మనవ శరీరంలోని కోశాలు – 2

 

మనం కిందటి వారం భౌతిక కోశం ,మానసిక కోశం, శక్తి కోశం గురించి తెలుసుకున్నాం. ఈ మూడు పార్శ్వలని ఓ సమన్వయంలో, ఓ సమలేఖనంలోకి తీసుకునివచ్చినప్పుడు, మనలో (నిగూడంగా) నిక్షిప్తమైఉన్నది, దేన్నైతే సృష్టిమూలం అని అంటామో అది,దాని పని నిరాటంకంగా చేసుకుంటూ పోతుంది.

సాధారణంగా మనుషులు తమ శరీరంలో శక్తి సమతుల్యంగా, సంపూర్ణంగా ప్రవహిస్తున్నప్పుడు తమ మానసిక, భౌతిక కోశాల్లో అద్భుతమైన మార్పులు గమనిస్తారు . ఇలా జరిగినప్పుడు మానసిక ,శారీరిక స్థాయిల్లో రుగ్మతనేదేది ఉండదు . ఎటువంటి రుగ్మతైనా సరే మటుమాయమౌతుంది . ఇదెలాంటిదో ఓ ఉదాహరణతో పోల్చి చెప్తాను. మీ కార్ స్టార్ట్ అవ్వడంలేదనుకోండి, మీరు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. మీరు ఎంత ప్రయత్నించినా స్టార్ట్ కాని మీ కారు, మీ మెకానిక్ చేయిపడగానే మంత్రించినట్టు స్టార్ట్ ఔతుంది! అప్పటిదాకా మీరు దాన్ని తోసి, తన్ని , తిట్టుకుని విశ్వప్రయత్నం చేసినా అసలు కదలలేదు, కానీ మెకానిక్ చేయివేస్తే గిర్రుమని స్టార్ట్ అయింది . మీ శరీరం కూడా అంతే, అదెలా పనిచేస్తుందో మీకర్ధంకాదు, మీరెంచేసినా పనిచేయదు, మీ మాట వినదు. అయితే కేవలం ఓ సరళమైన ప్రక్రియతో అంతా సర్దుకుపోతుంది. నాకు తెలిసిన కొన్నివేలమంది మనుషులు తమ అనారోగ్యాన్నీ, ఎప్పటినుండో పీడిస్తున్న రుగ్మతలనుండి యోగా ద్వారా విముక్తిపొందారు.సరళమైనదే అయినా ఇది శరీరంలో ఓ సమతుల్యతని స్థాపిస్తుంది. తర్కించే మనసుకిది అర్ధంకాదు అందుకే అదో అద్భుతమని భ్రమపడుతుంది

నాకు తెలిసిన కొన్నివేలమంది మనుషులు తమ అనారోగ్యాన్నీ, ఎప్పటినుండో పీడిస్తున్న రుగ్మతలనుండి యోగా ద్వారా విముక్తిపొందారు.

మనకర్ధం కానిదేదైనా అద్భుతమని అనేస్తాం . ఉదాహరణకి మీకు విద్యుత్ శక్తి గురించి అసలేమీ తెలీదనుకోండి, అటువంటప్పుడు ‘ నేనీ గోడను ముట్టుకున్న వెంటనే ఈ హాలంతా వెలుతురుతో నిండిపోతుంది’ అనంటే మీరు నమ్ముతారా? సరే ,అక్కడ స్విచ్ వేస్తే, ఇక్కడ బ్రహ్మాండమైన వెలుతురు!మీరు నన్ను ఆ దేవదూతననో , దేవుని బిడ్డనో , సాక్షాత్తూ ఆ దేవుడనో అనుకుంటారు, ఎందుకంటే ఇదెలా పనిచేస్తుందన్న అవగాహన మీకు లేదు కాబట్టి . ఇందాక  అన్నట్టు, మీకర్ధం కాని ప్రతీది ఓ అద్భుతమని అనుకుంటారు . అలా అయితే కేవలం రెండు కణాల కలయికతో ఈ మహోన్నత సృష్టి ఉద్భవించడం అద్భుతమే కదా?జీవితానికి సంబంధించినదేదైనా అద్భుతమే ! లేదా..ప్రతీదీ విశిదీకరించి చూస్తే ఎదీ అద్భుతం కాదు..!

మనలో శారీరిక, మానసిక, శక్తి కోశాలనే మూడు కోణాల ఉన్నాయి. ఈ మూడూ భౌతిక/స్థూల  ప్రవృత్తి కలిగిఉన్నాయి. స్థూలంగా మొదలైనా, అలా వెళుతున్నకొద్దీ ఇంకా ఇంకా సూక్ష్మంగా మారుతూ ఉంటాయి , స్థూలం నుండి సూక్ష్మంగా మారుతున్నాయి, కానీ మౌలికంగా ఇవన్నీ భౌతికమైనవే . ఉదాహరణకి మీరా బల్బుని చూస్తున్నారు, అది స్థూలమే దాని ప్రకాశింపచేస్తున్న విద్యుత్ కూడా స్థూలమే, అది విరజిమ్మే వెలుతురూ కూడా స్థూలమే. అలాగే ఈ మూడు పోరలూ స్థూలమైనవి.

కానీ విజ్ఞానమయ కోశం వీటికి పూర్తిగా భిన్నమైనది . ఇది తాత్కాలికమైనది – ఒక తత్త్వం నుంచి మరో తత్వానికి పరిణామం చెందడానికి మధ్యలోని స్థితి. అంటే భౌతికం నుండి అభౌతికం వైపు కదులుతున్నది అని అర్ధం . ఈ మధ్యంతర స్థితిని ‘విజ్ఞాన’ మని అంటాము. ఈ  కోణంలో ఎటువంటి పరిణామం సంభవించినా అది శాశ్వతమైనదే అవుతుంది. ఒకవేళ మీకిప్పుడు యోగ నేర్పించి ఆసనాలు ఎలా వేయాలో చూపించామనుకోండి, ఓ ఆరు నెలల తరువాత శారీరికంగ , మానసికంగా అన్ని విధాలా మీరు ఇదివరకటి కంటే ఆరోగ్యంగా తయారౌతారు , కానీ ఏ కారణం చేతనో మరో ఆరు నెలలు మానేస్తే మళ్ళీ మునపటి స్థితికి వచ్చేస్తారు. శారీరిక స్థాయిలో ఏం చేసినా అది మళ్ళీ  మునపటి స్థితికే వచ్చేసే అవకాశముంది. మనసుని పునశ్చరణ చేస్తే కొన్నాళ్ళు కొత్తజీవితం వచ్చినట్లు అనిపించవచ్చు, అయితే మళ్ళీ  పాత అలవాట్లల్లో పడిపోవడానికి ఎంతో సమయం పట్టదు. శారీరికంగా, మానసికంగా వచ్చే మార్పుల పట్ల మనం సుముఖంగా లేకపోతే ఎంతోకాలం వాటిని నిలుపుకోలేము. ప్రాణాయామం , క్రియాల ద్వారా  మీ ప్రాణ శక్తిలో కూడా మార్పులు తేవొచ్చు. ఇటువంటి పరిణామం ఎక్కువ కాలం నిలుస్తుంది. కానీ ఇది కూడా శాశ్వతమైనదికాదు. కొంత కాలానికి అవికూడా నిలవవు.

మీ గురువు ఒక్కసారి మీ  విజ్ఞానమయ కోశాన్ని స్ఫృశించగానే మీ జీవితంలో ప్రతిదీ ఎంతో ప్రామాణికంగా  మారిపోతుంది.

మీ విజ్ఞానమయ కోశంలో తగినంత పరిణామం వస్తేనే అది చిరస్థాయిగా ఉండిపోతుంది . మీ ప్రస్తుత జీవితంలోనే కాదు , దీన్ని దాటి ఆవలికెళ్ళినా అది అలాగే ఉంటుంది. ఓ గురువుకీ , అధ్యాపకునికీ ఉండే తేడా అదే. అధ్యాపకుడు మీ అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాలలో మార్పులు తీసుకురాగలిగే విధానాలను నేర్పించ గలడు, కానీ మీ విజ్ఞానమయ కోశాన్ని తాకలేడు.  కానీ గురువు మీ విజ్ఞానమయ కోశాన్ని స్ఫృశించ గలరు . మీ గురువు ఒక్కసారి మీ  విజ్ఞానమయ కోశాన్ని స్ఫృశించగానే మీ జీవితంలో ప్రతిదీ ఎంతో ప్రామాణికంగా  మారిపోతుంది. ఈ మార్పు శాశ్వతమైనది , ఇది భౌతిక కోణాన్ని దాటినది. ఇది ఎల్లప్పుడూ శాశ్వతమైన పరిణామమే.

మీలోని ఐదవ పొరని ‘ఆనందమయ’ కోశమని అంటారు. దీనికి అర్ధం ఆనందభరితమైనదని!అంటే మీలోఆనందమయ బుడగ దాగున్నదనా? కాదు..!ఇది భౌతికాన్ని మించిన కోణం. అభౌతికమైనది ఎప్పుడూ వివరణకీ , నిర్వచనాలకీ అతీతంగా ఉంటుంది ,ఇది కేవలం మన అనుభూతి ద్వారా తెలుసుకోగలం. అది మన అనుభూతిలోకి వచ్చినప్పుడు మనం పరమానందానికి లోనౌతాం కాబట్టి దాన్ని ఆనందమయకోశం అని అంటున్నాం. దాన్నితాకి మనం పరమానందభరితం అవుతాము, అందుకే దాన్ని ‘ఆనందమయం’ అంటున్నాం, అంతేకానీ దాని ప్రవృత్తి ఆనందం అని అర్ధం కాదు. మనల్ని ఆ అనుభూతి ఆనందభరితుల్ని  చేస్తుంది.

ఈ అభౌతిక కోణాన్ని తాకినప్పుడు మిమ్మల్ని అధ్యాత్మికులంటాము.

ఉదాహరణకి మీరు పంచదార నోట్లోవేసుకుంటే తీయగా ఉందని అంటారు , దానర్ధం పంచదార ప్రవృత్తి తీపి అని కాదు కదా, అది మీకు తీయ్యని అనుభూతినిస్తుంది కాబట్టి తీపి వస్తువంటాము . అలాగే ఆనందం మీ అంతర్గత  ప్రవృత్తి కాదు. అది భౌతికానికి అందనిది , భౌతికానికి మించినది , నిజానికి దాన్ని వర్ణించలేము, అందుకే చిన్నపిల్లల్లాగా  మాట్లాడుతున్నాం!ఉదాహరణకి స్పీకర్ అంటే ఏంటో తెలియని ఓ చిన్నపిల్లవాడు దాన్ని ముట్టుకుని ‘బూమ్ బూమ్ బూమ్ ‘ అంటాడు, అలా చప్పుడౌతుంది కాబట్టి.అందుకేనేమో అమెరికాలో దాన్ని ‘బూమ్ బాక్స్’ అనంటారు, ఇది చిన్నపిల్లల భాషేకదా!అలాగే ‘ఆనందమయం’ అని మనం దాన్నంటున్నామంటే , వినడానికి చిన్నపిల్లల భాషలా ఉంటుంది . మనం మన అనుభూతి గురించి మాట్లాడుతున్నాం , అంతేకానీ, దాని ప్రవృత్తి గురించి కాదు.

ఈ భౌతిక కోణాలు మూడు ఓదానితో ఒకటి ఓ క్రమంలో, ఓ సమన్యయంలో ఉంటేగానీ ఈ ఆనందమయ కోశాన్ని అనుభూతి చెందలేరు, యోగ ఈ మూడు భౌతిక కోణాల సమన్వయానికి దోహద పడి, ఆనందమయ కోశాన్ని మీ అనుభూతిలోకి తీసుకువస్తుంది. దాన్ని చవి చూసిన  మీరు పరమానందానికి లోనౌతారు! ఇలా జరగడం ఎంతో సహజం! మీ జీవితంలో ప్రతీక్షణం ఆనందమయమే. ఈ అభౌతిక కోణాన్ని తాకినప్పుడు మిమ్మల్ని అధ్యాత్మికులంటాము.  ఈ మూడు కోణాలూ (సరైన) సమన్వయంలో ఉన్నప్పుడు , మీ జీవన యానం అట్టే శ్రమలేకుండా హాయిగా సాగిపోతుంది, అంతే కాదు మీ సామర్ధ్యత కూడా పరిపూర్ణంగా వికసిస్తుంది. జీవితం ప్రకియలు మిమ్మల్ని ఏ విధంగానూ బాధ పెట్టలేఉ. జీవితంతో మీరు ఏమి కావాలంటే అది చేసుకోవచ్చు, మిమ్మల్ని జీవితం ఇసుమాత్రమైనా నొప్పించలేదు... ఇంతటి సామర్ధ్యత ఈ భూమిమీద ప్రతీమనిషికీ ఉంది!

ప్రేమాశీస్సులతో,
సద్గురు

pc:en.wikipedia.org

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1