Sadhguruభగవంతుడు మనిషి సృష్టి అని అర్థం చేసుకున్న సంస్కృతి మనదొక్కరిదే. మనకి తెలుసు దేవుణ్ణి మనమే సృష్టించుకున్నామని. అందుకే మనకి 3 కోట్లకు పైగా దేవతలు దేవుళ్ళు ఉండడమే గాక, దేవుళ్ళను తయారు చేసే సాంకేతికతనీ అభివృద్ధిచేసుకున్నాం. శక్తిని మనం ఉత్పత్తి చేయసాగాము ...జన బాహుళ్యానికి అనేక విధాలుగా ఉపకరించే శక్తిరూపాలని సృష్టించ సాగాము. ఎవరికీ ఇదే పరమావధి అన్న అపోహలు లేవు.

మీరందరూ ఇది అన్నివేళలా గుర్తుంచుకోవలసింది మీ లక్ష్యం దేవుడు కాదు, మీ లక్ష్యం ముక్తి. ముక్తి అంటె ఏమిటి? విముక్తి. ఈ మానవ జన్మ నుండి విముక్తి. దైవం దానికి ఒక మెట్టు లాంటది. మీకు కావలసివస్తే దాని మీద అడుగేసి ముందుకి పోవచ్చు. లేకుంటే, దాన్ని తప్పించుకుని కూడా పోవచ్చు; అది మీ ఇష్టం. కానీ, మీ గమ్యం ఎప్పుడూ ముక్తే గాని భగవంతుడు కాదు. అందుకని మనం కోట్లకొద్దీ దేవతలను సృష్టించుకుంటూ పోయాము; మనం ఇప్పటికీ మరికొందరు దేవతలని సృష్టించుకుంటూనే ఉన్నాము. 2010లో ఈశా యోగా కేంద్రంలో లింగభైరవి అన్న దేవతని ప్రతిష్ఠించడం జరిగింది.

బహుశా ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా, పూర్తిగా భిన్నంగా నిర్వహిస్తున్న దేవాలయం, ఇదే మొట్టమొదటిదేమో. ఇది చాలా చాలా తీక్షణమైన స్త్రీ శక్తి స్వరూపం.

లింగభైరవి శక్తివంతమైన స్త్రీ స్వరూపము; తీక్షణమైన స్త్రీ స్వరూపము. అరుదుగానైనప్పటికీ, ఈ ఆకృతులు ఎప్పటినుండో ఉన్నాయి...కానీ, స్త్రీ స్వరూపం  లింగాకృతిలో చాలా అరుదుగా చూస్తారు. ఇది మాత్రం లింగాకృతిలో ఉన్న స్త్రీ శక్తి. ఇది వివేచనకి అర్థరహితంగా తోస్తుంది. మన భారతదేశంలో స్త్రీ జననేంద్రియమైన "యోని" కి ఎన్నో దేవాలయాలున్నాయి. దానిని మాతృదేవతగా ఆరాధిస్తారు. అటువంటి సంప్రదాయం ప్రపంచమంతటా ఉంది. ఎన్నో దేవాలయాలూ ఉన్నాయి. కొంచెం బిడియపడె సంస్కృతులు పెరిగిన తర్వాత, ఈ దేవాలయాల్ని కూలదోయడం జరిగింది. ఇప్పటికీ మనదేశంలో ఇలాంటివి చాలా దేవాలయాలు మిగిలే ఉన్నాయి. అందులో ప్రసిద్ధివహించిన కామాఖ్య దేవాలయం అన్నిటిలోకీ పెద్దది. కానీ స్త్రీ శక్తిని లింగాకృతిలో సేవించడం అరుదు. ఇలాంటి దేవాలయాలు కొన్ని ఉన్నా, అవి నలుగురి దృష్టిలో  పడకుండా, ఏ మారుమూలో విసిరేసినట్టున్న చిన్న చిన్న దేవాలయాలు చాలా ఉన్నాయి. బహుశా ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా, పూర్తిగా భిన్నంగా నిర్వహిస్తున్న దేవాలయం, ఇదే మొట్టమొదటిదేమో. ఇది చాలా చాలా తీక్షణమైన స్త్రీ శక్తి స్వరూపం.

ప్రపంచంలో వస్తున్నవిచారకరమైన మార్పు ఏమంటే, స్త్రీలందరూ అలంకరించిన ఆట వస్తువుల్లా, బార్బీ బొమ్మల్లా, తయారవుతున్నారు. వాళ్లలో స్త్రీసహజమైన ఉద్దీపనము ఉండడం లేదు. వాళ్ళు కేవలం అసూయతో, అర్థంలేని ఆలోచనలతో, మగవారి లక్ష్యాలు అనుకరిస్తూ, తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నారు తప్ప కాళికాదేవికుండవలసిన తీక్ష్ణత వాళ్ళలో కనిపించటం లేదు. స్త్రీలు కాళిలా ఉండాలి. ఆమె అగ్నిలా ఉండగలగడమే స్త్రీ ఈ ప్రపంచానికి అందించగలిగింది.

స్త్రీశక్తి అంటే కేవలం తగువులాడడం, ఆగ్రహం అసూయ కావు; స్త్రీ సహజమైన అవేశము ఎప్పుడూ సృజనాత్మకమైనదే.

లింగభైరవి స్త్రీ ఉండవలసిన నిప్పులాంటి శక్తిస్వరూపం. నిజమైన జ్వాల. మన సంస్కృతిలో స్త్రీ ఎప్పుడూ మగవాడికి నిప్పులాంటిదే. మగవాళ్ళు బయటకి వెళ్ళి ఏదో సాధించవచ్చు. కాని అతనికి నిజమైన ప్రేరణ ఆమే. మగవాడి వెనక ఉండే నిజమైన శక్తి ఆమెదే. ఇప్పుడా శక్తి చాలా వరకు కనిపించకుండా పోయింది. స్త్రీ శక్తి అంటే కేవలం తగువులాడడం, ఆగ్రహం అసూయ కావు; స్త్రీ సహజమైన అవేశము ఎప్పుడూ సృజనాత్మకమైనదే. మగవాడి జీవితానికి స్త్రీ అందించగలిగింది అదే... కాకపోతే వేరొక స్థాయిలో చేసుకుంటూనే పోతుంది. ఇప్పుడి స్త్రీలంతా అయతే బొమ్మల్లా ఉంటున్నారు లేకపోతే  మగాళ్ళలా తయారవుతున్నారు. అది మీకు కనిపిస్తోందా? చాలామట్టుకు స్త్రీలు అయితే బొమ్మల్లా తయారవుతున్నారు, లేకుంటే మగవాళ్లలా ప్రవర్తిస్తున్నారు. వాళ్లలో నిజమైన స్త్రీత్వం లేదు. నేను గత 20 సంవత్సరాలుగా దీనిగురించే ఆలోచిస్తున్నాను. ఏ రకమైన స్త్రీమూర్తి అయితే పరిపూర్ణమైన స్త్రీ శక్తిని ప్రతిబింబించగలదా అని. మీరు బహుశా ఖాట్మండు వెళ్లి ఉంటే, కొన్ని దేవాలయాల్లో శివుని కళేబరం మీద కాళి నిలబడి ఉండడం మీరు చూసే ఉంటారు. మీరెప్పుడైనా చూసేరా? ఆమె ఆగ్రహంలో అతన్ని వధించి మళ్లీ సజీవుణ్ణి చేసింది. ఈ బొమ్మల్ని యదార్థాలుగా తథంగా స్వీకరించకూడదు. అవి ప్రతీకలు.

లింగభైరవికి 3 1/2 చక్రాలున్నాయి. మూలాధార, స్వాధిష్థాన, మణిపూరక, అనాహతలో సగం. అనాహతలో ఒకదానినొకటి ఖండించుకునే రెండు త్రికోణాలున్నాయి. అందులో దేవికి ఒకటే ఉంది. అది ఉద్దేశ్యపూర్వకంగా చేసినది. కారణం ఆమె ధ్యానలింగంలో సగభాగం. ఈ ముఖ్యమైన వ్యవస్థని "రసదండ" - గత పదిన్నర నెలలుగా అనేక వడపోతల తర్వాత మిగిలిన పాదరసంతో నింపిన రాగి గొట్టంలోకి అమర్చడం జరిగింది. ఈ రస దండమే దేవి ముఖ్యశక్తికి మూలాధారం. ఏ క్షణంలో రసదండం దేవిలో ప్రవేశించిందో, ఆ క్షణంలోనే నిజంగా అవతారం దాల్చినట్టు లెక్క.  మేము ద్రిధదండ కూడా తయారు చేశాం. అందులో ఘనరూపంలో ఉన్న పాదరసం ఉంచబడింది. ఈ రెండూ... అంటే రసదండ... ద్రిధదండ ... ఎల్లప్పుడూ జమిలిగా ప్రతిధ్వనించి... సంకల్పాలు కార్యరూపందాల్చేలా చేస్తాయి.

మీలో "టెస్టోస్టిరోన్" ఎక్కువగా స్రవిస్తే, మీ లోని పురుషాంశ ప్రభావం ఎక్కువై, స్త్రీ అంశ వెలుగుచూడదు.

మూడున్నర చక్రాలు... అంటే ఆమె సగం స్త్రీ అనా? కాదు. ఆమె పరిపూర్ణ స్త్రీయే. ప్రతి మానవుడిలోనూ సగభాగం స్త్రీ అంశ, సగభాగం పురుష అంశ. కాకపోతే, ప్రతి వ్యక్తిలోనూ, శరీరంలోని హార్మోనుల ప్రభావం వల్ల ఒక అంశ రెండవదాన్ని కప్పివేస్తుంది. మీలో "టెస్టోస్టిరోన్" ఎక్కువగా స్రవిస్తే, మీ లోని పురుషాంశ ప్రభావం ఎక్కువై, స్త్రీ అంశ వెలుగుచూడదు. మీలో "ఈస్ట్రోజన్" ఎక్కువగా స్రవిస్తే, మీలో స్త్రీ అంశ ప్రబలమై పురుషాంశ వెలుగుచూడదు. ఆ రెండూ ... పురుషాంశ, స్త్రీ అంశ... సమాన స్థాయిలో ఉన్నవారెవరూ లేరిక్కడ. ఇక్కడ మనకొచ్చే సందేహం, హార్మోనుల ప్రభావం వల్లనయితేనేమి, సామాజిక కట్టుబాటవల్లనయితేనేమి... అది ఈ రెండురకాలుగా జరగడానికి ఆస్కారం ఉంది... మనం ఈ రెండింటిలో ఒక అంశని ఎంతవరకు తొక్కిపెడుతున్నామన్నది. కానీ దేవి కేవలం స్త్రీ అంశ. ఆమెలోంచి, పురుషాంశ తీసివేయబడ్డది. ఆమె పూర్తి శక్తి స్వరూపం. ఇలా చేయడం  ప్రమాదమే...!! ఆమెలో పురుషాంశ ఏమాత్రం లేదు. ఆమె అచ్చమైన స్త్రీ మూర్తి.

కనుక ఇందులో అనేక కోణాలున్నాయి. వాటన్నిటినీ తర్కబద్ధంగా విశదీకరించడం కష్టం. ఇది అత్యున్నత స్థాయిలో ఉన్న "స్వాధిష్టాన " చక్రం. అయితే దానిలో ఏ లైంగిక భావనలూ లేవు. స్వాధిష్టాన చక్రం మౌళికంగా వ్యక్తి పునరుత్పత్తి సామర్థ్యానికి సంకేతమూ, కేంద్ర బిందువు అయినప్పటికీ, అది వ్యక్తి ఉనికికి మూలం కూడా. పునరుత్పత్తి కార్యక్రమం దాని అదనపు చర్య. లింగభైరవిని ప్రతిష్ఠించడంలో ఉన్న పెద్ద సవాలు అందులో ఏ లైంగికతా జోడించకుండా అత్యున్నత స్థాయి ఆవేశంలో నిర్మించడం. ఆ అగ్నిగోళం ముందు పునరుత్పత్తి శక్తికూడా దగ్ధమౌతుంది. చిరుమంట కామోద్దీపన కలిగించవచ్చు. కానీ, నిజమైన అగ్నికీలలు చెలరేగినపుడు, మనసు ధ్యానం వైపు మరలుతుంది. కనుక ఆమె మహోన్నత జ్వాలలు సృష్టించే స్త్రీ. చిన్న వేడిపుట్టించే స్త్రీ కాదు. ఆమె ఆట బొమ్మ కాదు, పురుషుడు కాదు, అంతరాంతరాల్లో ప్రతి అణువునా స్త్రీత్వం మూర్తీభవించినది. నాకున్న భయమల్లా, ధ్యానలింగం కంటే దేవి ఎక్కువ ప్రాముఖ్యత సంపాదిస్తుందేమోనని ...!!

ప్రేమాశిస్సులతో,
సద్గురు