పేదరికం అనేది దైవ నిర్ణయమా??

 

పేదరికం దైవ నిర్ణయం అని కొంత మంది అంటుంటారు. ఒకవేళ తమ పిల్లలు ఆకలితో ఉంటే ఏదోకటి చేసేవారు, వేరే పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు ఇలా అనడం తగదని, నిజానికి మనం చేయగలిగింది చేయకుండా ఇలాంటి సాకుల ద్వారా తప్పించుకుంటున్నామని సద్గురు చెబుతున్నారు.

ఎవరైతే సామర్థ్యం కలిగి ఉన్నారో.. వారు వెయ్యిమంది ప్రజల ఆహారాన్ని తినేయ్యాలని - అనుకుంటున్నారు. ఎవరికైతే సామర్థ్యం లేదో..లేదా జీవితంలో వివిధ పరిస్థితుల వల్ల వారి సామర్థ్యాన్ని చూపించుకోలేకపోయారో.. వారికి తినడానికి ఏమీ లేదు. ప్రజలు భగవంతుడి కృప లేకపోవడం వల్ల తినలేక పోవడం కాదు..ఇది మనం మన మానవత్వం మరచిపోవడంవల్ల - ఇలా జరుగుతోంది.  ఔనా..?మనం మన మానవత్వాన్ని మరచిపోయాం. అందుకే,  కొంతమంది ప్రజలు తినడం లేదు. అంతేకానీ భగవంతుడు మీకు ఇలా చెయ్యడం వల్ల కాదు. ఒకసారి ఇలా జరిగింది... పేదరికాన్ని అరికట్టడం గురించిన ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో ఇలా జరిగింది. నేను, ఇటువంటి వాటికి వెళ్ళడం కొద్ది సంవత్సరాలుగా మానేశాను. ఎందుకంటే, ఇలాంటి కాన్ఫరెన్స్ లు అద్భుతమైన రిసార్టులలో జరుగుతాయి. అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఎవ్వరూ కూడా దీనిపట్ల గంభీరత కలిగి ఉన్నట్లు కనిపించరు. వాళ్ళు మళ్ళీ  తరువాతి సమావేశం ఎప్పుడు పెట్టుకుందాం - అని చూస్తూ ఉంటారు, అంతే..!!

మీ కడుపులో ఆకలి వేస్తే,  మీరు ఏదో ఒక చర్య చేస్తారు. కానీ, ఎవరిదో కడుపు ఆకలితో ఉంటే - అది దైవ నిర్ణయం అయి ఉండాలి.

ఈ సమావేశాలకు ఎంతో బాధ్యతగల ప్రజలు, కొంతమంది నోబుల్ లారేట్స్ వంటి వారు వచ్చేవి. ఎన్నో విషయాలని, ఇక్కడ చర్చిస్తారు. ప్రాధమికంగా, ‘ప్రభుత్వాలని ఎలా ప్రభావితం చేయవచ్చు’ అన్నదాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు, వాళ్ళ సామర్థ్యం ప్రకారం తినడం కాదు, దేశాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి..!! ఎవరికైతే తినడానికి సరిపడా లేదో, కనీసం ఆహారం స్థాయిలో అయినా పంచుకోడానికి సిద్ధంగా ఉండాలి. మిగతావన్నీ లేకపోయినా కనీసం ఆహారం..ఎందుకంటే, కొన్ని ప్రభుత్వాలు, వారి రైతులకి పంట పండించవద్దు - అని సబ్సిడీలు అందిస్తున్నాయి. ఆహారపు నిలవలు అంత ఎక్కువ అయిపోయినాయి. చూడబోతే 50శాతం ప్రజలు ఆకలితో ఉన్నారు. సరే.! ఇలాంటి పరిస్థితిలో, ఒకతను  బాగా  మతపరమైన  చెత్త  ఉన్నటువంటి మనిషి, ఇలా  చెప్తున్నాడు.. ఇవన్నీ   మనం  ఎందుకు చర్చించుకుంటున్నాం.. ఇదంతా భగవంతుడి లీల కాదా..?  అని. అంటే నేను తినాలి మీరు తినకూడదు - అన్నది భగవంతుడి లీల. మరెవరో పిల్లలు ఆకలితో చనిపోతూ ఉంటే భగవంతుడి లీల. కానీ, మీ కడుపులో ఆకలి వేస్తుంటే, అప్పుడు మీకు మీరే ఏదో ఒక చర్య తీసుకుంటారు..చెయ్యరూ..?అవునా..? కాదా..?

మీకు ఆకలి వేస్తే,  మీరు ఏదో ఒకటి చేస్తారు. కానీ, ఎవరిదో కడుపు ఆకలితో ఉంటే - అది దైవ నిర్ణయం అయి ఉండాలి. దివ్యత్వం పేరు చెప్పి, మనం మన మానవత్వాన్ని వదిలేస్తున్నాం. ప్రపంచం పరిస్థితి ప్రస్తుతం ఇలా ఉంది. అందుకని ప్రపంచం ఉన్న తీరుని చూసి ఏడవడం ఆపేయండి. మీ పరిధిలో, మీరు ఎంతవరకు చేయగలరో చూడండి. “అయ్యో! ప్రపంచం ఎందుకు ఇలా ఉంది..? భగవంతుడు కోపంగా ఉన్నాడా..?” ఈ చెత్త అంతా వదిలెయ్యండి..! మీ చుట్టూరా, మీరు ఏ కొద్దిపాటి చెయ్యగలరో  చూడండి. మీ సామర్థ్యం ఎంతో పెద్దది అయితే -  మనం సామర్థ్యం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మీరు పది వేల మంది ప్రజలకి భోజనం పెట్టండి. మీ సామర్థ్యం చిన్నదైతే, మరొక మనిషికి భోజనం పెట్టండి.

మనం దేనినైతే దివ్యత్వం అంటున్నామో అది ఈ సృష్టికి మూలం.

మీరు గనక ఎంతో సామర్థ్యం గల శివుడు అయితే, పదివేల మందికి భోజనం పెట్టండి. మనం ఎప్పుడూ ప్రతిదానికీ కూడా.. దైవ నిర్ణయం అని అనుకుంటున్నాం. నిజానికి, దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకోవడం లేదు. మనం దేనినైతే దివ్యత్వం అంటున్నామో అది ఈ సృష్టికి మూలం. ఇదంతా మీ బుర్రలోకి ఎలా వచ్చింది..? ముందు మీరు మీ తల్లి గర్భం లోనుంచి వచ్చారు. మీ కళ్ళు తెరిచి చుట్టూరా చూశారు. ఎంతో సృష్టి..!! ఖచ్చితంగా మీరు తయారు చేయలేదు. మీరు పిల్లవాడిగా ఉండి ఇంత సృష్టి ఉంది అంటే, అక్కడ ఎవరో కూర్చుని ఉండి ఇదంతా చేస్తూ ఉండి ఉండాలని అనుకున్నారు. అవునా..? ఈ సృష్టిని సృజించారు కాబట్టే ఒక సృష్టికర్త ఉంటాడు - అని ఊహించుకున్నారు. మీరు పెరిగిన సంస్కృతి వాతావరణం ప్రకారం, మీరు ఈ సృష్టి కర్తని రకరకాలుగా ఊహించుకున్నారు. ఎందుకంటే, మీరు ఈ సృష్టిని స్పృశించినప్పుడే, మీకు ఈ ఆలోచన వచ్చింది. నిజానికి మీరు దేనినైతే దివ్యత్వం అంటున్నారో - అది ఈ సృష్టికి మూలమైనది. దానికి ఎటువంటి పక్షపాతాలూ లేవు. ఎటువంటి నిర్ణయాలూ లేవు. అది ఒక నిర్దిష్టమైన శక్తి.  మీరు దానినుంచి ఏమైనా చేయవచ్చు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1