ఆత్మజ్ఞానం మీ వృత్తికి అవరోధమా...??

మనం నిత్యం అనేక పనులతో తీరిక లేకుండా ఉంటూటాం. ఏవైనా లక్ష్యాలను సాధించాలనుకున్నప్పుడు వాటి కోసం చాలా సమయం కేటాయించాల్సి వస్తుంది.మనకు అస్సలు తీరిక లేనట్లుగా చేస్తాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మజ్ఞానానికి సమయాన్నికల్పించుకోవడం సరైన పనేనా? మనము దేనికి ప్రాముఖ్యతను ఇవ్వాలి? ఈ ప్రశ్నలకు సద్గురు సమాధానాలను ఈ వ్యాసంలో మీ కోసం అందిస్తున్నాము.
 
 

మనం నిత్యం అనేక పనులతో తీరిక లేకుండా ఉంటుంటాం. ఏవైనా లక్ష్యాలను సాధించాలనుకున్నప్పుడు వాటి కోసం చాలా సమయం కేటాయించాల్సి వస్తుంది.మనకు అస్సలు తీరిక లేనట్లుగా చేస్తాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మజ్ఞానానికి సమయాన్నికల్పించుకోవడం సరైన పనేనా? మనము దేనికి ప్రాముఖ్యతను ఇవ్వాలి?  ఈ ప్రశ్నలకు సద్గురు సమాధానాలను  ఈ వ్యాసంలో మీ కోసం అందిస్తున్నాము. 


ప్రశ్న: మనం ఉద్యోగంలో లేదా వృత్తిలో కొన్ని లక్ష్యాలను సాధించాలనుకున్నప్పుడు, అవి మనకు అస్సలు తీరిక లేకుండా చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మజ్ఞానానికి సమయాన్ని ఎలా కల్పించుకోవాలి ?

మొట్టమొదట మనమంతా ఆత్మజ్ఞానం గురించి మనకున్న ఆలోచనల్ని స్పష్టపరుచుకుందాం. మీకు సెల్ ఫోనుందా? మీరు కెమేరాను వాడతారా ? మీ జీవితంలో మీరెలాంటి పరికరాన్ని వాడుతున్నా,  దాని గురించి మీరెంత ఎక్కువగా తెలుసుకుంటే అంత బాగా దానిని ఉపయోగించుకోగలుగుతారు. ఒక విషయం గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, దాంతో ఏం చేయవచ్చన్న అవకాశాలు అంత ఎక్కువగా పెరుగుతాయి. మీరు వాడే ప్రతీ వస్తువు విషయంలో ఇది నిజమైనప్పుడు, మీ విషయంలో ఇది నిజమెందుకు కాకూడదు? దీని గురించి మీరెంత ఎక్కువగా తెలుసుకుంటే, అంత బాగా మీరు దీన్ని ఉపయోగించుకోగలుగుతారు. కాబట్టి ఆత్మజ్ఞానమనేది ఏదో ఓ హిమాలయ గుహలో సంభవించేదని అనుకోకండి. ఆత్మజ్ఞానం అక్కడ కూడా సాధ్యపడింది,  అయితే మీ పరిస్థితులకు అనుగుణంగా దాన్ని మీరు అర్థం చేసుకోవాలనేదే నా కోరిక.

ఆత్మజ్ఞానమంటే మీ గురించి మీరు తెలుసుకోవడమే. అది మీ వృత్తికి అవరోధం ఎలా కాగలదు?

ఆత్మజ్ఞానమంటే మీ గురించి మీరు తెలుసుకోవడమే. అది మీ వృత్తికి అవరోధం ఎలా కాగలదు? అది మీ జీవితంలో మీరు చేయాలనుకున్న దేనికైనా అవరోధమెలాకాగలదు ? మీ గురించి మీరేమాత్రం తెలుసుకోకుండా సమర్థవంతంగా ఎలా జీవించగలరు ? జీవిత ప్రక్రియ గురించి ఏమాత్రం తెలుసుకోకుండానే విశ్వాసంతో ఎలా ఉండాలో  మనుషులు ఒకరికొకరు భోధించుకుంటున్నారు. స్పష్టతలేని  విశ్వాసం చాలా ప్రమాదకరం. దురదృష్టవశాత్తూ, మనం విశ్వాసం స్పష్టతకు ప్రత్యామ్నాయంగా భావిస్తాం. మీ కళ్ళకు గంతలు కట్టి మిమ్మల్ని అలా నడవమని చెప్పామనుకుందాం. మీకు వివేకముంటే, అటు ఇటు మెల్లగా మెల్లగా అడుగులు వేస్తూ, గోడల్ని పట్టుకుంటూ, మీ చేతులతో కాళ్ళతో స్పృశిస్తూ నడుస్తూ మీరు మీ దారిని గ్రహిస్తారు. అయితే మీరు మితిమీరిన విశ్వాసంతో ఏది పట్టించుకోకుండా నడిస్తే, రాళ్ళు కూడా  మీ పట్ల  దయ చూపించవు. స్పష్టత లేని విశ్వాసంతో ఉంటే జీవితమూ మీ పట్ల దయ చూపించదు. మీ జీవిత కార్యకలాపాల్ని సజావుగా నిర్వహించుకోవడానికి, మీరు ఏమిచేస్తున్నా అందులో విజయం సాధించడానికి, మీకు కావాల్సింది స్పష్టత, విశ్వాసం కాదు.

కాబట్టి మీ గురించి మీరెంత బాగా తెలుసుకుంటే, అంత బాగా మీరు పనులు చేయగలుగుతారు. ఇది పని చేసే విధానాన్ని పూర్తిగా మీరు తెలుసుకోవచ్చు. దాన్ని మీరు పూర్తిగా తెలుసుకోగలిగితే, అదొక మ్యాజిక్‌లా పనిచేస్తుంది. మీరేం చేసినా సరే అది ఒక మ్యాజిక్కే అవుతుంది. మీరు కూర్చున్నా పనులు చేయగలుగుతారు, కళ్ళు మూసుకున్నా పనులు చేయగలుగుతారు. మీరు నిద్రపోతున్నా కూడా మీరు పనులు చేయగలుగుతారు. ఒక్కసారి దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే, మీరు పడుకున్నా, మెలుకొని ఉన్నా, ఈ వ్యవస్థతో మీరు అద్భుతమైన పనులు చేయగలరు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1