సృష్టిలోని జీవరాశి అకశేరుకాలు (వెన్నెముక లేనివి) నుండి సకశేరుకాలు (వెన్నెముక ఉన్నవి) గా పరిణామం చెందటం శారీరిక పరంగా ఓ అద్భుతమైన అభివృద్ధి . ఆ తరవాత , సమాతరంగా ఉన్న  వెన్నెముక నిటారుగా మారడం మెదడు ఎదుగుదలలో మరో ముందడుగు

వెన్నెముక నిటారుగా మారిన తరవాతే మెదడు అభివృద్ది చెందిందనడానికి తగినన్ని వైజ్ఞానిక ఆధారాలున్నాయి.

ఇటువంటి అవగాహన ఉంది కనుకనే  కొద్దిమంది యోగులు ఎప్పుడూ పడుకోరు, వారి వెన్నెముకని వాల్చరు, నిటారుగానే ఉంచుతారు. నిద్రాపోవలసి వచ్చినప్పుడు కూడా కూర్చునే నిద్రపోతారు . ఎవరైనా సరే తమజీవితకాలంలో అద్భుత పరిణామాన్ని చవిచూడాలంటే, వెన్నెముకని సాధ్యమైనంత మటుకు నిటారుగా ఉంచడం ఎంతో అవసరం . వెన్నెముకని నిటారుగా ఉంచుతూ , అ భంగిమల్లోనే విశ్రాంతిగా ఉండడమేలగో మీకు తెలిస్తే , మీ శరీరానికి నిద్ర అనే అవసరం ప్రామాణికంగా తగ్గుతుంది. నిటారుగా ఉంటూ  మీ శరీరాన్ని విశ్రామింపజేయడం మీకు చేతకావట్లేదు  కాబట్టే మీకు నిద్రించాల్సిన  అవసరం అలా పెరుగుతూ ఉంటుంది..

యోగి అంటే తన శరీరాన్ని అనునిత్యం రూపాంతరం చేసుకుంటూ స్వర్గానికి నిచ్చెనవేసేవాడు!

యోగి అంటే తన శరీరాన్ని అనునిత్యం రూపాంతరం చేసుకుంటూ స్వర్గానికి నిచ్చెనవేసేవాడు! అలా జరగాలంటే వెన్నెముకపై ఎంతోకొంత ఆధిపత్యం ఉండాలి. అందుకే మన సాంప్రదాయంలో స్వర్గానికి ౩౩ మెట్లున్నాయని అంటారు. దాన్ని కొంతమంది చిత్రకారులు దేవుణ్ణి ఎక్కడో పైన కూర్చోపెట్టి, 33 మెట్లు గీసారు! అంటే దానర్ధం అది కాదు. మీ వెన్నెముకలో 33 బోమికలున్నాయని, మీరు తలచుకుంటే అదే వెన్నెముకని మీ చైతన్యాన్ని చేరుకునే మాధ్యమంలా ఉపయోగించవచ్చు, పరమానందభరితులు కావచ్చు. లేదా ఎప్పుడూ నొప్పితో పీడించే వెన్నెముకతో బాధపడుతూ ఉండొచ్చు. యోగాలోని ఓ అంశం, మనజీవితంలోని సాధ్యకతలన్నిటినీ, చివరకి ఆధ్యాత్మిక అవకాశాలను కూడా, వైజ్ఞానిక శాస్త్రంలా అందించడం . ఇది మొదలు పెట్టడానికి మీకు ఎటువంటి నమ్మకాలూ ఉండక్కర్లేదు. కొద్దిగా అర్ధం చేసుకుని ఓ ప్రయోగంలా మొదలుపెట్టి చూడండి. ఉదాహరణకి ఓ రసాయనిక చర్యనే తీసుకోండి, ఒక్క భాగం హైడ్రోజన్ ని రెండు భాగాల ఆక్సిజన్ని కలిపితే నీరౌతుంది. ఈ ప్రయోగం ఎవరు చేసినా సరే, ఓ గొప్ప శాస్త్రవేత్త చేసినా ఓ మూర్ఖుడు చేసినా, అదే జరుగుతుంది . అలాగే యోగా కూడా ఎంతో సరళంగా అందరికీ అర్ధమయ్యేలా చేయబడింది , మీరిది ఇలా ఇలా, ఇలా చేయండి... తప్పక అలాగే జరుగుతుంది , అదే ఫలితాన్నిస్తుంది

మనకో సరైన అవగాహన , అనుభూతి కలగడానికి మానవ శరీరంలోని పార్శ్వాలన్నిటినీ, ఐదు శరీరాలుగా/పొరలుగా విభజించాము,ఇది మన శరీరాకృతిని సరిగ్గా అర్ధం చేసుకోడానికే . ఈ పొరల్ని అన్నమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం , ఆనందమయ కోశం అని అంటాం. అన్నమయ శరీరమంటే ‘అన్న శరీరం’ , దీన్నిలా ఎందుకంటున్నామంటే ప్రస్తుతం మీ శరీరం ఇన్నేళ్ళుగా మీరు పోగుచేసుకున్న ఆహారమే కదా?మీరు పుట్టినప్పుడెంత చిన్నగా ఉన్నారు? క్రమేపీ ఇంత పెద్ద రాశిగా మారారంటే, అది మీరు తీసుకున్న ఆహారం వల్లే కదా?

రెండో పోరని మనోమయ కోశమని అంటాం , అంటే అది మానసిక శరీరమన్న మాట . ఇప్పుడు డాక్టర్లు మీరు  శరీరం – మనసుల సమ్మేళనమని అంటున్నారు . మానసిక రుగ్మతలున్నవారు, శారీరకంగా వ్యాధిగ్రస్తులౌతున్నారంటే అందుకు కారణం వారున్న మానసిక స్థితే. భౌతిక కాయం లానే మానసిక కాయం కూడా ఉంటుంది. మన శరీరం లోని ప్రతీ కణానికి తనదంటూ ఓ మేధస్సు ఉంటుంది , అందుకే మానసిక శరీరం రూపుదిద్దుకుంది . మానసికంగా జరిగేవాటి ప్రభావం శరీరంపై ఉండి తీరుతుంది . అలాగే శరీరంలో జరిగేవి మనసుని తప్పక  ప్రభావితం చేస్తాయి. ఈ రెండూ పరస్పర చర్యలు .

ప్రాణమయ కోశానికి తనదంటూ నిర్దిష్టమైన ప్రకంపనలుంటాయి, మీ మానసిక,  భౌతిక శరీరాల నడవడి వాటి ప్రకంపనలు కూడా వాటికి అనుగుణంగానే ఉంటాయి.

ప్రస్తుతం మీ అనుభూతి పరిధిలో ఉన్నవి, మీ శరీరం, మీ మనసూ, మీ భావావేశాలు. ఈ మూడూ ఇలా పనిచేస్తున్నాయంటే వాటినో శక్తి ఇంధనంలా నడిపిస్తోందన్న విషయం మీరు గ్రహించాలి. ఆ శక్తే లేకపోతే ఏదీ కదలదు. ఉదాహరణకి ఓ microphone (మైక్) ఏ ధ్వనినైనా ఎన్నో రెట్లు పెంచుతుందన్నసంగతి మనందరికీ తెలుసు, మీకు దాని అవగానా బొత్తిగా లేకపోయినప్పటికీ, దాని వెనుక ఉన్నఓ విద్యుత్తు మూలంతో అది పనిచేస్తుందని మీరు గ్రహిస్త్రారు. మీ శరీరంలోని మూడో పార్శ్వాన్ని ప్రాణమయ కోశమని అంటారు.

ప్రాణమయ కోశానికి తనదంటూ నిర్దిష్టమైన ప్రకంపనలుంటాయి, మీ మానసిక,  భౌతిక శరీరాల నడవడి వాటి ప్రకంపనలు కూడా వాటికి అనుగుణంగానే ఉంటాయి. యోగ ప్రక్రియ ఎప్పుడూ ఈ ప్రాణమయ కోశాన్నిఉద్దేశించే ఉంటుంది , దీన్ని మీరు సరిగ్గా నిర్వహించుకోగలిగితే , భౌతిక శ్రేయస్సు దానంతట అదే వస్తుంది

ఈ భౌతికసృష్టి మూలమంతా ప్రాణమయ కోశంలోనే ఉంది , మీ ‘ప్రాణం’ లేదా ప్రాణమయ కోశంపై కొంత పట్టూ, ఆధిపత్యం వచ్చినప్పుడు మీ జీవితారోగ్యాలేకాదు మీ పరిస్థితులపై కూడా మీకో ఆధిపత్యమొస్తుంది . మీ జీవశక్తులలో సమతుల్యం వస్తున్నకొద్దీ, జీవిత పరిస్థితులు కూడా, మీరు తలచుకునేలోపే మీకనుగుణంగా, సాఫీగా జరిగిపోతూ ఉంటాయి. జీవితంలో అంతగా శ్రమ పడాల్సిన అవసరముండదు. సునాయాసంగానే  పనులన్నీ సజావుగా  జరిగిపోతూ ఉంటాయి. రోజుల తరబడి, రోజుకి 24గంటల పాటు  పని చేసినా సరే వత్తిడి అలసటా అంటే ఏమిటో కూడా తెలియదు!

మీరోసారి నా నాడిని పట్టుకుని పరీక్షిస్తే , అది 40 లోపే ఉండడాన్ని గమనిస్తారు , ఆకలి వేసి ఆహారం తీసుకున్నాకా 42 నుండి 45 వరకు ఉండవచ్చు. అటూ ఇటూ చురుగ్గా తిరిగినప్పుడు 50 -  55 ఔతుంది. నేను గబగబా మెట్లెక్కి దిగిడం లాంటిదేదో చేసినప్పుడు  మాత్రమే ఇంతకంటే కొంచెం పెరుగుతుంది. శరీరం ఈ విధంగా ఉన్నప్పుడు నిద్రావస్థలో ఉన్నంత విశ్రాంతిగా ఉంటుంది. ఐతే దీని ప్రత్యేకత ఏమిటంటే, గాఢనిద్రలో ఉన్నంత విశ్రాంతిగా  ఉంటూనే ఎంతో చురుగ్గా  ఉంటారు, ఇక వత్తిడనేది మీ జోలికి రాదు!

భౌతిక శరీరం ,మానసిక శరీరం, శక్తి శరీరం, ఈ మూడు పార్శ్వలని ఓ సమన్వయంలో, ఓ సమలేఖనంలోకి తీసుకునివచ్చినప్పుడు, మనలో (నిగూడంగా) నిక్షిప్తమైఉన్నది, దేన్నైతే సృష్టిమూలం అని అంటామో అది,దాని పని నిరాటంకంగా చేసుకుంటూ పోతుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

PC: Vimeo.com