మీడియా - నాడు , నేడు

 

ఇటీవల ఓ టీవీ ఛానల్ వారు, మీడియా గురించి అడిగిన ప్రశ్నకి సద్గురు అప్పటి మీడియాకి, ఇప్పటికీ వచ్చిన మార్పులు వివరిస్తున్నారు..

అదృష్టవశాత్తూ నేను టీవీ ఎక్కువగా చూడను, కాకపోతే నాకు ప్రపంచంలో జరిగే విషయాలు మాత్రం ఎదో ఓ రకంగా తెలుస్తూనే ఉంటాయి. అయితే మీరంటున్న సవాలక్ష టీవీ ఛానల్ ను మాత్రం నేనేన్నడూ చూడలేదు. నేననుకోవడం, ఈ మధ్యకాలంలో వార్తల కంటే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. వార్త అనేది మరుగున  పడింది.

నాకు పదకొండేళ్ళ వయసునుండి వార్తా పత్రిక చదివే అలవాటుంది. 11 సంవత్సరాల నుండి 22 ఏళ్ల వరకూ, రోజుకి మూడు న్యూస్ పేపర్ల చొప్పున చదివేవాడిని. ఈ చవరి నుండి ఆ చివరి దాకా, అన్ని విషయాలూ క్షుణ్ణంగా చదివే వాణ్ణి. ఎంతాలాగంటే, నాకు ఇప్పటికీ కొన్ని స్టాక్ ధరలు గుర్తున్నాయి! నేను ఎటువంటి స్టాక్ పెట్టుబడులు చేయకపోయినా ఇవన్నీ ఎంతో ఆసక్తితో చదివేవాణ్ని.ఆ మాటకొస్తే 1973 లో ఓ కంపనీ స్టాక్ ధరలు ఇప్పటికీ గుర్తే! ఇలా మూడేసి పేపర్లను చదివేవాణ్ణి.  కానీ, ఒక్క ఎడిటోరియల్ జోలికి మాత్రం వెళ్ళేవాణ్ని కాదు. ఎందుకంటే ఎవరి అభిప్రాయాలతోనూ నాకు పని లేదు. నా అభిప్రాయాలను సృష్టించే సామర్ధ్యత నాకుంది కాబట్టి! నాకు కావలసిందల్లా సామాచారం. ఆ సమాచారమే ఉంటే దాని బట్టి నా అభిప్రాయం నేను ఏర్పరచుకుంటాను. మరొకరి అభిప్రాయాలతో నాకు పని లేదు !

మీడియా అనేది జరుగుతున్న విషయాలను ఉన్నదున్నట్లుగా రిపోర్ట్ చేస్తుందని అనుకునే వాణ్ని

ఇక ఇవాల్టి మీడియా లోని విషయాలను చూస్తే - వార్తలకంటే వ్యక్తిగత అభిప్రాయాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారని అనిపిస్తుంది. కానీ నిజానికి జర్నలిజం అనేది మనకి వార్తలందించడానికుంది, అభిప్రాయాలను అందించడానికి కాదు.

ఇదివరకు వార్తా పత్రికల్లో కేవలం 2% మాత్రమే అభిప్రాయాలను ఎడిటోరియల్ ద్వారా వ్యక్తం చేసేవారు. కానీ ఇవేళ 50 % నికి పైగా వ్యక్తిగత అభిప్రాయాలే! న్యూస్ పేపర్లు ఇటువంటి దృష్టి కోణాలతో నిండిపోతే దేశం వివేకవంతులని కోల్పోతుంది. కేవలం మాస్ ఆడియన్స్ మాత్రం మిగులుతారు.

మీడియా అనేది జరుగుతున్న విషయాలను ఉన్నదున్నట్లుగా రిపోర్ట్ చేస్తుందని అనుకునే వాణ్ని. అది చూసిన ప్రేక్షకులు వారి వారి అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. అది వారికి వదిలేద్దాం.  అలా కాకుండా మీడియా తన ‘వ్యూ’ ని, తన అభిప్రాయాలనీ జోడించి చెపుతూ ఉంటే, మెల్లిగా రాజకీయాల వైపూ, రాజకీయ పార్టీల వైపు మొగ్గు చూపడం మొదలౌతుంది . ఇలా జరిగినప్పుడు ఇక మీడియాని రాజ్యాంగ వ్యవస్థ లోని  5 th పిల్లర్ అని అనడానికి లేదు..

వారు ఆ దిశలో వెళుతున్నారని నేననుకుంటున్నాను, పూర్తిగా వెళ్ళారని  అనడానికి లేదు, కానీ ఏ మీడియా/టీవీ ఛానల్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతోందన్న విషయం ప్రజలకి తెలుసు. ఇందులో తప్పనిసరిగా మార్పు రావాలి. ఏ టీవీ చానెల్ ఏ ఒక్క పార్టీ వైపు మొగ్గు చూపకూడదు.

మాకు కావలసింది మేము చేసే పనులని మీడియా సరిగ్గా రిపోర్ట్ చేయడం. అది చూసి దానిలో ఎంత విలువుందో ప్రజలనే నిర్ణయించుకోనిద్దాం.

ఇంకా ఈ మధ్య కొంత తగ్గిందేమో కానీ ఒకప్పుడు మీడియా వారు నాగురించి రాయని విషయం లేదు. నన్ను విమర్శించని రోజు లేదు! ఓ మనిషి చేయగలిగినవీ, చేయలేనివీ అన్ని విషయాల్ల్లోనూ నాకో ‘గుర్తింపు/credit’ నిచ్చారు! నాపై ఆరోపణలు వేయలేదు కానీ, ప్రతీ దానిలో నాకో గుర్తింపు మాత్రం ఇచ్చారు! కాకపొతే ఇవాల్టి పరిస్థితి ఎలా ఉందంటే - ఈశా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందింది. ఐవీ లీగ్ యూనివర్సిటీ కానివ్వండి , శాస్త్రవేత్తల సంఘాల్లో, విద్యావేత్తల సర్కిల్స్ లో, కార్పోరేట్లలో ప్రతీచోటా మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. నా విలువని గుర్తిసున్నారు. అందుకే మీడియా కూడా దీనికి అనుగుణంగా వెళుతోంది. కానీ మీడియా అలా చేయకూడదు. మీడియా ఎప్పుడూ కూడా సత్యాన్నేచూడాలి. ఆ బాటలోనే నడవాలి. నిజాన్నే చూపించాలి. అంతే కానీ ఎవరి అభిప్రాయం ప్రకారమో నడుచుకోకూడదు. ఒకప్పుడు నా గురించి వ్యతిరేక భావాలూ, వ్యూస్ ఉండేవి. ఇప్పుడు నా పై పాజిటివ్ వ్యూస్  ఉన్నాయి.నేను రెంటినీ సమ్మతించను. నా గురించి మంచిగా కానీ చెడుగా కానీ మాట్లాడడం నేను ఆమోదించను/సమ్మతించను. ఎందుకంటే నెగటివ్ గా మాట్లాడితే అది మా సంస్థకి మంచిది కాదు. అలాగని ప్రశంసిస్తే నాకు కొద్దిగా సిగ్గుగా, ఇబ్బందిగా అనిపిస్తుంది!

మాకు కావలసింది మేము చేసే పనులని మీడియా సరిగ్గా రిపోర్ట్ చేయడం. అది చూసి దానిలో ఎంత విలువుందో ప్రజలనే నిర్ణయించుకో నిద్దాం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1