గోపాల గోపాల- లీల # 5

 
Isha Hatha Yoga participants doing Surya Namaskar
 

గోపాల గోపాల పాట అర్ధాన్ని, కృష్ణుని వివిధ కోణాలను - అతని అందం, అతని ధైర్యం, అతను జీవిత మాధుర్యం ఎలా గ్రోలాడో సద్గురు మనకు వివరిస్తారు.


గోపాల గోపాల గోపీ వల్లభ గోపాలా గోవింద గోవింద రాస లీలా గోవింద

గోపాల గోపాల గోపి వల్లభ గోపాలా గోవింద గోవింద యదుకుల శూరా గోవింద

గోపాల గోపాల గోపి వల్లభ గోపాలా గోవింద గోవింద మురళి లోలా గోవింద

గోపాల గోపాల గోపి వల్లభ గోపాలా గోవింద గోవింద రాధే మోహన గోవింద

గోపాల గోపాల గోపి వల్లభ గోపాలా గోవింద గోవింద శ్యామ సుందర గోవింద

గోపాలా అంటే ఏమిటి? దాని అర్ధం ఏంటి? ‘గో’ అంటే ఆవు అని అర్ధం. పాల అంటే “దాని ఆలనా పాలన చేసే వాడు”. కృష్ణుడిని ఆవుల పాలన చేసేవానినిగా చూస్తారు. సాధారణంగా దైవత్వాన్ని గొప్ప యోగులలోనో లేక కొందరి రాజుల రూపంలోనో గుర్తించారు – కానీ ఒక ఆవుల కాపరిగా... సమాజంలో అతను తక్కువ స్థాయిలో ఉన్నాడు. అందుకనే గోపాల అంటారు. అతను కేవలం ఒక ఆపుల కాపరి మాత్రమే – కాని మీరు ఆయన్ని విస్మరించలేరు. అతని అందం, అతని తెలివితేటలు, అతని బలం, అతని శౌర్యం మొదటి నుండీ పట్టించుకోకుండా ఉండటం సాధ్యం కాదు. అతను ఒక చిన్న శిశువుగా ఉన్నప్పుడు కూడా పట్టించుకోకుండా ఉండలేకపోయారు. చాలా మంది ఆయన్ని “అతను కేవలం ఒక ఆవుల కాపరి” అంటూ పట్టించుకోకుండా ఉండాలని ప్రయత్నించారు. కానీ అదే అందరికీ ఒక వేడుకలా తయారయ్యింది. “అతను ఒక ఆవుల కాపరి!” మనం ఆయన్ని గోపాల అని పిలిచినప్పుడు మనం ఆయన్ని ప్రేమగా పిలుస్తున్నామనే. మనం ఆయన్ని గోవిందా అన్నప్పుడు ఆయన్ని ఒక దేవుడిగా వంగి నమస్కరిస్తున్నాము. ఈ క్షణంలో ఆయన ఒక దేవుడు, మరుక్షణం అతను ఒక పిల్లవాడు, ఆ తరువాత క్షణం అతను కేవలం ఒక మనిషి మాత్రమే – ఒకే సమయంలోఆయన ఇవన్నీ.

లీల అంటే ఆట అని అర్ధం. జీవితంలోని ప్రగాడమైన పార్శ్వాలను, ఈ ఉనికి యొక్క పరమోత్తమ స్వభావాన్ని ఉల్లాసభరితమైన విధానంలో అందిచవచ్చు. ‘రస’ అంటే ఈ జీవితంలోని సారం అనవచ్చు. రాసలీలా గోవిందా అని అన్నప్పుడు ఆయన లోని సారంతో ఆట ఆడుకున్నాడని అంటున్నాము. నెలలో ప్రత్యేకమైన సమయాల్లో లేక పనులు అయిన తరువాత సాయంత్రాల్లో, ఆయన ఏర్పాటు చేసిన నాట్య వేళల్ని రాసలీల అని అంటారు. దానర్ధం “జీవితం యొక్క రసంతో ఆట ఆడుకోవటం” అనే. కోపం లేని, కోరిక లేని కేవలం జీవితంగా ఇది మెల్లగా గుర్తింపు పొందింది. జీవితం యొక్క రసం అలా ప్రవహించేది, ఎందుకంటే అక్కడ కోపం కాని, కోరిక కాని లేదు. అందువల్ల ఈ నాట్యం కేవలం ఒక నాట్యంగానే మిగలలేదు, అది పరిణామానికి ఒక విభిన్న కోణంగా అవతరించింది.

ఈ అంశాన్ని ఎన్నో విధాలుగా ముందుకు తీసుకువచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కృష్ణ సంప్రదాయం వివిధ రకాలుగా అభివృద్ధి అయ్యింది ఎందుకంటే భారతదేశంలో బహుళ సంప్రదాయల మనుగడ ఉంది. తమిళనాడులో వాళ్ళు “ఆసైయుం, కోపముం ఇల్లా నగరం” అంటూ పాడతారు. వాళ్ళు అక్కడ కోపానికి, కోరికలకు తావులేదని పాడుతున్నారు. ఒకసారి కోపం, కోరిక లేకపోతే దేనికోసమో స్వార్ధంతో ఎదురుచూసే వాడుగానే మనిషి మిగిలిపోడు, అతను ప్రేమానందాలతో నిండిపోతాడు.
ఆ తరువాత మనం “యదుకుల శూరా” అంటున్నాము. ఆయన యాదవుల కులానికి లేక యదు వంశానికి చెందిన వాడు. అది ఒక రాజవంశం. కొన్ని రాజవంశాలు సూర్య వంశానికి చెందినవి అయితే కొన్ని చంద్ర వంశానికి చెందినవి. యాదవులు చంద్ర వంశానికి చెందిన వాళ్ళు. కనుక యదుకులం అని అన్నప్పుడు అది ఒక వంశాన్ని సూచిస్తుంది. శూరా అంటే “ధైర్యం కలిగిన లేక సాహసోపేతమైన వ్యక్తి” అని అర్ధం. కానీ అలాగే అది ఆయన పుట్టిన ఒక తెగ పేరు కూడా. ఆయన తండ్రి వసుదేవుడు కూడా ఒక శూరుడే. దాన్ని రెండు విధాలుగా వాడుతున్నారు.

ఆ తరువాత మనం అంటున్నది “మురళీ లోలా”, దానర్ధం “ వేణువును ఊదటానికి ఇష్టపడే వాడు”. మురళి అంటే “వేణువు”. తన వేణుగానంతో అందరినీ సమ్మోహనపరిచేవాడు కనుక మురళి లోలా. ఆ తరువాత మనం “రాధే మోహన” అనేది చూద్దాము. దానర్ధం “రాధను ప్రేమించిన వాడు” లేక “ రాధను మైమరచిపోయేలా చేసిన వాడు”. దీన్ని రెండు విధాలుగా అనుకోవచ్చు – రాధ వల్ల మైమరచిపోయిన వాడు, అలాగే రాధను మైమరపింన వాడు.

చివరి పంక్తి “శ్యామ సుందరా”. సుందరా అంటే “అందమైన వాడు,” శ్యాం అంటే “సాయంత్రం” అని అర్ధం. ఆయన చర్మం రంగు వల్ల కృష్ణుడు నల్లటి అందం కలిగిన వాడయ్యాడు. ఆయన సంధ్యా సమయంలాంటివాడు. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆకాశంలో ఉండే నీలి రంగు పోయి దట్టమైన, నలుపుకు దగ్గరిగా ఉన్న నీలి రంగుకు వస్తుంది – అదే ఆయన రంగు. అందువల్ల ఆయన్ని శ్యామ సుందరా అని పిలుస్తారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1