మనం ఎన్నడూ కూడా నదులను జలాశయాలుగా, భౌగోళిక విషయాలుగా చూడలేదు, మనం వాటిని జీవాన్ని సృష్టించే ప్రాధమిక అంశాలుగా చూశాం. ఎందుకంటే మన శరీరంలో 72శాతం కన్నా ఎక్కువ నీరు ఉంది. అలాగే ఈ భూగోళంలో 70 శాతం కన్నా ఎక్కువ నీరు ఉంది. మనం జీవం కోసం చూస్తే, మనం ముందు నీటి బిందువు కోసం చూస్తాము. మానవ జీవితాన్ని పరివర్తన చేసే లేదా దానికి అతీతంగా తీసుకెళ్ళే ప్రాధమిక శాస్త్రాన్ని భూతశుద్ధి అంటారు - అంటే పంచభూతాల శుద్ధి. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ - ఎందుకంటే ఈ పూర్తి ప్రపంచం, ఈ పూర్తి శరీరం, ఈ భూగోళం, ఈ సౌర మండలం, అన్ని చోట్లా ఉన్న వివిధ జీవాలు మరియు రూపాలు, అన్నీ కూడా కేవలం ఈ పంచభూతాల నుండి మాత్రమే సృష్టించబడ్డాయి. కానీ ఐదు మిలియన్ల నుండి కాదు, కేవలం ఈ ఐదింటి నుండి మాత్రమే సృష్టించబడ్డాయి. ఈ ఐదు కూడా ఎంతో అద్భుతంగా ఎన్నో లక్షల విధాలుగా దగ్గరకి వచ్చాయి, ఒక దానితో ఒక దానిని పోల్చినప్పుడు అవి ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. కానీ అవి కేవలం ఈ ఐదింటి నుండే సృష్టించబడ్డాయి.

కాబట్టి ఎవరైనా వారి స్వీయ భౌతిక స్వభావాన్ని అధిగమించాలనుకుంటే, అలా చేయడానికి ప్రాధమికమైన, ప్రభావవంతమైన విధానం భూతశుద్ధి ప్రక్రియను చేయడం. యోగా శాస్త్రం అంతా కూడా భూత శుద్ధి ప్రక్రియ నుంచే, అంటే మీ పంచభూతాల మీద పని చేయడం నుంచే ఏర్పడింది - మీరు కనుక మీ పంచ భూతాల మీద పట్టు సాధిస్తే, సర్వం మీ నియంత్రణలో, మీ పట్టులో ఉంటుంది. నీరు 72%, భూమి 12%, గాలి 6%, అగ్ని 4%, మిగతాది అంతా ఆకాశం. మనం వీటి మీద పట్టుని సాధిస్తే, ఈ నాలుగు లేదా ఐదు అంశాల మీద పట్టు సాధిస్తే, అన్నీ కూడా మన నియంత్రణలో ఉంటాయి. ఈ పంచ భూతాల మీద పట్టు సాధించిన వ్యక్తిని ఈ విశ్వానికే గురువుగా భావిస్తారు. నీరు ముఖ్యమైనది. ఎందుకంటే 72% నీరే. మనం ఈ శరీరంలోని నీటిని శుభ్రంగా, శుద్ధంగా ఉంచుకుంటే, ఆరోగ్యం, శ్రేయస్సు వాటంతట అవే సంభవిస్తాయి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.