత్నించకండి. ఇది ఖచ్చితంగా పిల్లల జీవితాలను నాశనం చేస్తుంది. మీరు మీ జీవితంలో ఏది చేశారో అదే మీ పిల్లలు చేయాలనేం లేదు. మీరు మీ జీవితంలో చేయడానికి కూడా ధైర్యం చేయని పనులను మీ పిల్లలు సాధించవచ్చు. అలా జరిగినప్పుడు మాత్రమే ప్రపంచ  పురోగతి సాధ్యపడుతుంది.

క్రమశిక్షణను అలవరచడం

ఆంగ్ల భాషలో ‘discipline’ అనే పదానికి అర్థం ‘తెలియడం’ లేదా ‘నేర్చుకోవడం’. నేను క్రమశిక్షణతో ఉన్నానని మీరు చెబితే, మీరు నిరంతరం ఏదో నేర్చుకోవడానికి సుముఖంగా ఉన్నారని అర్థం. ఒక విధానానికి కట్టుబడి ఉండడం కాదు. ‘క్రమశిక్షణ’ అంటే నిర్దిష్టమైన మార్గంలో ఏదో ఒకటి చేయడం కాదు. నిరంతరం కృషి చేస్తూ ఇంకా ప్రతి పని ఇంకా బాగా చేయాలని నేర్చుకునే తపన ఉన్నట్లయితే, మీరు క్రమశిక్షణను కల్గినవారు అవుతారు. మీ పిల్లల నిత్య జీవితంలో యోగ అభ్యాసాన్ని తీసుకురాగలిగితే వారి జీవితాల్లో క్రమశిక్షణ రాహిత్యం అనే దానికి చోటు వుండదు. క్రమశిక్షణతో కూడిన జీవనం వారికి కలిగి తీరుతుంది. యోగ అభ్యసనము అన్నది జీవితాల్లో క్రమశిక్షణనుతీసుకువస్తుంది ఎందుకంటే మీరు కొన్ని పనులను కొన్ని మార్గాలలోనే చేయాలి. లేకపోతే అవి పనిచేయవు. యోగ అభ్యాసనం చాలా విషయాలను కూలంకుషంగా నేర్పుతుంది. అంత వివరంగా ఆ అభ్యాసాన్ని మీరు చేయడం మొదలుపెడితే, మీ జీవితాల్లో క్రమశిక్షణ లేకపోవడంమన్నది ఉండదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు